సినిమా తరగతి సిగ్గులేని నాయాలా...!
సినిమా వినోదం సినిమా ఫంక్షన్లు, ఆడియో క్యాసెట్ ఆవిష్కరణలు,విజయోత్సవాలు ఇంటిలోనికి చొచ్చుకొచ్చి వికారం పంచుతూ ఉందా?;
శాటిలైట్ టీవీ ప్రభంజనంతో సినిమా ఫంక్షన్లు, ఆడియో క్యాసెట్ ఆవిష్కరణలు,విజయోత్సవాలు ఇంటిలోనికి చొచ్చుకొచ్చి వినోదం కొత్త రూపం తీసుకుంది. ఏమి తప్పు లేదు,ఓ వినోదం అనుకోని సరిపెట్టుకోవచ్చు. దీని పైన ఆ మధ్య మా లోని కొందరు, సినిమాను గౌరవించే అలవాటు ఉన్న వాళ్ళం, కలిసి మాట్లాడుకొంటుంటే, తెలిసిందేంటంటే..... 'సినిమా తరగతి సిగ్గులేని నాయాలా' అంటూ మాకు మేమే పేరెట్టుసుకొని, నవ్వుకొంటూ మొదలైనా మా అందరి సంభాషణ మీతో ఇలా....
ఒకప్పుడు 'I Scratch You-You Scratch Me' అని వుండేది,ఇప్పటికి ఇదే అందరికి శ్రేయస్కరంగా ఇంకా పాటిస్తున్న సూక్తి. 'ఆ రోజుల్లో మేమంతా కుటుంబంలా ఉండేవారం,కానీ ఇప్పుడు... ' అని అంటే, 'నేను కొన్ని రోజులు అన్నమే తినలేదు' అని ఒకరంటే, 'నేను నీళ్ళే తాగి బతికానని మరొకరు', 'ఆ రోజు 104 జ్వరం ఉంటే కూడా వచ్చి ఎండలో నటించారని', 'నేను కొద్ది రోజులు రోడ్లపైనే పడుకొనేవాడ్ని',అని మరోకరు, 'ఆ రోజు నా అన్నవారు ఎవరు రాలేదు, కానీ ఈయన మాత్రమే వచ్చి నన్ను ఆదుకున్నారు' అని మరొకరంటే, తట్టుకోలేక కరిగిపోయే వారు కోకొల్లలు. కానీ, ప్రస్తుతం బాగా సంపాదించి కనీసం వారు వేసుకునేవి, ఉండే నివాసాలు, తాగే పానీయాలు ధరలు, వేరే పోకడలు తెలిస్తే ఆ కోకొల్లలు అంతే సంగతులు మరి.
రాను రాను ఈ స్థితి నచ్చినట్లు లేదు, అభిమానులకు కిక్కెక్కటం లేదనుకున్నారేమో, ఇంకొంచం ముందుకు పోయి,'I Dare you-You Don't Dash Me' అని రకరకాల హావభావాలతో, కొత్త పుంతలు తొక్కించి, 'మా తాతలు, మావయ్యలు, బాబాయిలు' అంటూ కొత్త తారలు నోళ్లు పారేసుకుని, మీసాలు తిప్పేసుకొని, కండలు చూపించేసుకొని, ప్రేక్షక దేవుళ్లే నాకు ముఖ్యమని కన్నీళ్లు పెట్టేసుకొని, తోడలు కొట్టి ,జబ్బలు చరిచేసుకొని, వచ్చిన వారిని మహా సంతోషపరిచారు.
మన సినిమాలే చూడని వారు మాత్రమే కాదు, మన బాషా కూడా రాని పర భాషా నటీ నటులను టిక్కెట్లు పెట్టుకొని విమానాల్లో పిలిపించి , అలంకారప్రాయంగా మార్చటం మన వాళ్లకున్న జాడ్యం. వారు వీరికేమి తీసిపోరు, ఓ రెండాకులు ఎక్కువ చదివిన వారు, ' మీ అంత నటులు లేరని, మీ సినిమాలు జాతికి అవసరమని, మీరు సమాజానికి ఆదర్శమని, మహాపురుషలని' తెలిసిన అన్ని కారాలు వాడేసి, పొగిడి, పొగిడి శోషొచ్చి వెళ్లిపోతుంటారు.
ఇదేముంది చూడండని, ఇంకొంత మంది వినోదం పాళ్లు పెంచే పనిలో భాగంగా, 'I Pull You- You Push Me' అనే స్థాయికి చేరుకున్నారు ,అడ్డూ అదుపు లేకుండా, వాక్చాతుర్యం పేరున వెటకారం, గేలి చేసుకొంటూ, సిగ్గు అవసరం లేని వినోదం పండించారు. ఇందులో మేము ఉన్నామని యాంకర్లు గుర్తుచేసుకొంటూ, ఆ వెకిలిని పంచుతూ, ప్రైవేట్ సంగతులను అడుగుతూ చూస్తున్న వారి libido ను తట్టి లేపుతూ, 'ఆ రోజు ఎం చేసావ్', 'అక్కడ ఏమి జరిగింది', 'ఇంతకీ ఆమె ఎవరు' అంటూ సొల్లు కబుర్లకు వేదికగా మర్చి , కొత్త సాంప్రదాయానికి తెర తీశారు.
వీళ్ల మధ్యలో కొందరు 'I am Nothing- You are Everything' అని బొంకే మేక వన్నెగాళ్లు, అతి వినయ ధూర్తులు 'ప్రతిభకు పట్టం, తెలుగు భాష ,నియమం, పద్దతి, సాంప్రదాయం,సాహిత్యం, శ్రేయస్కరం, కథలు, పురాణాలూ' అంటూ నోటికొచ్చినట్టు పాండిత్యం ఉన్నట్టుగా ,ఆ పేరున రెచ్చిపోయి అదరగొట్టే భాషణలు ఇచ్చేసి, వారికీ వారే బిరుదులు పక్కవారి ద్వారా ప్రకటింప చేసుకొని, ఆ బిరుదలకు ప్రచారం కలిపించేసుకొని ఇక ఈ మొత్తం జీవితానికి కడుపు నింపుకొనే ప్రయత్నాలు బోలెడన్ని ఒక వైపు.
మోతాదు పెంచడమే పురుగోవృద్ది కాబట్టి, ఇప్పుడేమో 'I Cuss You- You Charge Me', అని మొదలై పూనకాలు తెచ్చుకొంటున్నారు. ఆ పార్టీ వారికీ, ఈ పార్టీ వారు అన్న ముసుగు వేసుకొని సభలను తలపిస్తున్నారు. గత వారం ఈ పైత్యం ఎంత స్థాయికి చేరిందంటుంటే, ఈ ప్రక్రియకు కొత్త భాష్యం జోడించారు పక్క రాష్ట్ర భాషా నటులు. అక్కడ ఇలాంటి సంప్రదాయం, చాల ఏళ్లగా కాలు దువ్వుతున్నట్టుగా ఉండి, ఈ సారి ముందుకేగి పెంట పెంట చేసేసుకున్నారు. ఆ పెంటకు అందరు విరగబడి సంబరం చెందారు. అదేంటంటే ' I Piss You-You Shit Me' అనే స్థాయి కి చేరడం, ఏ విషయాలు గురించి మాట్లాడాలో, మాట్లాడగూడదో అన్నవాటి మధ్య ఉన్న చిన్న గీతను పూర్తిగా తుడిచేసారు. రంజింపచేశారు ఆ సినిమా తరగతి సిగ్గులేని ఎదవా నాయాళ్లను.....
-రామ్.సి