సెంటిమెంట్ ను ఫాలో అయిన షారుక్.. అక్కడి నుంచి ప్రమోషన్ స్టార్ట్

బాలీవుడ్ బాద్షా షారుక్ కొత్త సినిమా డుంకీ ప్రమోషన్ అందాల కశ్మీరంలోని వైష్ణోదేవీ ఆలయం నుంచి మొదలు పెట్టారు. ఈ నెల 21 న సినిమా విడుదల కానున్ననేఫథ్యంలో వైష్ణోదేవి మాతను షారుక్ మంగళవారం దర్శించుకున్నారు. నలుగురు స్నేహితులు విదేశాలకు వెళ్లి తమ లక్ష్యం కోసం ఎలా కష్టపడి సాధించుకున్నారో అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

Translated by :  Chepyala Praveen
Update: 2023-12-12 08:58 GMT
షారుక్ ఖాన్

ఉదయం వైష్ణోదేవి- కత్రా భవన్ లో అతడి మేనేజర్ పూజా దద్లానీ వారి వెంట నలుగురు బాడీ గార్డులతో కలిసి షారుక్ ఆలయ పరిసరాల్లో కనిపించారు. షారుక్ నల్లటి కోటు వేసుకుని నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. గత ఏడాది కాలంలో షారుక్ వైష్ణోదేవీ ఆలయాన్నీ సందర్శించడం ఇదీ మూడోసారి కావడం గమనార్హం.

ఇంతకుముందు పఠాన్ సినిమా విడుదల ముందు తొలిసారి కింగ్ ఖాన్ ఈ ఆలయాన్ని సందర్శించారు. ఆ చిత్రం దాదాపు రూ. వెయి కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నాలుగు సంవత్సరాల తరువాత షారుక్ దక్కిన విజయం ఇదీ. అలాగే ఈ సంవత్సరం ఆగష్టులో జవాన్ సినిమా విడుదల సందర్భంగా తిరిగి వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆ సినిమా సైతం హిట్ టాక్ తెచ్చుకుంది. ఏకంగా రూ. 1100 కోట్లు వసూల్లు రాబట్టింది. ఇప్పుడు డుంకీ సినిమా సందర్భంగా మూడోసారి జమ్ములోని ఈ గుడిని కింగ్ ఖాన్ సందర్శించారు.

డుంకీ సినిమాను బాలీవుడ్ అగ్రదర్శకుడు రాజ్ కుమార్ హీరాణీ తెరకెక్కించారు. ఓ నలుగురు నిజ జీవిత ఆధారంగా అభిజాత్ జోషి, కనికా ధిల్లాన్ ఈ సినిమా కథను అందించారు. నలుగురు యువకులు విదేశాలకు వెళ్లడానికి ‘డాంకీ ప్లైట్’ అనే చట్టవిరుద్దమైన ఇమ్మిగ్రేషన్ కథాంశంతో సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది.

ఇది పూర్తిగా కామెడీ చిత్రమని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇందులో షారుక్ తోపాటు బోమన్ ఇరానీ, తాప్సీ, విక్కి కౌశల్, అనిల్ గ్రోవర్ , విక్రమ్ కొచ్చర్ లాంటి తారలు నటించారు. ఈ సినిమాను జియో స్టూడియోస్, రెడ్ చిల్లిస్ ఎంటర్ టైన్ మెంట్, రాజ్ కుమార్ హీరానీ ఫిలిమ్స్ కలిసి నిర్మించారు. 

Tags:    

Similar News