నెట్ ఫ్లిక్స్ వేసిన పిటిషన్ ను కొట్టేసిన మద్రాస్ హైకోర్టు
ధనుష్- నయనతార కాపీ రైట్ వివాదంలో కీలక పరిణామం;
By : The Federal
Update: 2025-01-28 13:28 GMT
కోలీవుడ్ నటులైన నయనతార- ధనుష్ వివాదంపై నెట్ ఫ్లిక్స్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది. తన ప్రొడక్షన్ హౌజ్ లో వచ్చిన సినిమాలోని మూడు సెకన్ల నిడివి గల క్లిప్ ను ‘‘ నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేయిల్’’డాక్యుమెంటరీలో వాడుకుంటున్నారని ఆరోపిస్తూ ధనుష్ కాపీరైట్ దావా వేశారు. దీనిని సవాల్ చేస్తూ నెట్ ఫ్లిక్స్ కోర్టును ఆశ్రయించగా ఉపశమనం లభించలేదు.
ఈ డాక్యుమెంటరీలో నయనతార సినిమా రంగ ప్రవేశం, ఆమె పడిన కష్టాలు, గత సంబంధాలు, పురుషాధిక్య ప్రపంచంలో తన గుర్తింపును కాపాడుకున్న అంశాలను హైలైట్ చేస్తూ నిర్మించిన డాక్యుమెంటరీని గత ఏడాది నవంబర్ 18 న నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశారు.
ఇది విడుదలైన తరువాత నయనతార, ఆమె భర్త విఘ్నేశ్ శివన్, వారి నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై నటుడు, నిర్మాత అయిన ధనుష్ కోర్టును ఆశ్రయించారు. తన నిర్మాణంలో వచ్చిన ‘నేను రౌడీనే’ అనే చిత్రంలోని కొన్ని విజువల్స్ ను ఉపయోగించారని దావాలో పేర్కొన్నారు.
తరువాత హైకోర్టు నుంచి నెట్ ఫ్లిక్స్ ఇండియా లిమిటెట్ చెందిన లాస్ గాటోస్ ప్రొడక్షన్స్ సర్వీసెస్ ఇండియా కు నోటీసులు పంపారు. నయనతార డాక్యుమెంటరీలోని కంటెంట్ ను 24 గంటల్లో తీసివేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ధనుష్ హెచ్చరించడంతో వెంటనే సంస్థ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అలాగే తనకు నెట్ ఫ్లిక్స్ ఇండియా,నయనతార రూ. 10 కోట్ల పరిహారం చెల్లించాలని ధనుష్ దావాలో కోరడంతో అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ వివాదంపై నయనతార అప్పట్లో పబ్లిక్ స్పందించిన ఓ లేఖను విడుదల చేసింది. ధనుష్ నష్టపరిహారం కోరి తన స్థాయిని తగ్గించుకున్నారని ఆరోపించింది. మీ అభిమానుల సమక్షంలో జరిగిన ఆడియో లాంఛ్ లో మీరు చిత్రీకరించిన సగం వ్యక్తిగా ఉండాలని నేను కోరుకుంటున్నానని.. కానీ మీరు చెప్పినవన్నీ మీరు కనీసం పాటించరని చురకలు అంటించింది.
అలాగే తన డాక్యుమెంటరీ కోసం షారుక్ ఖాన్, చిరంజీవి, రామ్ చరణ్ సహ ఇతర నిర్మాతలు ఫుటేజీని వాడుకోవడానికి అనుమతి ఇవ్వడం పై ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకుముందు షారుక్ ఖాన్ బ్లాక్ బస్టర్ జవాన్ లో నయన తార కథానాయికగా నటించింది. ఈ సినిమాకు అట్లీ డైరెక్టర్ కాగా, అనిరుధ్ స్వరాలు అందించారు. ఇది షారుఖ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది