స్మార్ట్ మూవీ 'టూరిస్ట్ ఫ్యామిలీ' రివ్యూ
ఈ సినిమా కథేంటి, ఏముంది అంత మెచ్చుకోవటానికి ఈ సినిమాలో, చూడదగ్గ సినిమానేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.;
థియేటర్స్‌లో ఘన విజయం సాధించిన తర్వాత, టూరిస్ట్ ఫ్యామిలీ ఇప్పుడు ఓటిటీలోనూ సందడి చేస్తోంది! తమిళ నటుడు ఎం. శశికుమార్ మరియు తమిళ నటి సిమ్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని మే 1, 2025న థియేటర్స్‌లో విడుదల చేశారు. ఇప్పుడీ సినిమా నాలుగు వారాల గ్యాప్‌తో జూన్ 2, 2025న ఓటిటీలో రిలీజైంది. రాజమౌళిలాంటి దర్శకుడు ప్రత్యేకించి మెచ్చుకున్న ఈ సినిమా కథేంటి, ఏముంది అంత మెచ్చుకోవటానికి ఈ సినిమాలో, చూడదగ్గ సినిమానేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
“When life forces you to migrate, hope becomes your luggage”
ఈ పాయింట్ ని బేస్ చేసుకుని ఈ సినిమా మొదలవుతుంది. జఫ్నా, శ్రీలంకలో నివసించే ధర్మదాస్ (శశికుమార్) కుటుంబం ఆర్థిక సంక్షోభంతో తమ మట్టిని వదిలి భారతదేశం వైపు అడుగులేస్తుంది. కోవిడ్ తర్వాత శ్రీలంకను కుదిపేసిన ఆర్ధిక బీభత్సం వారిని తమిళనాడులోకి అక్రమంగా వలస వచ్చేలా చేస్తుంది. అక్కడ, వారి బంధువు (యోగిబాబు) ఏర్పాటు చేసిన చిన్న ఇంటిలో కొత్త జీవితం మొదలుపెడతారు. కాని, తమ అసలు గుర్తింపును బహిర్గతం చేయకూడదన్న హెచ్చరికతో పాటు, పరిసరాల్లో అపరిచితులే అవుతారు.
అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా... వీళ్లు వచ్చిన కొద్ది రోజుల్లో రామేశ్వరంలో ఓ బాంబు బ్లాస్ట్ జరుగుతుంది. శ్రీలంక నుంచి వచ్చిన ఓ కుటుంబం దీని వెనుక ఉన్నట్లు పోలీసులు గుర్తిస్తారు. మరి, నిజంగా ఆ ఘటనకు ధర్మదాస్ కుటుంబమే కారణమా అని పోలీసులు వెతకటం మొదలెడతారు.
ఈ నేపధ్యంలో ఆ కుటుంబం కొత్త జీవితం తమిళనాడులో నిర్భయంగా కాదు, నిస్సహాయంగా కాదు... కానీ అందరితో మంచిగా ఉంటూ , మంచి చేయాలనే ఒక తపనతో జీవిస్తారు. అదే వారిని గెలిపిస్తుంది. పోలీస్ ల నుంచి తప్పించుకునేలా చేస్తుంది. మంచి మనుషుల జీవితంలో వచ్చే బాదలు తాత్కాలికం... కానీ వారి మంచితనాన్ని గుర్తు చేసుకునే సమాజం శాశ్వతం. అనే జీవిత సత్యాన్ని నొక్కి చెప్తుంది. అదెలా జరిగింది ఏమిటనేది తెరపైనే చూడాలి.
విశ్లేషణ
“In drama, the characters must drive the plot. In life, it’s often the other way around.” – అని అకిరా కురుసోవా వంటి దర్శకులు నొక్కి చెప్పిన విషయాన్ని దర్శకుడు ఫాలో అవుతాడు. ఇందులో పాత్రలే కథని నడిపిస్తాయి, కథ వాళ్లను ఫాలో అవ్వదు.
అలాగే ఈ కథ మిగతా వలస కథల్లా డీప్ ఎమోషన్లో కాకుండా, తన మీదే సెటైర్స్,జోక్స్ వేసి నవ్వుకోగల నేర్పు ఉన్న ఒక కథలా ఉంటుంది. మొదటి భాగం డీసెంట్‌గా, రెండో భాగం ఎమోషనల్ గా బాగా వర్కవుట్ అయింది. హ్యూమర్ చాలానే పనిచేసింది. ప్రత్యేకించి చిన్నారి నటుడు కమలేశ్ కామెడీ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.
ఈ సినిమాకు ప్లస్ పాయింట్ రైటింగ్... డెబ్యూట్ డైరెక్టర్ అభిషన్ జీవిన్త్, సూపర్ క్లీషే స్టోరీల్ని తానే గుర్తించి, అందులోనే కొత్త పంథాలో పయనిస్తాడు. అతను ఫాలో అయ్యిన ప్యాటర్న్: ఓ క్లాసిక్ ఓపెన్ చేస్తాడు. మనం ఎక్స్పెక్ట్ చేసే దాన్ని ఊహించగానే... ఒక చిన్న ట్విస్ట్ తో దాన్ని బ్రేక్ చేస్తాడు!
ఉదాహరణకు ఒక సందర్భంలో చనిపోయిన వ్యక్తికి స్మృతిసభ జరుగుతోంది. అక్కడ బదులు ధర్మదాస్కి మహాపురుషుడిలా మాటలు చెబుతూ సీన్ అటు వెళ్లిపోతుంది. కానీ అదే సన్నివేశంలో చిన్నబ్బాయి: “ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు, నాన్న ఫోటోనే పెట్టాల్సిన పరిస్థితి వస్తుందే!”
అంటూ, ఆ సన్నివేశంలోని ఎలివేషన్‌ను డైరెక్టర్ కామెడీగా మార్చేస్తాడు. "He doesn’t break the cliché – he bends it with a wink."
ఇందులో కథ కన్నా బాగా పాత్రలు బాగా వర్క్ అయ్యాయి. ప్రతి పాత్రకు కాసేపు స్క్రీన్ టైమ్ ఇచ్చి, వాళ్లను మన హృదయానికి దగ్గర చేస్తాడు డైరెక్టర్. వారిద్వారా వచ్చే మంచి సంఘటనలన్నీ — "Do good… and good will follow you" అనే మ్యూచువల్ కర్మ భావనకు స్పష్టమైన ఉదాహరణలుగా నిలుస్తాయి.
మరొక సీన్ లో... అన్నయ్య తన గర్ల్‌ఫ్రెండ్ గుర్తొస్తూ ఓ పాట వింటాడు. వెంటనే తమ్ముడు అదే పాటకి ఓ డ్యాన్స్ వేస్తాడు – “ఇకపై ఈ డ్యాన్స్ నీ మెమరీలో మిగిలిపోతుంది, గర్ల్‌ఫ్రెండ్ కాదురా” అంటూ వినూత్నమైన ఎమోషనల్-హ్యూమరస్ సోల్యూషన్ ఇస్తాడు.
ఈ కథలో విలన్ ట్రాక్ అంత బలంగా ఏమీ ఉండదు. వాస్తవానికి అవసరం లేదు కూడా. ఎందుకంటే ఈ సినిమా అసలు ఎమోషన్ బాధపై కాదు, బాంధవ్యంపై ఉంది.
కట్ చేస్తే:
ఈ సినిమా కేవలం వలసదారుల కష్టం చూపించేందుకు కాదు.
ఇది మంచితనాన్ని పంచే ఓ మానవతా కథ.
చిన్న చిన్న సహాయాలు, మనసులోని మంచితనం… ఇవన్నీ కలిసొచ్చినపుడే ఈ "టూరిస్ట్ ఫ్యామిలీ" మన ఇంటికి తలుపుతడుతుంది.
టెక్నికల్ గా చూస్తే...
అభిషన్ జీవిన్త్ తొలి సినిమా ఇదైనా... కథని చెప్పే విధానం అనుభవజ్ఞుల మాదిరిగా ఉంటుంది. అలాగే ఈ సినిమాలో శాన్ రోల్డన్ సంగీతం ప్రతి సన్నివేశాన్నీ లేపి నిలబెడుతుంది."Background score is not background here, it's the backbone." అతని బీజీఎమ్, పాటలు ఈ సినిమాకు నిజంగా ప్రాణం పోస్తాయి. ఓల్డ్ మ్యూజిక్ ప్లేస్‌మెంట్స్ కూడా సినిమాతో అద్భుతంగా కలిసిపోయి కొత్త ఎట్మాస్మియర్ ని క్రియేట్ చేస్తాయి. అలాగే సినిమాటోగ్రఫీ వర్క్, ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ డిజైన్ అన్నీ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి.
నటీనటుల్లో ...శశికుమార్ కు ఈ తరహా మంచి మనిషి పాత్రలు కొత్తేమీ కాదు. ఈ సారి కూడా తన పంధాలో చేసి చూపించేసాడు. సినిమాకి స్టార్ పెర్ఫార్మర్ కమలేష్ అని చెప్పాలి. ఆ పిల్లాడి ప్రెజన్స్ & డైలాగ్ డెలివరీ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. యోగిబాబు ఎప్పట్లానే కాసేపు అలా వచ్చి ఇలా నవ్వించాడు. సిమ్రాన్ ఊహించని విధంగా ఓ సగటు గృహిణి పాత్ర చాలా బాగా పోషించింది.
ఫైనల్ థాట్...
పల్చగా కనిపించే ఓ కథను, లోతుగా అనిపించేలా చెప్పిన సినిమా ఇది . సింపుల్ సినిమా. కానీ మనసులో నిలిచే మంచి సినిమాటిక్ సన్నివేశాలు. క్లాసికల్ డ్రామాకు మోడరన్ స్పర్శ ఇచ్చిన అభిషన్, ఈ జాన్రాలో తాను ప్రయోగాలు చేయగలడని నిరూపించాడు.
చూడచ్చా
అసభ్యత, అశ్లీలతా లేని ఈ సినిమాని ఫ్యామిలీ తో కలిసి కూర్చుని చూడచ్చు.
ఎక్కడుంది
జియో హాట్‌స్టార్ లో ఫ్రీగా అందుబాటులో ఉంది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో చూడచ్చు.