రజనీకాంత్ 'కూలీ' మూవీ రివ్యూ

మిస్సైన లోకేష్ మార్క్;

Update: 2025-08-14 08:43 GMT

దేవా (రజనీకాంత్) తన ప్రాణ స్నేహితుడు రాజశేఖర్ (సత్యరాజ్) చనిపోతే చూడటానికి వస్తాడు. అయితే రాజశేఖర్ గుండెపోటుతో చనిపోలేదని, చంపేసారని తెలుసుకుంటాడు. అంతేకాదు రాజశేఖర్ ఉన్న ముగ్గురు కూతుళ్లకు కూడా ప్రమాదం పొంచి ఉందని అర్దం చేసుకుంటాడు. అయితే రాజశేఖర్ కు చంపిందెవరు అనే ఎంక్వైరి చేస్తే ...అతను సైమన్ ( నాగార్జున అక్కినేని)కి చెందిన మాఫియా కోసం పనిచేస్తున్నాడని తెలుస్తుంది. లోతుగా తవ్వటం మొదలెడతాడు.

సైమన్ ( నాగార్జున అక్కినేని) ది పెద్ద మాఫియా. పైకి పోర్టు వ్యాపారం నిర్వహిస్తుంటాడు. సైమన్ కి రైట్ హ్యాండ్ దయాల్ (సౌబీన్ షాహిర్). ఇక సైమన్ అసలు ఏ వ్యాపారం చేస్తూ కోట్లు సంపాదిస్తూన్నాడో తెలుసుకోవటం కోసం పోలీస్ లు పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ చేస్తూంటారు. తమ డిపార్టమెంట్ వాళ్లను స్పైలుగా పంపుతూంటారు. వాళ్లను కనిపెట్టి దయాల్ నిర్దాక్ష్యణంగా చంపేస్తూంటాడు.

ఈ క్రమంలోనే అక్కడ పనేచేసే రాజశేఖర్ (సత్యరాజ్) చనిపోతాడు. ఇప్పుడు దేవా సైమన్ కు చెందిన దందా ప్రపంచంలోకి అడుగుపెడతాడు. అప్పుడేం జరుగుతుంది. అలాగే రాజశేఖర్ పెద్ద కూతురు ప్రీతీ (శృతిహాసన్) ...దేవాను ఎందుకు ద్వేషిస్తూ ఉంటుంది. చివరకు తన స్నేహితుడుని చంపిన వాళ్లపై దేవా ఎలా పగ తీర్చుకున్నాడు. ఈ కథలో దాహా (అమీర్ ఖాన్) పాత్ర ఏమిటి...అసలు దేవా గతంలో ఏం చేస్తూండేవాడు, సైమన్ చేస్తున్న అక్రమ వ్యాపారం ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

డైరక్టర్ లోకేష్ కనగరాజ్ సాధారణంగా మల్టీ-థ్రెడ్ నేరేషన్, రేసీ ఎడిటింగ్, యాక్షన్ హై, ఊహించని విధంగా పాత్ర రివీల్ తో స్క్రీన్ ప్లే నడుపుతూంటారు. సినిమాలో షాక్ విల్యూ ఉండేలా రైటింగ్, ఎడిటింగ్ ఉంటుంది. అయితే ఈ సారి అవేమీ ఈ సినిమాలో కనిపించవు. ఇంట్రవెల్ కు ముందు ఓ షాక్ ఇస్తారు కానీ అంతకు మించి హై ఇచ్చే ఎలిమెంట్స్ లేవు. సెకండాఫ్ లో కూడా ఒకటి రెండు చూడా ట్విస్ట్ లు ఇచ్చాను అనుకుని క్యారక్టర్స్ ని ట్వీక్ చేసారు కానీ అవేమీ విక్రమ్ తరహాలో ఇంపాక్ట్ ఇవ్వలేదు. ఎక్స్పెక్ట్ చేయని టైమ్‌లో వచ్చే కానీ హై ఇచ్చే మూమెంట్స్ ని ఎక్సపెక్ట్ చేసినా ఇందులో కనపడవు. అవి లోకేష్ కనగరాజ్ బ్రాండ్ సినిమా చూద్దామని వెళ్లినవాళ్లకు నిరాశపరుస్తాయి.

సినిమాలో పెద్ద మైనస్ గా చెప్పుకోవాల్సిన విషయం నాగార్జున క్యారక్టరైజేషన్. సినిమాలో విలన్ గా చూపెట్టే ఈ పాత్ర...ఆ స్దాయిలో ఉండదు. నాగ్ ని మించి సౌబీన్ షాహిర్ పాత్ర సాగుతుంది. దాంతో నాగ్ మెయిన్ విలనా లేక సౌబీన్ షాహిర్ విలనా అనే డౌట్ వస్తుంది. కానీ నాగ్ వంటి స్టార్ ని పెట్టుకుని వేరే వాళ్లను అనుకోలేం కదా. అలాగని నాగ్ ని విలన్ గా స్ట్రాంగ్ గా కనపడరు. నాగార్జున క్యారెక్టర్ సెటప్ బలంగా ఉన్నప్పటికీ పాత్ర డ్రైవింగ్ ఫోర్స్ క్లియర్ గా లేదు.దాంతో విలన్ వీక్ అయ్యి హీరో పాత్రకు రావాల్సిన హై రాలేదు.సెకండాఫ్ లో అయితే నాగార్జున పాత్ర దాదాపు ప్యాసివ్ అయిపోతుంది — అంటే యాంటగనిస్ట్ (విలన్) ఉనికే మాయమైపోతుంది. నాగ్ కనపడినప్పుడే విలన్ ఉన్నాడని గుర్తు వస్తుంది.

అయితే నాగ్ పాత్ర డెప్త్ లోపించినా, ఆయన స్టైల్, స్వాగ్, కొత్త లుక్‌ మాత్రం ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. రజనీ తన ట్రేడ్‌ మార్క్ స్వాగ్, ఫన్ కాస్తంత తక్కువే. సినిమా మొత్తం ఎనర్జీ లెవెల్ మోస్తరు స్థాయిలోనే ఉంటుంది. లోకేష్ సినిమాల్లో సాధారణంగా కనిపించే రేసీ యాక్షన్ హైస్ ఈసారి అంతగా లేవు. సౌబీన్ షాహిర్ పాత్ర ఫస్టాఫ్ బాగానే ఉన్నా సెకండాఫ్ ఏదో సైకో పాత్రలాగ మారిపోయింది.

అలాగే సెకండాఫ్ లో సినిమా చాలా డ్రాగ్ అవుతుంది. శ్రుతి హాసన్ పాత్ర అయితే దారుణం. అలాంటి స్టార్ హీరోయిన్ చేసిన అమ్మాయి సినిమాలో బేలగా..హీరో వస్తాడు రక్షిస్తాడు అన్నట్లు సినిమా మొత్తం ఎదురుచూడటంలోనే గడిపేస్తుంది. సౌబిన్ భార్యగా రచితా రామ్ ఎంట్రీ కాస్త ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఎండ్‌కి ఉపేంద్ర, ఆమీర్ ఖాన్ కేమియోలు వచ్చినా పెద్దగా సినిమా స్థాయి పెరగదు.

ఇక సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ బాగుంది.

నటీనటుల్లో ..

రజనీకాంత్ పెద్ద వయస్సు స్పష్టంగా కనపడింది. ఆయనకు పెయిర్ పెట్టకపోవటం ఓ లక్. నాగ్ ఎంతబాగా చేసినా ,స్క్రీన్ ప్రెజన్స్ బాగున్నా..ఆయనకు డిజైన్ చేసిన పాత్ర సహకరించలేదు. శృతి హాసన్ సినిమా మొత్తం ఉంది కానీ పెద్దగా ఆమెకు కానీ సినిమాకు కానీ కలిసొచ్చింది లేదు. నిజానికి వేరే ఇమేజ్ లేనివాళ్లను పెడితే బాగుండేది. ఇక ఈ సినిమాలో హైలెట్ సౌబీన్ నటన అని చెప్పాలి.

టెక్నికల్ రివ్యూ

మ్యూజిక్ (అనిరుధ్ రవిచందర్) ఇచ్చిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రెండూ కొన్ని సన్నివేశాలను బాగా ఎలివేట్ చేశాయి. ఇది ఆయన కెరీర్ బెస్ట్ కాకపోయినా, సినిమాకు మ్యూజిక్ బాగా ప్లస్.

సినిమాటోగ్రఫీ (గిరీష్ గంగాధరన్): మంచి విజువల్ స్టైల్ ఇచ్చారు. ఇంపాక్ట్ పెంచారు.

ఎడిటింగ్ (ఫిలోమిన్ రాజ్): ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో చాలా సీన్స్ సాగతీసారు. సినిమా క్రిస్ప్‌గా అనిపించకపోవడానికి ఇదే పెద్ద కారణం.

ప్రొడక్షన్ వ్యాల్యూస్ (సన్ పిక్చర్స్): విజువల్‌గా, టెక్నికల్‌గా సినిమా రిచ్‌గా కనిపించేలా మంచి ప్రొడక్షన్ క్వాలిటీ ఇచ్చారు.

ఫైనల్ థాట్:

స్టార్స్ తెర నిండా ఉంటే సరిపోదు. బంగారు కంచానికైనా గోడ చేరువ కావాలన్నట్లు స్టార్స్ కు కూడా వారిని తెరపై నిలబెట్టే స్క్రిప్టు అవసరం. ‘లియో’లోలా ఈసారి కూడా లోకేష్ కనగరాజ్ సెకండ్ హాఫ్ సిండ్రోమ్‌కి గురయ్యారు. ఉన్నంతలో రజనీ స్క్రీన్ ప్రెజెన్స్, ట్రేడ్‌మార్క్ స్టైల్‌ ని చూడటానికి లేదా విజువల్స్, ఆడియో డిజైన్ వంటి టెక్నికల్ ఎగ్జిక్యూషన్ గమనించటానికి వెళ్ళచ్చు. మహా అయితే వన్‌టైమ్ వాచ్ అనిపించే సినిమా.

Tags:    

Similar News