‘‘రాజా సాబ్’’ లో ఉన్న ఐదు ప్రధాన విషయాలేంటంటే..
హారర్ కామెడితో పాటు రోమాన్స్ కు పెద్దపీట వేసిన దర్శకుడు;
By : The Federal
Update: 2025-06-16 12:16 GMT
రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటిస్తున్న ‘‘రాజాసాబ్’’ టీజర్ విడుదల అయింది. దీనితో అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ కానుకగా వస్తుందని మొదట్లో చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ చివరకు ఈ ఏడాది చివరకు థియోటర్లో సందడి చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సినిమా హారర్ కామెడీగా తెరకెక్కింది.
మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హర్రర్, కామెడితో పాటు రోమాన్స్ కూడా జత చేసుకుందని సమాచారం. ఈ టీజర్ ద్వారా మనం ఐదు విషయాలు గమనించవచ్చు.
1. కాక్ టెయిల్.. హర్రర్ ప్రేమ..
ఈ టీజర్ భయానక దృశ్యాలతో పాటు ఉల్లాసభరితమైన కామెడీ సీన్లకు పెద్ద పీఠ వేసింది. ఇది రోమాంటిక్ టచ్ తో కూడిన హర్రర్ కామెడిని హైలైట్ చేసింది. ప్రభాస్ ను అభిమానులు ఇప్పటి వరకూ హై ఎండ్ యాక్షన్ సన్నివేశాలతో మాత్రమే చూడగా, ఇప్పుడు మరో కొత్త జానర్ లో చూసే అవకాశం దక్కింది. భయాలు, నవ్వుల కలయికతో ఉన్న టీజర్ థియోటర్ లో కొత్త అనూభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు.
2. ప్రభాస్ ధైర్య సాహసాలు..
ప్రభాస్ మంచి లుక్ లో కనిపించాడు. ఒక రకంగా వింటేజ్ రెబల్ స్టార్ ను చూపించారు. ఇది అభిమానులకు ఆనందపరిచే విషయం. విచిత్రమైన దుస్తులు ధరించి, తన ట్రేడ్ మార్క్ అయిన కూల్ లుక్ తో కనిపించాడు. అలాగే ఇందులో తాత - మనవడిగా ద్విపాత్రాభినయంతో పాటు దెయ్యం గెటప్ లో కూడా అదరగొడతాడని లేదా ప్రభాస్ ను తాత ఆత్మ ఆవహాన చేసినట్లు హింట్ ఇచ్చారు. మొత్తం మీద సినిమాకు అతీంద్రీయ శక్తులతో పోరాటం చేస్తాడని కూడా చివర్లలో చెప్పారు.
3. మలుపులు ఎటూ దారి తీస్తాయో..
టీజర్ లో ఒక అద్భుతమైన షాట్ లో ముగ్గురు కీలక పాత్రదారులు తలక్రిందులుగా ఉన్నట్లు చూపించారు. వారు అంతా పారానార్మల్ వ్యక్తులతో పోరాడే అంశాలు ఉన్నాయి. ఈ గురుత్వాకర్షణ శక్తిని కూడా అధిగమించి ఎందుకు అలా ఉన్నారనే అంశం సినిమా చూస్తే కానీ అర్థం కాదనిపిస్తుంది.
4. తమన్ నేపథ్య సంగీతం..
ఈ టీజర్ లో తమన అందించిన నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణతో హైప్ ను తీసుకొచ్చింది. రిథమిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో టీజర్ స్ఠాయిని అమాంతం పెంచేశారు.
ఉత్కంఠ, కామెడి టైమింగ్, తమన్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేసినట్లు కనిపిస్తోంది. ‘‘చిల్ ఇన్ ది ఎయిర్.. ఏ బ్లాస్ట్ ఆన్ ది వే’’ అని ట్యాగ్ లైన్ హై ఓల్టేజ్ ఎంటర్ టైన్ మెంట్ కు హమీ ఇచ్చింది.
5. టీజర్ లీక్ హైప్ ను పెంచిందా?
అధికారిక విడుదలకు ముందే టీజర్ ఆన్ లైన్ లోకి లీక్ అయినట్లు సమాచారం. దీనితో పైరసీ క్లిప్ లను షేర్ చేయవద్దని నిర్మాతలు హెచ్చరించారు. లీక్ వివాదాన్ని రేకిత్తించినప్పటికీ అది అభిమానుల్లో ఉత్సుకతను కలిగించింది.
ఈ టీజర్ చూస్తుంటే కచ్చితంగా మంచి సినిమా అవుతుందని టాలీవుడ్ మరో బ్లాక్ బస్టర్ అందుకుంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం రాజాసాబ్ తో పాటు కల్కి పార్ట్ 2, సలార్ 2 కూడా వంటి క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు ఉన్నాయి.