₹1000 కోట్లు అంచనా vs వాస్తవం – 'కూలీ' ఎక్కడ దెబ్బతింది?
స్టార్ పవర్ ని సాటిస్ఫై చేయలేని హైప్;
రజనీకాంత్ దశాబ్దాలుగా ప్రేక్షకులను తన స్టార్ పవర్‌తో ఆకర్షిస్తూ వస్తున్నారు.కానీ 2010 తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర ఆయన ప్రయాణం కంటిన్యూ సక్సెస్ లని ఇవ్వలేకపోయింది. ఈ వయస్సులోనూ ఇప్పటికీ ఆయనకు స్టార్ ఆరా ఉన్నప్పటికీ, గత పదిహేను ఏళ్లలో ఆయన సినిమాలలో కేవలం రెండు లేదా మూడు మాత్రమే కమర్షియల్ గా బ్లాక్ బస్టర్స్ సాధించాయి. కొచ్చాడియన్, కాలా, లింగా, వెట్టయ్యన్ వంటి చిత్రాలు భాక్సాఫీస్ దగ్గర అసలు వర్కవుట్ కాలేదు. పెద్ద ప్రాజెక్ట్‌లు అయిన కబాలి, 2.0, జైలర్ లు మాత్రమే భారీ అంచనాల కు తగ్గట్లు నిలదొక్కుకున్నాయి. విపరీతమైన ప్రమోషన్ తో వచ్చిన అన్నాత్తే అయితే దారుణమైన ఫలితాన్ని ఇచ్చింది.
ఇప్పుడు 2025లో విడుదలైన Coolie సినిమా విషయానికి వస్తే... భారీ హైప్‌తో ప్రారంభమైనప్పటికీ, సోమవారం డ్రాప్ స్టార్ట్ అవ్వటంతో భాక్సాఫీస్ దగ్గర సినిమా స్పీడు తగ్గింది. ప్రస్తుతానికి మోస్తరు విజయాన్ని సాధించినట్లు అయ్యింది. కానీ వరల్డ్ వైడ్ గా కలెక్షన్స్ చూస్తే బ్లాక్‌బస్టర్ కంటే చాలా దూరంలో ఉంది.
కథా, కథన లోపం ఉండడం వల్ల హైప్ కు తగ్గట్లు సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. లోకేష్ కనగరాజ్ రిప్యూటేషన్ పై దెబ్బ పడింది. కూలీ మొదటి తమిళ సినిమాగా ₹1000 కోట్లు దాటే అవకాశం ఉండనుందంటూ ఎక్సపెక్టేషన్స్ ఉన్నప్పటికీ, ప్రస్తుత ట్రెండ్స్ చూస్తే ₹500 కోట్లు దాటకపోవచ్చు అని అనిపిస్తోంది. రెగ్యులర్ రొటీన్ థీమ్స్ తో రావటం, కంటెంట్-డ్రివెన్ సినిమా యుగంలో ప్రమాదకరం అని ఈ సినిమా తేల్చి చెప్పింది.
హైప్ vs. రిజల్ట్
కూలీ రిలీజ్ ముందు భారీ మార్కెటింగ్, ట్రైలర్ బజ్, సోషల్ మీడియా హైప్ ప్రేక్షకులను ₹1000 కోట్ల కలెక్షన్ అంచనాలతో ఎక్సైట్ చేసింది. మొదటి వారం ఓపెనింగ్ బాగానే ఉన్నప్పటికీ, సోమవారం రిపోర్ట్స్‌లో బాగా drop కనిపించింది. ప్రస్తుత ట్రెండ్స్ చూస్తే మళ్లీ వీకెండ్ కైనా పికప్ అవుతుందా అనే అనుమానం తెస్తోంది. సోషల్ మీడియాలో ఈ సినిమా పై హై ఎక్సపెక్టేషన్స్ తో తాము మోసపోయినట్లు సినిమా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
స్టార్ పవర్ vs. స్టోరి పవర్
కూలి సినిమాలో “కథ కంటే ఎపిసోడ్స్ కు ఎక్కువ ప్రాధాన్యం” అనే ఎప్రోచ్ ఎక్కువగా కనిపించింది. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్ ఎఫెక్ట్స్, పాటలు ఉన్నప్పటికీ, ప్రధాన కథ సరిగ్గాలేదు. ఇప్పటి ఆడియన్స్ లోకేషన్ కనగరాజ్ స్టోరీ టెల్లింగ్ కోసం, అందులో రజనీని ఎలా చూపిస్తారనే విషయం కోసం వచ్చారు. దాంతో “స్టార్ పవర్ మాత్రమే సినిమాను అమ్మలేదు; ప్రేక్షకులు compelling కథను కోరుకుంటున్నారు అనే క్లారిటీ ఇచ్చినట్లైంది.
ఆడియన్స్ ఎంగేజ్మెంట్ & వర్డ్ ఆఫ్ మౌత్
మొదటి 2–3 రోజుల్లో ఈ సినిమా ఎలా ఉండబోతోందనే క్యూరియాసిటీ, రనజీ ప్రెజన్స్ ,యాక్షన్ సీక్వెన్స్ పుల్ చేసాయి. అయితే స్టోరీ ఎంగేజ్మెంట్ సరిగ్గా లేకపోవటంతో చూసినవారిలో పూర్తి నిరాశకనిపించింది. అదే మౌత్ టాక్ గా స్ర్పెడ్ అయ్యింది.
ఓవర్ హైప్ మార్కెటింగ్
మార్కటింగ్ క్యాంపైన్స్, సోషల్ మీడియా బజ్.. —“మొదటి తమిళ చిత్రం ₹1000 కోట్లు”—అనే ఓవర్ హైప్ ని క్రియేట్ చేసాయి. అంచనాలును రెట్టింపు చేసాయి. ఆ అంచనాలతో వెళ్లినవాళ్లకు తీవ్ర నిరాశ ఎదురైంది.
ఫైనల్ గా...
Coolie తో స్పష్టమైన విషయం.. కేవలం స్టార్ పవర్ మాత్రమే బాక్స్ ఆఫీస్ సక్సెస్‌కు సరిపోదు.ప్రేక్షకులని ఆకట్టుకునే, బలమైన కథను కోరుకుంటున్నారు. రజనీకాంత్ ఇప్పటికీ అటెన్షన్ పొందుతూనే ఉన్నా, ఫార్ములా స్టోరీ టెల్లింగ్, వీక్ నేరేటివ్, హైప్ బేసెడ్ మార్కిటింగ్ ..ఇప్పటి కంటెంట్ డ్రైవన్ సినిమా ఎరా లో నిరాశకు దారి తీస్తాయి.