సందీప్ రెడ్డి వంగా వర్సెస్ షారుఖ్, పోటీలో విజేతలెవరూ?

2023 లో బాలీవుడ్ మంచి విజయాలను నమోదు చేసుకుంది. జవాన్, పఠాన్ సినిమాలు వెయికోట్ల క్లబ్ లో చేరగా, యానిమల్ సినిమా 800 కోట్ల వసూళ్లను రాబట్టింది.

Update: 2024-01-18 06:55 GMT
వరుణ్ ధావన్, జాన్వీ కపూర్; కరణ్ జోహర్

69 ఎడిషన్ బాలీవుడ్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రధానోత్సవానికి వేదిక ఖరారైంది. గుజరాత్ రాజధాని గాంధీనగర్ లో గల ‘గిఫ్ట్’ సిటీలో ఈ నెల 27,28 న అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. హిందీ చిత్ర పరిశ్రమలో కళాత్మక, సాంకేతిక నెపుణ్యానికి గౌరవించే వేదికగా ఫిల్మ్ ఫేర్ వేడుకలను భావిస్తారు. ఈ అవార్డుల ప్రధానోత్సవానికి తొలిసారిగా గుజరాత్ అతిథ్యం ఇవ్వబోతుంది.

ఈ అవార్డుల ప్రధానోత్సవం ప్రధానం షారుక్ చిత్రాలకు, యానిమల్ మధ్య పోటీగా ఉంటుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రెండు చిత్రాల నటీనటులు, దర్శకులు కూడా ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు విభాగాలకు నామినేట్ అయ్యారు. వీరిలో ఎవరూ విజేతగా నిలుస్తారనేది మాత్రం జనవరి 27, 28 తరువాతనే తేలుతుంది.

షారుక్ ఖాన్ నటించిన మూడు చిత్రాలు గత ఏడాది విడుదల అయ్యాయి. మొదట పఠాన్ విడుదల అయి వేయి కోట్ల క్లబ్ లో చేరింది. తరువాత తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ కూడా వెయి కోట్లు కొల్లగొట్టింది. చివరగా బాలీవుడ్ అగ్రదర్శకుడు రాజ్ కుమార్ హీరాణీ దర్శకత్వలో షారుక్ నటించిన ‘డంకీ’ విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇందులో రెండు సినిమాలు ఉత్తమ చిత్రం విభాగంలో నామినేట్ అయ్యాయి.

ఇక తాజా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రణ్ బీర్ కపూర్ తో తీసిన యానిమల్ బాలీవుడ్ ను దున్నేసింది. ఏకంగా 800 కోట్లు వసూల్లను రాబట్టింది. సందీప్ కు ఇదీ బాలీవుడ్ లో రెండో సినిమా కావడం గమనార్హం. ఇంతకు ముందు తీసిన కబీర్ సింగ్ కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇది తెలుగులో తీసిన అర్జున్ రెడ్డి కి రీమేక్. మెజారిటీ అవార్డులు ఈరెండు సినిమాలు కొల్లగొడుతాయనే అంచనాలున్నాయి. వీటితో పాటు గదర్, ఓమై గాడ్ 2 తో పాటు మరికొన్ని సినిమాలు వివిధ విభాగాలకి నామినేట్ అయ్యాయి.

ఫిల్మ్ ఫేర్ అవార్డుల కోసం నామినేషన్లు

ఉత్తమ చిత్రం విభాగంలో వీటితో పాటు ‘12 ఫెయిల్’, రాకీ ఔర్ రాణికీ ప్రేమ్ కహనీ’ లాంటి చిత్రాలు ఉన్నాయి.

ఉత్తమ నటుడు విభాగంలో ‘జవాన్, డంకీ’ రెండు చిత్రాల నుంచి షారుక్ నామినేట్ అయ్యారు. ‘యానిమల్’ నుంచి రణ్ బీర్ కపూర్, ‘రాకీ ఔర్ రాణి’ చిత్రం నుంచి రణ్ వీర్ సింగ్, ‘గదర్ 2’ చిత్రం నుంచి సన్నీ డియోల్, ‘సామ్ బహదూర్’ మూవీ నుంచి విక్కీ కౌశల్ నామినేట్ అయ్యారు. అలాగే సామ్ బహదూర్ ఉత్తమ నటుడు విమర్శకుల ప్రశంసల కేటగిరీలో, ‘డంకీ’ ఉత్తమ సహయ విభాగంలో కూడా విక్కీ నామినేట్ అయ్యాడు.

ఉత్తమ దర్శకుల విభాగంలో ‘జవాన్’ సినిమా నుంచి అట్లీ, ‘రాకీ ఔర్ రాణి’ నుంచి కరణ్ జోహర్, ‘ఓ మై గాడ్’ నుంచి అమిత్ రాయ్, ‘యానిమల్’ నుంచి సందీప్ రెడ్డి వంగ, ‘పఠాన్’ నుంచి సిద్దార్థ్ ఆనంద్, విధు వినోద్, ‘12 ఫెయిల్’ చిత్రం నుంచి చోప్రా పోటీ పడుతున్నారు.

ఉత్తమ మహిళా నటుల విభాగంలో ‘రాకీ ఔర్ రాణి’ నుంచి అలియాభట్, ‘పఠాన్’ నుంచి దీపికా పదుకొణే, ‘మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే’ మూవీ నుంచి రాణి ముఖర్జీ, ‘డంకీ’ చిత్రం నుంచి తాప్సీ, ‘సత్యప్రేమ్ కీ కథ’ చిత్రం నుంచి కియారా అద్వానీ తదితరులు పోటీపడుతున్నారు. 

Tags:    

Similar News