'మిత్రమండలి' సినిమాకి 'జాతిరత్నాలు' శాపమా?
తెలుగు కామెడీకి ఇది వార్నింగ్ బెల్
కొద్ది కాలం క్రితం ‘జాతిరత్నాలు’ అనే సినిమా సడన్‌గా వచ్చి రూల్స్ అన్నీ బ్రేక్ చేసి, సిస్టమ్‌ని వెటకారం చేస్తూ కల్ట్‌గా మారింది. అది సక్సెస్ కేవలం లక్ కాదు — నవీన్ పొలిశెట్టి యొక్క నిష్కపట నటన, అనుదీప్ రాసిన ఆ హాస్యపు అమాయకత్వం, ఆ టీమ్ మధ్య ఉన్న ఎఫర్ట్‌లెస్ కెమిస్ట్రీ కలిసి పనిచేశాయి. అది అసంబద్ధతను ఆర్ట్‌లా చూపించింది — అబ్సర్డిటీని సెలబ్రేట్ చేసింది.
కానీ ఆ విజయం ఒక విచిత్రమైన “శాపం”లా మారింది. అప్పటి నుండి ప్రతి చిన్న సినిమా దర్శకుడు “తరువాతి జాతిరత్నాలు” తీయాలని ప్రయత్నిస్తూ, తనే తానుగా జారిపడుతున్నాడు. అలా ‘మిత్రమండలి’, బన్నీ వాస్ నిర్మాణంలో, ప్రియదర్శి ప్రధాన పాత్రలో వచ్చిన తాజా బలి.
పెయిడ్ ప్రీమియర్‌లతో, హై హైప్‌తో వచ్చిన ఈ సినిమా మొదటి రోజే నెగటివ్ టాక్ తో కూలిపోయింది. సినిమా మొదలవగానే “ఈ కథ లేని కథ” అని బోల్డ్ డిస్క్లైమర్ వస్తుంది — కానీ అదే ప్రాబ్లమ్. కథ లేకపోవడం ఎప్పుడూ ఫన్ కాదు.
‘జాతిరత్నాలు’లో గందరగోళాన్ని కూడా చమత్కారంగా మలచగలిగింది. కానీ ‘మిత్రమండలి’ మాత్రం అదే గందరగోళాన్ని విసుగుగా మార్చేసింది. జోక్స్ పేలకపోవడం, టైమింగ్ తప్పిపోవడం, హాస్యం బలవంతంగా అనిపించడం ఇవన్నీ ఆ మేజిక్ లేని సంకేతాలు.
వాస్తవానికి ‘జాతిరత్నాలు’ కు రిలీజ్ సమయానికి ప్రేక్షకుల మూడ్, OTT యుగం మొదలు, కోవిడ్ తర్వాతి రిలీఫ్ ఫీల్, సోషల్ మీడియా మిమ్ కల్చర్ — ఇవన్నీ కలిసొచ్చిన కాంబినేషన్. OTT మీద సీరియస్ కంటెంట్ చూసి విసిగిపోయినప్పుడు, absurd humour కొత్త ఆక్సిజన్‌లా అనిపించింది. సోషల్ మీడియాలో మీమ్స్, నాన్సెన్స్ కల్చర్ పెరిగిన కాలం అది. జాతిరత్నాలు ఆ కల్చర్‌ని embrace చేసింది, celebrate చేసింది.అంటే, అది ఒకసారి మాత్రమే జరగగలిగిన “లైట్నింగ్ ఇన్ ఎ బాటిల్”.
కానీ మిత్రమండలి అదే టోన్‌ని 2025లో రిపీట్ చేస్తే, అది రిసెట్ కాకుండా రిసైకిల్ అవుతుంది. ఇప్పుడు ప్రేక్షకుడు మేచ్యూర్ అయ్యాడు;
అతనికి “నవ్వించు” అనే డిమాండ్ కంటే, “ఎందుకు నవ్వుతున్నానో జస్టిఫై చేయి” అనే అవగాహన పెరిగింది.
కానీ సమస్య ఏమిటంటే — ఇలాంటి సినిమా ఒకసారి విజయవంతం అయితే, ఇండస్ట్రీ దానిని ఒక ఫార్ములాగా తీసుకుంటుంది.
కళాత్మకతను కాదు, ఆర్టిఫిషియల్ లాజిక్‌ను కాపీ చేస్తుంది. అలాగే ‘జాతిరత్నాలు’ హిట్ తో — “కథ లేకపోయినా ఫన్ వర్క్ అవుట్ అవుతుంది” అనే తప్పుడు అర్థం తేలింది. కానీ అసలు సత్యం అది కాదు. అందులో కథ లేకపోవడంలో మేజిక్ లేదు. కథ లేకపోయినా ఎమోషన్ ఉన్నదనే మేజిక్ ఉంది.
జాతిరత్నాలు సిల్లీగా ఉన్నా, ఆ సిల్లీనెస్ వెనుక ఒక ప్రయత్నం ఉంది — ప్రతి డైలాగ్ వెనుక ఒక సబ్టెక్స్ట్ ఉంది, ప్రతి “నాన్సెన్స్” వెనుక ఒక “సెన్స్ ఆఫ్ ఐరనీ” ఉంది. అదే “స్మార్ట్ డంబ్” హాస్యం. మిత్రమండలి మాత్రం “డంబ్”లోనే ఆగిపోయింది. హాస్యం అంటే randomness అని అనుకుంది. కానీ randomness without rhythm is noise అనే మాటను మర్చిపోయింది.. ఎఫర్ట్‌లెస్‌గా కనిపించే సినిమాలు వెనుక ఎంత ఎఫర్ట్ ఉంటుందో మరచిపోతున్నారు.
ఫైనల్ గా
తెలుగు సినిమా ఇప్పుడు ఒక క్లిష్టమైన దశలో ఉంది. కామెడీకి ఇన్నోవేషన్ కావాలి, ఇమిటేషన్ కాదు. ప్రతి సారీ “తరువాతి జాతిరత్నాలు” అనే ట్యాగ్‌తో సినిమా మొదలుపెడితే, ఆ సినిమా మొదటి నిమిషానికే చనిపోతుంది. ఎందుకంటే ఫన్ అంటే “అనుకోకుండా పుట్టినది.” దాన్ని ప్లాన్ చేయగలిగితే అది జోక్ కాదు, స్కెచ్ మాత్రమే.
మిత్రమండలి ఒక వైఫల్యం మాత్రమే కాదు, ఇది ఒక హెచ్చరిక కూడా.
హాస్యం ఫార్ములా కాదు, అది ఫీలింగ్.
అది జెన్యూన్ గా, క్యారక్టర్ డ్రైవన్ గా పుడితేనే బతుకుతుంది.
లేదంటే ప్రతి కామెడీ సినిమా కూడా “జాతిరత్నాల శాపం” కి కొత్త బలిగా మారిపోతుంది.