మలయాళ సూపర్ హిట్ 'వర్షంగళ్కు శేషం' ఓటిటి రివ్యూ

టెక్నికల్ గా ఈ సినిమా మంచి స్టాండర్డ్స్ లో ఉంది. విశ్వజిత్ సినిమాటోగ్రఫీ లో విలేజ్ షాట్స్ అద్బుతంగా ఉన్నాయి. అలాగే అమృత్ రామ్ సంగీతం కూడా.

Update: 2024-07-01 15:30 GMT

మరో మళయాళ సినిమా ఓటిటిలోకి వచ్చేసి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ప్రత్యేకత మ‌ల‌యాళ పరిశ్రమలోని స్టార్స్ పిల్లలు ప్రధాన పాత్రల్లో కనిపించటం. మళయాళ స్టార్ మోహ‌న్‌లాల్ కొడుకు ప్ర‌ణ‌వ్ మోహన్ లాల్ (Pranav Mohanlal) ఒక హీరోగా, మరో మళయాళి నటుడు దర్శకుడు శ్రీనివాసన్ పెద్ద కొడుకు వినీత్ శ్రీనివాసన్ డైరక్టర్ గానూ, ఆయన చిన్న కొడుకు ధ్యాన్ శ్రీనివాసన్ మరో హీరోగానూ చేసారు. అలాగే ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి ప్రియదర్శని మరో కీలకమైన పాత్రలో చేసింది. ఈ సినిమా మళయాళంలో ఈ సంవత్సరం టాప్ గ్రాసర్ లలో ఒకటిగా నిలవటమే కాకుండా 80 కోట్లు దాకా వసూలు చేసి కొత్త రికార్డ్ లు క్రియేట్ చేసింది. ఇంతకీ సినిమా ఎలా ఉంది..అందులో కథేంటో చూద్దాం.


స్టోరీ లైన్ ఏంటంటే...

సినిమా 1970-90 ల మధ్యకాలంలో జరుగుతుంది. సూపర్ హిట్ సినిమా డైరెక్టర్ వేణు(ధ్యాన్ శ్రీనివాసన్) తన ప్రెండ్ మురళి(ప్రణవ్ మోహన్ లాల్) ని వెతుకుతూ ప్రయాణం మొదలుపెడతాడు. ఈ క్రమంలో క్యాబ్ డ్రైవర్(వినీత్ శ్రీనివాసన్)కి మురళితో తన పరిచయం నుంచి తన కథ మొత్తం వేణు చెప్తాడు. కేరళలో ఓ మారు మూల పల్లెలో ఉండే వేణుకు నాటకాల పిచ్చి. అక్కడే ఆ నాటకాల్లోనే మురళి అనే వయెలనిస్ట్ పరిచయం అవుతాడు. మురళి టాలెంట్ కు చెన్నై అయితే బాగుంటుందని అక్కడ సినిమా డైరక్టర్ కావచ్చు అని వేణు సలహా ఇస్తాడు. మురళి కూడా సరే అని ఇద్దరూ మద్రాస్ వెళ్తారు.

మద్రాస్ లో ఇద్దరూ ఓ చిన్న గదిలో ఉంటూ ప్రయత్నాలు చేస్తూంటారు. మొదట్లో చీత్కారాలు ఎదుర్కొంటారు. మురళికు సంగీత దర్శకుడు ఛాన్స్ రాదు కానీ ఓ నిర్మాత దొరకటంతో తన స్నేహితుడు వేణుకు పరిచయం చేసి అవకాసం ఇప్పిస్తాడు. అయితే మొదట సినిమాకు పేరున్న టెక్నీషియన్స్ ఉండాలని తను సంగీత దర్శకుడుగా ఇష్టపడడు. వేరే సంగీత దర్శకుడుని కలిసి అతనికి తన దగ్గర ఉన్న పాటి ఇచ్చి సినిమాకు పెట్టిస్తాడు. ఆ పాట సూపర్ హిట్ అవుతుంది. కానీ మురళి టాలెంట్ ప్రపంచానికి తెలియదు. మిగిలిపోతాడు.

మరో ప్రక్క వేణు సినిమా సూపర్ హిట్ అవటంతో వరస ఆఫర్స్ తో బిజీ అయ్యిపోతాడు. మురళి ఒంటిరితనం డిప్రెషన్ లో తాగుడుకు బానిసైపోతాడు. ఇలా ప్రాణ స్నేహితులైన వీళ్ల మధ్య దూరం ఎంతదాకా వెళ్తుదంటే మురళి ఎక్కడున్నాడో వేణుకు కూడా తెలియనంత. అలా విడిపోయిన స్నేహితుడుని వేణు వెతుక్కుంటూ ఎందుకు బయిలుదేరారు. మురళి జీవితంలో మ్యూజిక్ డైరక్టర్ అయ్యారా...చివరకు ఏమైంది వంటి విషయాలు సినిమా చూస్తే తెలుస్తాయి.

ఎలా ఉంది?

స్నేహం ప్రధానాంశంగా తీసుకుని భావోద్వేగాలతో కథను నడిపారు. అయితే అసలు కథలోకి వెళ్లటానికి చాలా టైమ్ తీసుకున్నారు. స్లో నేరేషన్ మొదట్లో ఇబ్బంది పెడుతుంది. అయితే సినిమాలో ఎప్పుడైతే డ్రామా,కాంప్లిక్ట్స్ మొదలయ్యాయో అక్కడ నుంచి పరుగెడుతుంది. ఏదైమైనా లెంగ్త్ ఎక్కువే అని ఫీలింగ్ వస్తుంది. కామెడీ ఉంది కానీ అది మళయాళ సినిమా పరిశ్రమపై వేసిన కొన్ని సెటైర్లు మనకు ఇక్కడ పెద్ద కనెక్ట్ కాలేము. ఆ నాటి మద్రాస్ వాతావరణం..అప్పటి సినిమా పరిస్దితులు మద్య కథను సహజంగా నడిపించారు. మలుపులు ఉన్నాయి కానీ అవేమీ ట్విస్ట్ లు గా అనిపించవు. ఇక మళయాళ హీరో నివిన్ పౌలీ సీన్స్ బాగున్నాయి. తనపై తానే సెటైర్లు వేసుకోవటం నవ్విస్తుంది.

టెక్నికల్ గా ఈ సినిమా మంచి స్టాండర్డ్స్ లో ఉంది. విశ్వజిత్ సినిమాటోగ్రఫీ లో విలేజ్ షాట్స్ అద్బుతంగా ఉన్నాయి. అమృత్ రామ్ సంగీతం బాగుంది.ఒక పాట సూపర్ హిట్. ఆ పాటను తెలుగులో డబ్ చేయలేదు. యాజటీజ్ ఉంచేసారు. రంజిత్ ఎడిటింగ్ బాగుంది కానీ మన తెలుగుకు మరింత స్పీడు కావాలి. ఇక్కడకు మనకు తగ్గట్లు ఎడిట్ చేయాల్సింది. నిర్మాణ విలవలు బాగున్నాయి.
చూడచ్చా

స్లో నేరేషన్ లో సాగే ఈ సినిమా చూడటానికి కొద్దిగా సహనం ఉండాలి. అసభ్యత, హింస లేదు కాబట్టి ప్యామిలీతో చూడచ్చు. నచ్చుతుంది కూడా.

ఏ ఓటిటిలో ఉంది

సోనీ లివ్ ఓటిటిలో తెలుగులో ఉంది.


Tags:    

Similar News