సంజయ్ దత్ “ఘూడ్‍చాడీ” రివ్యూ

బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ వరుసగా సౌత్ సినిమాల్లో నటిస్తున్నారు. కేజీఎఫ్ 2 తర్వాత సంజయ్‍కు భారీ డిమాండ్ ఏర్పడింది.

Update: 2024-08-10 11:28 GMT

బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ వరుసగా సౌత్ సినిమాల్లో నటిస్తున్నారు. కేజీఎఫ్ 2 తర్వాత సంజయ్‍కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఆ సినిమా బంపర్ హిట్ కావటంతో ఆయనకు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఇటీవల లియో మూవీలోనూ కీలక పాత్రలో సంజయ్ నటించారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలో విలన్‍గా నటిస్తున్నారు సంజయ్ దత్. దాంతో ఆయన నటించిన హిందీ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ కు ఇక్కడ మనవాళ్లలోనూ క్రేజ్ ఏర్పడింది. సంజయ్ దత్ ప్రధాన పాత్రలో వచ్చిన “ఘూడ్‍చాడీ” టైటిల్ తో వచ్చిన ఈ చిత్రం ఏ మేరకు తెలుగువారికి నచ్చుతుంది..కథేంటి చూడదగినదేనా?

స్టోరీ లైన్

సినిమా మూడు జనరేషన్స్ కళ్యాణి నివాస్ అనే బిల్డింగ్ లో ఉండటంతో మొదలవుతుంది. అంటే మూడు జనరేషన్స్ సమస్యలను చెప్పబోతున్నారని హింట్ ఇస్తారు. వీర్ శర్మ (సంజయ్ దత్) రిటైర్డ్ కర్నల్. అతను తల్లి కళ్యాణీ దేవి(అరుణ ఇరానీ) . ఆమె అంటే విపరీతమైన ఇష్టం. అలాగే తన కొడుకు చిరాగ్ (పార్థ్ సమ్తాన్). అతనూ తండ్రి చెప్పిన మాట జవదాటడు. దాంతో తల్లి, కొడుకుతో హ్యాపీగా ఉంటూంటాడు. ఇక చిరాక్ ఓ మంచి కొడుకుగా తన తండ్రి దగ్గర నమ్రతగా ఉంటూంటాడు. కొడుకు చిరాక్ కో లవర్ దేవికా (ఖుశాలీ కుమార్) . అయితే ఆమెను తీసుకొచ్చి ఇంట్లో పరిచయం చేద్దామంటే ఆమె కులం వేరు. తమ కులం వేరు. దాంతో సైలెంట్ గా ఉంటూ టైమ్ కోసం ఎదురుచూస్తూంటాడు.

ఇదిలా ఉంటే వీర్ శర్మ ఓ రోజు అనుకోకుండా తన మాజీ ప్రేయసి మేనక (రవీనా టాండన్) ని కలుస్తాడు. ఆమె ని చూడగానే గతం గుర్తుకు వస్తుంది. ఆమెది తమది ఒకే కులం కాకపోవటంతో తను వేరే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆమె కూడా వేరే పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. ఇప్పుడు ఆమెకు భర్త చనిపోయాడు. తన భార్యా చనిపోయింది. ఇద్దరు ఒంటిరిగా ఉంటున్నామని తెలుసుకుంటాడు. ఆమె దగ్గర పెళ్లి ప్రపోజల్ పెడతాడు. ఆమె కూడా హ్యాపీగా ఒప్పుకుంటుంది. అయితే ఆమెకో కూతురు ఉంది. అతనికో కొడుకు ఉన్నాడని చెప్పుకుంటారు. అయినా ఓకే చేసుకుని వీర్ శర్మ తన తల్లి దగ్గర ప్రపోజ్ పెడదామనుకుంటాడు.

అయితే ఇక్కడే ఓ మెలిక ఉంటుంది. అదేమింటే...వీర్ శర్మ కొడుకు చిరాక్ ప్రేమించేది మరెవరినో కాదు తన తండ్రి మాజీ ప్రేయసి త్వరలో తన పిన్ని కాబోతున్న మేనక కుమార్తెని. ఆ విషయం తెలిసి ఇద్దరూ షాక్ అవుతారు. ఈ కొత్త ట్విస్ట్ వారి జీవితాలను అతలాకుతలం చేసేస్తుంది. తన చెల్లి వరస అయ్యే ఆమెను మర్చిపోవాలా లేక తన తల్లి, తండ్రులు పెళ్లి చేసుకోకుండా ఆపి తమ ప్రేమను సక్సెస్ చేసుకోవాలా అనే డైలమోలో పడిపోతారు. అప్పుడు ఏమైంది. ఈ విషయం తెలిసిన ఆ తల్లి తండ్రులు ఏ నిర్ణయం తీసుకున్నారు. చివరకు కథ ఎలా ముగిసింది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది

ఏళ్ల తరబడి సినీ ప్రేమికులు రొమాంటిక్ కామెడీలు చూస్తూనే ఉన్నారు. అలాగే ప్రతీ రొమాంటిక్ కామెడీ తనకంటూ ప్రత్యేకంగా యూనిక్ గా ఉండే కాన్సెప్టు ని ఆఫర్ చేస్తున్నారు. దర్శకుడు బినోయ్ కే గాంధీ కూడా అదే దారిలో వెళ్దామని ప్రయత్నం చేసారు. కొన్ని ట్విస్ట్ లు టర్న్ లతో రొమాంటిక్ కామెడీని నడిపాను అనుకున్నారు. అయితే అతని కథ చెప్పే విధానంలో చాలా చోట్ల లాగుడు మొదలైది. ఓ రకంగా చెప్పాలంటే టీవి సీరియల్ గా అనిపించింది. తొంభైల నాటి వాతారణం గుర్తు వచ్చింది. అలాగని నోస్ట్రాలిజీ ఫిల్మ్ అయితే కాదు. పదేళ్ల క్రితం ఇలాంటి కథలకు డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు ఇవన్నీ టీవికి వెళ్లిపోవటంతో సమస్య మొదలైంది. ఓటిటిలో కూడా ఇలాంటి సినిమాలు చూడటం విసుగ్గా భావిస్తున్నారు.

అలాగే ఈ సినిమాలో కామెడీ బ్లాక్ లు ఏమీ నవ్వించకపోవటం కూడా ఇబ్బందికరమైన అంశం. ఇక రొమాన్స్ అయితే ముసలివాళ్ళ రొమాన్స్ లాగ తయారై, యూత్ అప్పీల్ మిస్సైపోయింది. సంజయ్ దత్, రవీనా టండాన్ ప్రేమ కథ ని చూడటం కష్టమైపోయింది. యూత్ జంట అయితే ఎవరికీ రిజస్టర్ కాలేదు. అలాగే ఈ సినిమాలో పెద్ద మైనస్ ..ప్రెడిక్టబుల్ స్టోరీ లైన్. ఈ వెబ్ ఫిల్మ్ ఫస్టాఫ్ ఇంట్రస్టింగ్ గానే అనిపించింది.అయితే అసలు కాంప్లిక్ట్ లోకి కథ ఎంటర్ కాగానే తర్వాత ఏం జరుగుతుందో, క్లైమాక్స్ ఏం జరుగబోతోందనే ఊహకు అందేలా ఉంది. ఏదైతో ఊహిస్తామో అదే జరగటంతో నిట్టూర్పు తప్ప మన నోటి నుంచి మరొకటి రాదు. కథలో ట్విస్ట్ ఇంట్రస్టింగ్ గా అనిపించినా ఫోర్సెడ్ గా అనిపించింది.

చూడచ్చా

పేరుకు రొమాంటిక్ కామెడీ అయినా ఇదో స్టీరియో టిపుకల్ ఫ్యామిలీ డ్రామా. కొత్తదనం లేని ఈ వెబ్ మూవి ని కాస్తంత ఓపిగ్గానే భరించాలి.

ఎక్కడుంది

జియో సినిమా ఓటిటి లో తెలుగులో ఉంది

Tags:    

Similar News