'ధూమం' మూవీ ఓటిటి రివ్యూ!
మళయాళి అయినా మన సౌతిండియాలో ప్రత్యేకమైన మార్కెట్ ఉంది ఫహాద్ ఫాజిల్(Fahad Faasil)కి. ముఖ్యంగా పుష్పలో విలన్ గా చేసినప్పటి నుంచి అతనికంటూ కల్ట్ ఫాలోయింగ్ ఏర్పడింది.
మళయాళి అయినా మన సౌతిండియాలో ప్రత్యేకమైన మార్కెట్ ఉంది ఫహాద్ ఫాజిల్(Fahad Faasil)కి. ముఖ్యంగా పుష్పలో విలన్ గా చేసినప్పటి నుంచి అతనికంటూ కల్ట్ ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకు తగినట్లే ...తనో పాత్రగానే భావిస్తూ.... హీరో, విలన్ అనే భేదాలు లేకుండా కథ నచ్చితే ఏ సినిమా అయినా చేయడానికి సిద్ధపడతాడు. అతడు హీరోగా నటించిన మలయాళ(Malayalam) మూవీ ధూమం ఆ మధ్యన రిలీజై మంచి రివ్యూలు తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగు వెర్షన్ ఆహా ద్వారా అందుబాటులోకి వచ్చింది.
ఏముంది సినిమాలో కథేంటి
అవినాష్ (ఫహద్ ఫాజిల్) బేసిక్ గా చాలా తెలివైన వాడు. మాటల గారిడీ చేయగలడు. తన టాలెంట్ తో సిగరెట్ కంపెనీ ఎండీ సిద్ధార్థ్ అలియాస్ సిధ్ (రోషన్ మాథ్యూ)ను మెప్పించి ఒప్పించి ఆ కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాడు. అందుకు తగినట్లుగానే తన మార్కెటింగ్ స్ట్రాటజీలతో కంపెనీ సేల్స్ పెంచుకుంటూ పోతాడు. కంపెనీ కూడా బాగా ఎంకరేజ్ చేస్తుంది. అతని కావాల్సినట్లు మంచి జీతం, అన్ని ఫెసిలిటీస్ ను ఆ కంపెనీ ఇస్తుంది. కంపెనీ ఎమ్‌డీ సిద్ధార్థ్ అలియాస్ సిధ్ (రోషన్ మాథ్యూ) అవినాష్‌ను ఎంప్లాయ్‌లా కాకుండా స్నేహితుడిలాగే చూస్తూంటాడు. అయితే అన్ని రోజులు ఓకేలాగ ఉండవు కదా.
సిద్దార్థ్ తో వచ్చిన అభిప్రాభేదాల కారణంగా హఠాత్తుగా తన ఉద్యోగానికి అవినాష్ రిజైన్ చేస్తాడు. ఆ మరుసటి రోజు తన భార్య దియాతో (అపర్ణ బాలమురళి) అవినాష్ కలిసికారులో ప్రయాణిస్తోన్న సమయంలో అతడిపై ఓ ముసుగు వ్యక్తి ఎటాక్ చేసి డ్రగ్ ఇంజెక్షన్స్ ఇస్తాడు. ఆ మత్తు నుంచి బయటకు వచ్చే సరికి అవినాష్ ఓ నిర్జీన ప్రదేశంలో తను తన భార్య ఉంటారు. అప్పుడు అతనికో ఫోన్ వస్తుంది. అతడి భార్య దియా శరీరంలో ఓ మైక్రో బాంబ్ ఫిక్స్ చేశానని, ఆ బాంబ్ పేలకుండా ఉండాలి, దియా ప్రాణాలు నిలవాలంటే తాము చెప్పింది చేయాలని బ్లాక్ మెయిల్ చేస్తాడు. అక్కడ నుంచి ఆ దంపతులు ఇద్దరూ చెప్పింది చేస్తూంటారు. అయితే అవినాష్ ని ఇలా భయపెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నది ఎవరు...తను రిజైన్ చేసిన కంపెనీ వాళ్లా లేక వేరే వాళ్లా ... అతడి భార్య దియా (అపర్ణా బాలమురళి) శరీరంలో మైక్రోబాంబు ఎందుకు పెట్టారు? దాని నుంచి అవినాష్ ఆమెను కాపాడుకున్నాడా? అన్నది కథాంశం.
ఎలా ఉంది
ఇదో ఇంటెన్స్ డ్రామా. ఎవరు హీరోని , అతని భార్యని కిడ్నాప్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే విషయం చుట్టూ కథ తిరుగుతుంది. ధూమపానం వల్ల తలెత్తే అనర్థాల్ని క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేసారు. అయితే అనుకున్న స్దాయిలో స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా సెట్ కాకపోవటంతో సెకండాఫ్ లో బోర్ వచ్చేసింది. హీరోహీరోయిన్ల ప్రజెంట్, పాస్ట్ ను చూపిస్తూ నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లేలో డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేసారు డైరెక్టర్ పవన్ కుమార్ .
ఫహాద్‌ఫాజిల్ ట్రాప్‌లో ఇరుక్కున్నట్లుగా చూపించగానే ఆసక్తి మొదలవుతుంది. ఆ తర్వాత మెల్లిగా తన ఫ్లాష్ బ్యాక్ మొత్తం భార్య దియాతో అవినాష్ చెప్పడం, మరోవైపు ప్రజెంట్‌లో బ్లాక్‌మెయిలర్ కోసం అతడు సాగించే వెతికే క్రమంలో ఎంగేజింగ్‌గా సినిమా నడవాలి. కానీ ఎప్పుడైతే అసలు ఇదంతా ఎందుకు జరిగింది అనే విషయం రివీల్ చేసేసరికి సినిమా డల్ అయ్యిపోయింది. అప్పటిదాకా ఇంటెన్స్ గా నడిచిన వ్యవహారం మొత్తం డ్రాప్ అయ్యిపోయింది. అయితే క్లైమాక్స్ మాత్రం ఇంట్రస్టింగ్ గా ఉంది.
టెక్నికల్ గా
కాన్సెప్టు వైజ్ గా మంచి సినిమానే. అయితే చాలా చోట్ల తెరపై ఏం జరుగుతుందో అర్థం కాదు. థ్రిల్ చేయడానికి చేసిన ప్రయత్నాలు కన్ఫూజన్ కు దారి తీసాయి. డైరక్టర్ కూడా సస్పెన్స్ లో ఉంచటానికి ప్రయత్నించాడే కానీ ఆ కంటెంట్ లో అంత ఇంటెన్స్ డ్రామా వస్తుందా లేదా అన్నది చూసుకోలేదు. ఇక మిగతా విభాగాలు విషయానికి వస్తే.. ప్రీత జయరామ్ సినీఫొటోగ్రఫీ .. పూర్ణచంద్ర తేజస్వి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. సురేశ్ ఆర్ముగం ఎడిటింగ్ ఫెరఫెక్ట్ గా ఉన్నాయి. ఫహాద్ ఫాజిల్ ఈ సినిమాని మొత్తం నిలబెట్టి తన భుజాలపై మోసాడు. అవినాష్ పాత్రలో ఫహాద్ ఫాజిల్ జీవించాడు.
చూడచ్చా
అడల్ట్ కంటెంట్ ఏం లేదు కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు , థ్రిల్లర్ అభిమానులకు నచ్చుతుంది.
ఎక్కడ చూడచ్చు
ఆహా ఓటిటిలో తెలుగులో ఉంది.