విక్కీ కౌశల్ “ఛావా”(తెలుగు) రివ్యూ

హిందీలో సినిమా అంత భారీ విజయం సాధించటానికి గల కారణం ఏమిటి, తెలుగువారికి నచ్చే విషయాలు ఏమున్నాయి, అసలు సినిమా కథ ఏమిటి?;

Update: 2025-03-07 10:26 GMT

మరాఠి యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ జీవిత కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ఛావా’. విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ లో ఫిబ్రవరి 14న రిలీజయి భారీగా సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో డబ్ చేసి గీత్ ఆర్ట్స్ ఈ రోజు (మార్చ్ 7న) థియేటర్స్ లో రిలీజ్ చేసింది. హిందీలో సినిమా అంత భారీ విజయం సాధించటానికి గల కారణం ఏమిటి, తెలుగువారికి నచ్చే విషయాలు ఏమున్నాయి, అసలు సినిమా కథ ఏమిటి?

స్టోరీ లైన్

ఛత్రపతి శివాజీ మరణించాడని మొఘల్ రాజు సామ్రాజ్యాధిపతి ఔరంగజేబు (అక్షయ్ ఖన్నా)సంతోషం ఎంతో సేపు ఉండదు. ఈలోగా శివాజీ తనయుడు శంభాజీ మహారాజా(విక్కీ కౌశల్) వచ్చి ఓ మొఘల్ ప్రాంతాన్ని గెలిచి షాక్ ఇస్తాడు. దాంతో ఔరంగజేబు శంభాజీకి ఓ ప్రతిపాదన పంపుతాడు. తమ మతమైన ఇస్లామ్ స్వీకరించి, తన సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తే యథేచ్ఛగా మరాఠా రాజ్యాన్ని శంభాజీ ఏలుకోవచ్చు అని చెప్తాడు. అయితే శంభాజీ అందుకు చలించడు. అందుకు శంభాజీ ప్రతిగా ఔరంగజేబ్ కూతురును తనకిచ్చి పెళ్ళి చేస్తే అప్పుడు ప్రతిపాదనను అంగీకరిస్తానని సమాధానమిస్తాడు.

ఈ క్రమంలో రెండు వర్గాల మధ్యా యుద్దం మొదలవుతుంది. మరాఠా సామ్రాజ్యాన్ని ఔరంగజేబు సేనలు అన్ని వైపులా ముట్టడిస్తుండగా శంభాజీ కూడా తన సైన్యంతో మొఘల్ సైన్యాన్ని మట్టుపెడుతూ ఉంటాడు. అయితే శంభాజీని దెబ్బతీయలేమని కొద్ది కాలానికే ఔరంగజేబు కు అర్దమవుతుంది. దాంతో సంఘమేశ్వర్ లో శంభాజీ అతితక్కువ సైన్యంతో ఉన్నాడని తెలుసుకున్న మొఘలులు ఓ పన్నాగం పన్నుతారు. దొడ్డిదారిన శంభాజీని బంధించడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు ఏమైంది, శంభాజీని ఔరంగజేబ్ దెబ్బ తీయగలిగాడా, మొఘల్ సామ్రాజ్య పతనానికి శంభాజీ ఎలా కారణమయ్యాడు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది

ఛావా అంటే సింహం పిల్ల అని అర్ధం. ఈ సినిమాలో హిందూ ఎమోషన్ అలాగే ఒకప్పటి మరాఠా రాజు అనే విషయం అక్కడ వారికి కనెక్ట్ అయ్యింది. అదే సమయంలో సినిమాలో ఎమోషన్స్ ని బాగా పండించగలిగారు. రీసెర్చ్ వర్క్ బాగా చేసి వర్కవుట్ చేసిన కథనం ఇది. . అయితే చరిత్ర వక్రీకరణ జరిగిందనే విమర్శలు ఉన్నా, అసలు చరిత్ర ఏమిటనేది సరైన రికార్డ్ లేకపోవటం విషాదం. ఇక ఈ సినిమాలో శంభాజీ యాక్షన్ ఎపిసోడ్స్ మంచి హై ఎలివేషన్స్ తో ఆకట్టుకునేలా డిజైన్ చేసారు. కథ కన్నా కథనం ప్రధానంగా సాగుతుంది. ఫస్టాఫ్ సోసోగా అనిపించినా సెకండాఫ్ నుంచి సినిమా పరుగెడుతుంది. అయితే సినిమా మనవాళ్లకు స్లో నేరేషన్ తో సాగుతోందనిపించవచ్చు. అయితే సినిమా క్లైమాక్స్ చివరి అరగంట మాత్రం హైలెట్ గా నిలిచింది. క్లైమాక్స్ లో కన్నీరు పెట్టించగలిగే స్దాయిలో భావోద్వేగాలు పండించటం సినిమాని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లింది.

టెక్నికల్ గా ...

ఈ సినిమా డైరక్టర్ ఓరియెంటెడ్ ఫిల్మ్. కథ, కథనం, నటన ఓ ఎత్తు అయితే శంభాజీ పోరాట స్ఫూర్తి, ఆయన పడే బాధ అన్ని ఎమోషన్స్ ని ప్రేక్షకులకు కనెక్ట్ చేయటంలో వందశాతం సకెస్స అయ్యాడు అలాగే యుద్ధ సన్నివేశాలని చక్కగా డిజైన్ చేసి హై ఎమోషన్స్ తో కదం తొక్కించాడు. ఇక మరాఠా సేనలు 'జై భవానీ', 'హర హర మహదేవ్'అంటూ విరుచుకు పడే సీన్స్ ని అంతే కన్సీన్సింగ్ గా, నైపుణ్యంతో తీసారు దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌ .

సౌరభ్‌ గోస్వామి సినిమాటోగ్రఫీ, ఏఆర్‌ రెహమాన్‌ నేపథ్య సంగీతం సినిమాని నెక్ట్స్ లెవిల్ లో కూర్చో బెట్టాయి. ముఖ్యంగా 5000 మంది ముఘల్ సైన్యంతో ఛావా పోరాడే సీక్వెన్స్ ను మర్చిపోవటం కష్టమే. తెలుగు డైలాగులు, డబ్బింగ్ రెండూ బాగా కుదిరాయి.

నటీనటుల్లో శంభాజీగా విక్కీ కౌశల్‌ విశ్వరూపం చూపించారు. క్లైమాక్స్ 20 నిమిషాల్లో విక్కి నటన కన్నీరు పెట్టించాడు. ఔరంగజేబుగా అక్షయ్‌ ఖన్నా, శంభాజీ భార్య ఏసుబాయిగా రష్మిక ఇద్దరూ వారి పాత్రలను బాగా పండించారు. అశుతోష్ రాణా (Ashutosh Rana), ప్రదీప్ రావత్ (Pradeep Rawat) లాంటి సీనియర్ నటులు అదరకొట్టారు. అయితే డబ్బింగ్ సోసో గా ఉంది.

చూడచ్చా

మతం, చరిత్ర వంటి విషయాలను ప్రక్కన పెడితే బాగుండే సినిమా. ఓ భావోద్వేగాన్ని మొదటి నుంచి చివరదాగా తీసుకెళ్లి ,క్లైమాక్స్ లో పీక్స్ లో పండించిన చిత్రం.

నటీనటులు: విక్కీ కౌశల్‌, రష్మిక, అక్షయ్‌ ఖన్నా, అషుతోష్‌ రాణా, వినీత్‌ కుమార్‌ సింగ్‌, డయానా పెంటి తదితరులు;

సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌;

సినిమాటోగ్రఫి : సౌరభ్ గోస్వామి (Saurabh Goswami)

నిర్మాత: దినేశ్ విజన్ (Dinesh Vijan)

దర్శకత్వం: లక్ష్మణ్‌ ఉటేకర్‌;

తెలుగు రిలీజ్ : గీతా డిస్ట్రిబ్యూషన్

విడుదల: 07-03-2025

Tags:    

Similar News