అభిమానుల అంచనాల ఆధారంగా స్క్రిప్ట్ లు రావు: లోకేష్ కనగరాజ్

నేను చేయగలిగేవి మాత్రమే చేయగలను అన్న తమిళ దర్శకుడు;

Update: 2025-09-04 05:25 GMT
దర్శకుడు లోకేష్ కనగరాజ్

అభిమానుల అంచనాల ఆధారంగా సినిమా స్క్రిప్ట్ లు రాయలేమని ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ అన్నారు. కోయంబత్తూర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రేక్షకుల అంచనాల ఆధారంగా తాను సినిమా స్క్రిప్ట్ లు రాయలేనని చెప్పారు. ఇటీవల ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ హీరో గా కూలీ చిత్రాన్ని తెరకెక్కించారు. దీనిపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సినిమా ఆగష్టు 14న థియెటర్లలో విడుదలైంది. నాగార్జున ప్రతినాయకుడిగా కనిపించగా కీలకపాత్రలో సౌబిన్ షాహిర్, శృతి హసన్, సత్యరాజ్, రచితా రామ్, ఉపేంద్ర నటించారు. ఓ కీలక పాత్రలో బాలీవుడ్ అమీర్ ఖాన్ కనిపించారు.

చాలామంది సినిమాను ఆస్వాదించినప్పటికీ కొంతమంది చాలా నిరాశ చెందారు. కనగరాజ్ మునుపటి సినిమాలాగా ఇది లేదని పెదవి విరిచారు. కూలీ అనేది టైమ్ ట్రావెల్ అని, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమని అంతా భావించారు. కానీ ఇది మామూలుగా సినిమాగా రావడంతో ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.

టైమ్ ట్రావెల్ అని నేను చెప్పలేదు..
కూలీ అనేది టైమ్ ట్రావెల్ సినిమా లేదా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమని నేను ఎప్పుడు చెప్పలేదని ఆయన అన్నారు. కానీ ట్రైలర్ విడుదల తరువాత ఈ విషయాలు ఎక్కువగా ప్రచారంలో ఉంది. ఇదే విషయాన్ని ఆయన ఈ కార్యక్రమంలో ప్రస్తావించారు. సినిమా విడుదలకు పద్దెనిమిది నెలల ముందు నుంచే దీనిపై ఊహగానాలు చెలరేగాయని చెప్పారు. కానీ అసలు విషయం అది కాదన్నారు.
‘‘అభిమానులు పెట్టుకున్న అంచనాల ఆధారంగా సినిమా స్క్రిప్ట్ లు రాయలేను, ప్రేక్షకులు నన్ను ఇప్పటికి ఇష్టపడుతున్నారని ఆశిస్తున్న, నేను చేయగలిగేది మాత్రమే చేయగలను’’ అని ఆయన అన్నారు.
‘‘నేను ఎప్పుడూ భారీ అంచనాల ఆధారంగా కథలు రాయలేను. నేను ఒక కథ రాస్తాను. అది వారి అంచనాలను అందుకుంటే నేను బాగుంటాను. అలా కాకపోతే నేను ప్రయత్నిస్తాను.. అంతే’’ అని ఆయన సమావేశంలో అన్నారు.
ఎల్ సీయూతో పోరాడుతోంది..
తన లోకి యూనివర్స్ గురించి ఆయన మాట్లాడారు. తాను సృష్టించిన విశ్వంతో కష్టపడుతున్నానని చెప్పాడు. తాను ఇప్పుడూ ఎల్సీయూ పై దృష్టి పెడుతున్నానని, మరిన్ని కొత్త యూనివర్స్ లను తీసుకొచ్చే పనిచేయడం లేదని చెప్పారు.
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లేదా ఎల్సీయూ అనేది తమిళ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలతో సంబంధం ఉన్న సినిమాలు. ఇది 2019 లో విడుదలై సంచలన విజయం సాధించిన ఖైదీతో ప్రారంభం అయింది.
ఈ తరువాత కమల్ హసన్ హీరోగా నటించిన ‘విక్రమ్’ తో పీక్స్ కు చేరింంది. ఇందులో భాగంగా 2023 లో విజయ్ నటించిన లియో చేరింది. ప్రస్తుతం వీటికి కొనసాగింపు ప్రాజెక్ట్ లు ఉన్నాయని సమాచారం.
Tags:    

Similar News