కెరీర్ వేటలో తడబడుతున్న త్రిష…
పోరాడాల్సింది గ్లామర్తోనా, కథలతో నా?!;
"స్టార్డమ్ అంటే వయస్సుతో నశించేది కాదు… ఎంపికలతో మెరుగవుతూ నిలిచే అస్త్రం!"
ఈ వాక్యం ఇప్పుడు త్రిష కెరీర్ పరిశీలించే ప్రతి ఒక్కరి మనస్సులోకి వస్తోంది.
40 ఏళ్ల మైలురాయిని దాటినా, ఆమె ముఖంలో వయసు ముద్ర ఎక్కడా కనపడుదు. ఇప్పటికి కెరీర్ ఆరంభంలోనే ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’లా అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించిన త్రిషలాగే కనపడుతుంది. ఆమె చిరునవ్వు చూసినవాళ్లకు – "ఇలాంటి చూపు… ఈ మధ్య వచ్చిన హీరోయిన్స్ లో ఎవరికి ఉంది?" అన్న భావన కలుగుతూనే ఉంది.
కొత్త హీరోయిన్లు వందలు వస్తున్న ఈ గ్లోబల్ ట్రెండ్‌లో… త్రిష మాత్రం ఇప్పటికీ స్టార్ హీరోల ప్రాజెక్టుల్లో కీలక పాత్రల్లో కనిపిస్తూనే ఉంది. ఇది క్రేజ్ కాదు — ఇది తిరుగులేని ‘లెగసీ’.
కానీ... ఈ లెగసీకి తగ్గ ఫలితాలు మాత్రం తెరపై ఎందుకు కనబడటం లేదు?
ఆమె ఎంపికలే తప్పాయా? లేక అవకాశాలు ఆమె స్థాయిని తక్కువ చేస్తున్నాయా?
ఇది కేవలం ఓ స్టార్ కెరీర్ ముగుంపుకు ముందు వచ్చే చీకటి వేళలా అనిపిస్తోంది.
మరి ఈ చీకటి నుంచి వెలుగు వైపు ఆమె మరోసారి నడవగలదా?
‘96’ – తిరిగి పుట్టిన త్రిష
చాలా కాలం తర్వాత ఒక సినిమా – ఒక పాత్ర – ఒక ఎమోషన్… త్రిషను మళ్లీ ప్రేక్షకుల గుండెల్లో నిలబెట్టింది. ‘96’ లో జానకి పాత్ర ఆమెను తిరిగి తారగా నిలబెట్టింది. ఆ పాత్రలో త్రిష నటన కాదు – ఆలోచన కనిపించింది. ఆమె కన్నీళ్లు కాదు – మనల్ని తడిపే బాధ కనిపించింది.
తర్వాత వచ్చిన ‘పొన్నియన్ సెల్వన్’ లో ఆమె ‘కుందవై’గా ఒదిగిపోయింది. రాయల పరంపరలో ఓ వీరనారి పాత్రను ఆమె గర్వంగా మోసింది. అప్పటిదాకా ఆమెను తక్కువగా చూసినవాళ్లందరూ ఒక్కసారిగా తిరిగి చూసారు – “త్రిష ఇంకా ఇదిగా చేయగలదా?”
“Content is Queen, Glamour is Temporary” అన్నట్టు ఆమె కంటెంట్ ఉన్న సినిమాల్లోనే మెరిసింది. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు మాత్రం త్రిషను వెనక్కి నెట్టేసాయి.
ఆరు ఫ్లాపుల ఊబిలో త్రిష
విజయ్ చేసిన Leoతో పాన్ ఇండియా యాత్రపై ఆశలు పెట్టుకుంది త్రిష. కానీ ఆ సినిమాలో త్రిష పాత్రకి తక్కువ స్కోప్, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా తక్కువగా ఉంది. తర్వాత ఆమె చేసిన Identity, Vidaamuyarchi, Good Bad Ugly అన్నీ బాక్సాఫీస్ దగ్గర చెప్పుకోదగిన రీతిలో వర్కవుట్ కాలేదు.
సోలోగా చేసిన థ్రిల్లర్ సినిమా The Road కూడా నిరాశే మిగిల్చింది. ఇక కమల్ హాసన్‌తో చేసిన Thug Life అయితే అన్నిటినీ మించి విమర్శలకు గురైంది. ఈ సినిమా గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అన్నట్లుంది. ఇలా వరసపెట్టి త్రిష కెరీర్‌కు ఎదురుదెబ్బలు తగులుతూ వచ్చాయి. ఇది త్రిషకు వరుసగా ఆరో ఫ్లాప్ కావడం గమనార్హం.
“ఓ స్టార్ హీరోతో నటించడం కాదు.. ఒక మంచి కథలో మెరుగ్గా కనిపించడం ముఖ్యం”
ఒకప్పుడు హీరోయిన్లు కు ఉనికి ఏమిటంటే..స్టార్ హీరోల సరసన కనిపించడమే. కానీ ఇప్పుడు ప్రేక్షకులు కంటెంట్‌కి ఎక్కువ విలువ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో త్రిష సినిమాలపై బిజినెస్ అభిప్రాయం కూడా మారిపోయింది. ట్రేడ్ వర్గాల్లో ఆమె నేమ్ వాల్యూ తగ్గుతున్న మాట నిజం.
"ఇప్పుడు త్రిష నటించడానికి కాదు, నిలవడానికి స్క్రిప్ట్ అవసరం" . గోట్లో మెరిసినా… స్టార్డమ్కు దూరం. విజయ్ సినిమా GOATలో త్రిష స్పెషల్ రోల్‌తో ఆకట్టుకుంది. కానీ ఇది మళ్ళీ ఆమె కెరీర్‌ను నిలబెట్టే స్థాయికి తీసుకెళ్లలేదు. హీరోయిన్లుగా పూర్తి స్దాయి పాత్రలే మళ్లీ ఆమెకు ఓ విజయం అందించగలవని అభిమానులు అంటున్నారు.
ఇప్పుడు ఆశలన్నీ – ‘విశ్వంభర’, ‘సూర్య45’
ప్రస్తుతం త్రిష చిరంజీవితో చేస్తున్న ‘విశ్వంభర’, సూర్యతో చేస్తున్న 45వ సినిమాలపైనే పూర్తిగా ఆశలు పెట్టుకుంది. విశ్వంభర చిత్రం రిలీజ్ డిలేలు ఉన్నా.. ఈ మైథలాజికల్ జాన్రా ఫిల్మ్ లో త్రిషకు కీలక పాత్ర ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి.
మరో ప్రక్క సూర్య సినిమా మరింతగా మాస్, క్లాస్ ఆడియెన్స్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందుతున్న నేపథ్యంలో, త్రిషకు మళ్లీ తిరిగిరాని గుర్తింపు వస్తుందేమో చూడాలి.
"తారలు పడిపోవచ్చు. కానీ జ్ఞాపకాల్లో ఎప్పటికీ వెలిగిపోతాయి."
త్రిష స్టార్డమ్ ప్రస్తుతం క్రిందకు దిగుతున్న రోలర్ కోస్టర్‌లో ఉన్నట్టుంది. గ్లామర్, ఫాలోయింగ్, క్రేజ్ అన్నీ ఉన్నా… కంటెంట్ తో సపోర్ట్ చేయని స్క్రిప్ట్‌లు ఆమెను వెనక్కి లాగుతున్నాయి. ఈ స్దితిలో ఆమె గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే – "వయసు పెరిగినా… ప్రేక్షకుడి మనసు గెలుచుకోవడం ఒక్క మంచి పాత్రతోనే సాధ్యమవుతుంది!"
ఏదైమైనా "ప్రేమించబడకపోవడం కంటే… మర్చిపోబడటం చాలా బాధకరం!" ఇది ఓ డైలాగ్ కాదు. ఇది త్రిషలాంటి ఒక సుదీర్ఘ సినీ జీవితం గడిపిన నటి మనస్సుని,కెరీర్ ని చెప్పే వాక్యం.
ఇప్పుడు త్రిష ముందున్నది ఒకే ప్రశ్న:
"వయసు పెరిగిన స్టార్ గా గ్లామర్‌ను నిలబెట్టుకుంటూ నటిగా బతికేలా బలమైన కథల కోసం త్రిష ఎదురుచూడాలా? లేక గ్లామర్‌కే అండగా మిగిలిపోవాలా?"
ఈ పోరాటంలో త్రిష గెలవాలని కోరుకునేది ఎవరూ అంటే నిస్సందేహంగా , అది ప్రేక్షకులే.
ఎందుకంటే... ఒక స్టార్ నశించకుండా తిరిగొస్తే, అది ఆమె alone journey కాదు — ఒక పరిపూర్ణమైన కెరీర్.