రాజకీయాల్లో స్టాక్ హోం సిండ్రోమ్

అన్యాయాన్ని భరించేవారు అదే అన్యాయాన్ని చేసే వారిని ఆరాధించడమేంటి !?;

Update: 2025-06-06 10:20 GMT

-రామ్.సి


మీరు హాలీవుడ్ క్లాసిక్ 'Dog's Day Afternoon', చూసారా!, అందులో బ్యాంకు దోచుకోవడానికి వచ్చిన దుండుగులపై అక్కడి బందీలు ముందు వారంటే భయపడుతూ, ఆ ఫై ద్వేషాన్ని, కోపాన్ని,పెంచుకొంటూ వెళ్లి,కొంత సమయం తరువాత వారి దీనావస్థను చూసి కరిగిపోతారు, ఈ దోపిడీకి దారి తీసిన పరిస్థితులను తెలుసుకొని అక్కున చేర్చుకొంటారు, వారి భవిష్యత్తు తలచుకొని కృంగిపోతారు. ఇలాంటి కథనమే తో వచ్చిన V for Vendetta, మణిరత్నం 'రావణన్', Highway, 'లీలామహల్ సెంటర్' ఇలా మచ్చుకు కొన్ని ఇలాంటి తరహాలో వచ్చినవే.

ఏంటిదినిపించిందా ?, దీన్నే Stockholm Syndrome అంటారు. ఇదో మానసిక పరిస్థితి ముందుగా ద్వేషించిన మనిషినే, తనను అపహరించి బంధించిన వాడినే ప్రేమించడమొ ,ఆరాధించడమొ,లేదా వారికి మద్దతుదారులుగా మారడమో జరుగుతుంది.

కొంచం వెనుక కథ.....

అప్పుడప్పుడే ఎన్నికలు అంటే ఏంటో తెలుసుకుంటున్న బాల్యం రోజులవి. స్కూల్, ఇంట్లో మరియు బయట ఎప్పుడు కధలు కథలుగా ఓ వ్యక్తిపై చెప్పుకొవటం ఓ పరిపాటి. తను చేసే అరాచకాలు, అక్రమాలు, దౌర్జ్యన్యాలు, హత్యలు,పంచాయితీలు గూర్చి అందరు విశేషంగా తమ కోపాన్ని ,భయాన్ని, అక్కసును, కబుర్లు, అభిమానాన్ని, చేతకాని తనాన్ని వ్యక్తపరుస్తూనే, అతన్ని ఇండిపెండెంట్ గా ఐనా, పార్టీ తరపున అయినా బహుశా ఐదు సార్లు శాసనసభకు ఎన్నుకొన్నారు.అప్పుడు పుట్టింది నాకీ సంశయం, ఈ రాత వెనుక ఉండే ఆలోచన, ఇప్పటికి పంచుకొనే అవకాశం వచ్చింది.

మన దేశంలోనే కాదు లేదా ప్రపంచమంతటా మనం ఓ విచిత్రమైన దృశ్యాన్ని చూస్తుంటాం; ప్రజలు తమను వంచించే, ఏ మాత్రం సేవ చేయని రాజకీయ నాయకులను ఆదరిస్తూ, ఆరాధిస్తూ ఉంటారు. వీరి పాలన వల్ల ఉద్యోగాలు తగ్గిపోతున్నా, ఆర్ధిక అసమానత పెరుగుతున్నా, మహిళల భద్రత లేనప్పటికీ, వసతులు కొరతయినప్పటికీ, రూపాయి ఆదాయం రాకపోయినా వాళ్ల పుట్టినరోజులను పండుగల్లా జరుపుకుంటారు. ఇది సరైన రాజకీయ విజ్ఞతా అంటే, కాదనే సమాధానం మనకు తెలుసు. కానీ, ఇది ఎందుకు జరుగుతుంది అన్నది Stockholm Syndrome అనే మానసిక స్థితితో అర్థం చేసుకోవచ్చు.

స్టాక్‌హోమ్ సిండ్రోమ్ అంటే బాధితుడు తనను బాధించే వ్యక్తిని ప్రేమించడం, అతడిని రక్షకుడిలా భావించడం.రాజకీయాల్లో ఒక నేత చిన్నపాటి లబ్దిని కూరిస్తే, ఇక అది గొప్ప అనుగ్రహంలా కనిపిస్తుంది. ప్రజల బాధలను తాను "అర్ధం చేసుకున్నాడు" అనే నాటకాన్ని వేసినా సరే, అతనిపట్ల అభిమానం పెంచుకుంటాం. కాలానుగుణంగా అతడే మన రక్షకుడు, మన దేవుడు అన్న నమ్మకాన్ని పెంపొందించుకుంటాం.

ఇది ముఖ్యంగా నేతలు చక్కగా ప్రణాళికబద్ధంగా అల్లే నాటకం వల్ల మరింత బలపడుతుంది. భారీ సభలు, ప్రచారాలు, భావోద్వేగపూరిత వ్యాఖ్యలు, "తమను విమర్శిస్తే దేశద్రోహం" అనే మాయలు మనపై ప్రభావం చూపిస్తాయి. ప్రజలు నిజమైన సమస్యల్ని మరిచి, నటనను నమ్మే స్థితికి చేరతారు. అసలు పాలన గురించి ఆలోచించకుండా, వ్యక్తులను భుజాన మోయడం మొదలవుతుంది.ఆది వారి వారసులతో కూడ కొనసాగించడం మన దౌర్భాగ్యం.

ఈ స్థితి నుంచి బయటపడాలంటే....


Tags:    

Similar News