సైకో థ్రిల్లర్ 'ది స్మైల్ మేన్' ఓటిటి రివ్యూ
తాజాగా ఓటీటీలో కి వచ్చిన ఈ చిత్రం కథేంటి, సినిమా చూడదగ్గదేనా చూద్దాం..;
ఓటీటీ లో థ్రిల్లర్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. భాషతో సంబంధం లేకుండా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. దాంతో ఎక్కడెక్కడి థ్రిల్లర్ సినిమాలను ఓటీటీలో రిలీజైన తర్వాత తెలుగు ప్రేక్షకులు చూసేస్తున్నారు. అలా రీసెంట్ గా తమిళ డబ్బింగ్ చిత్రం 'ద స్మైల్ మ్యాన్' ఓటీటీ లో దిగింది. సీనియర్ నటుడు శరత్ కుమార్ 150వ సినిమాగా తీసిన 'ద స్మైల్ మ్యాన్' గత ఏడాది డిసెంబరులో థియేటర్లలో రిలీజైంది. అక్కడ పెద్దగా ఆడలేదు. తాజాగా ఓటీటీలో కి వచ్చిన ఈ చిత్రం కథేంటి, సినిమా చూడదగ్గదేనా
స్టోరీ లైన్
ఒంటరి జీవితం గడుపుతున్న సీనియర్ సీఐడీ ఆఫీసర్ చిదంబరం (శరత్ కుమార్) కి అల్జీమర్స్ వ్యాధి వస్తుంది. ఈ క్రమంలో తన జ్ఞాపకాలు ఏడాదికి మించి గుర్తుండవని డాక్టర్స్ చెప్పడంతో తన పరిష్కరించిన కేసుల గురించి పుస్తకంగా రాస్తారు. ఇందులో స్మైల్ మ్యాన్ కేసు గురించి మాత్రం సగమే రాస్తారు. వాస్తవానికి ఐదేళ్ల క్రితం ‘స్మైల్ మేన్’ అనే కిల్లర్‌ను పట్టుకునే ప్రయత్నంలో చిదంబరం తీవ్రంగా గాయపడతాడు.
అప్పుడు ఆఫీసర్ వెంకటేష్ (సురేష్ మీనన్) రంగంలోకి దిగుతాడు. అతని చేతిలో స్మైల్ మేన్ చనిపోయాడనే వార్తలు వస్తాయి. ఈ ఘటన తర్వాత వెంకటేష్ జాడ తెలియకపోవడంతో, కేసు ముగిసినట్టే అనుకుంటారు. అయితే, చిదంబరం స్మైల్ మేన్ చనిపోలేదని చెప్పి పోలీస్ అధికారులను షాక్‌కు ఇస్తాడు. ఈ వార్త వెలువడిన మరుసటి రోజు నుంచి మళ్లీ వరుస హత్యలు ప్రారంభమవుతాయి. అసలు స్మైల్ మేన్ ఎవరు? అతని హత్యలకు మూల కారణం ఏమిటి? చిదంబరం అతన్ని పట్టుకోగలిగాడా లేదా అన్నది మిగతా కథ.
ఎనాలసిస్
అల్జీమర్స్ తో బాధపడుతున్న ఒక పోలీస్ ఆఫీసర్, ఓ సైకో కిల్లర్ ను వేటాడే తీరు ఎలా ఉంటుందనే విషయమై కథ రాసుకున్నారు. డైరెక్టర్ జంట శ్యామ్, ప్రవీణ్ ఈ సినిమా కథను సాలిడ్ గానే అల్లుకున్నారు. అయితే ఇప్పటికి తమిళంలో వచ్చిన "రాక్షసన్"(తెలుగు రాక్షసుడు), 'పోర్ తోజిల్' (శరత్ కుమార్), హిట్ లిస్ట్ (శరత్ కుమార్) సినిమాలను గుర్తు చేస్తుంది. ఓ సీరియల్ కిల్లర్ కథను ఓ ప్రిడిక్టబుల్ టెంప్లేట్ లో చెప్పడం జరిగింది. అయితే స్క్రీన్ ప్లే మాత్రం డిఫరెంట్ గా రాసుకున్నారు. ఓ రకంగా స్మైల్ మ్యాన్ ఇల్లాజికల్ థ్రిల్లర్ గా అమెచ్యూర్ మేకింగ్ తో కనిపిస్తుంది. అలాగే కిల్లర్ ఫేస్ సినిమా సగం దాకా దాచి ఉంచారు. అయితే రివీల్ చేసిన వచ్చే ఎక్సైట్మెంట్ ఇవ్వలేకపోయారు.
అలాగే కిల్లర్ మోటివ్ కానీ, బ్యాక్ స్టోరీ కానీ అంత సాలిడ్ గా లేవు. వాటిని నోటితో చెప్పించారు కానీ చూపించలేదు. దాంతో పెద్దగా రిజిస్టర్ కాలేదు. ఇలాంటి థ్రిల్లర్ సినిమాల్లో ఎన్ని తక్కువ లూప్ హోల్స్ ఉంటే అంత ఎక్కువ ఆసక్తిగా ఉంటుంది. అప్పుడు మరింత స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉండేది. డైరెక్టర్ ఇద్దరు ఉన్నా ఆ విషయంలో సక్సెస్ కాలేదు. దానికి తోడు కిల్లర్ చంపే శవాలన్ని దంతాలన్నీ కనిపించేలా నోరు భాగమంతా కోసేసిన శవాలే. అవి సున్నిత మనస్కులు చూడటం కష్టం అనిపిస్తుంది.
టెక్నికల్ గా
నటీనటుల్లో శరత్ కుమార్ ఎప్పటిలాగే అదరగొట్టారు. అలాగే నెగిటివ్ పాత్రలో కలైయరసన్ మంచి పోటీ ఇచ్చారు. టెక్నికల్ గా చూస్తే ...గవాస్కర్ అవినాశ్ నేపథ్య సంగీతం అందించారు.
సినిమాలో మ్యూజిక్ కీలక భాగం మోసింది కానీ చాలా చోట్ల ఫ్లాట్ అయిపోయింది. ప్రతి మర్డర్ కు ముందు ఇండికేట్ చేసే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కిల్లర్ వచ్చేటప్పుడు మనని హెచ్చరిస్తూంటాయి. దాంతో సినిమాలో ఉండే సర్పైజ్ ఎలిమెంట్ మిస్ అయ్యింది. థ్రిల్లర్ సినిమాకు ఏది అవసరమో దాన్నే దెబ్బకొట్టింది. మిగతా డిపార్టమెంట్స్ లో విక్రమ్ మోహన్ ఫొటోగ్రఫీ బాగుంది. లోకేశ్ ఎడిటింగ్ ఓకే.
చూడచ్చా
క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కథల పట్ల ఆసక్తి ఉన్నవారికి మాత్రమే నచ్చే సినిమా ఇది.
ఎక్కడ చూడచ్చు
తెలుగు వెర్షన్ 'ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది.