మెడికల్ మాఫియా: 'పిల్' (జియో సినిమా) వెబ్ సిరీస్ రివ్యూ!

ఈ దేశంలో ఏ వ్యాధితో ఎంత మంది చనిపోతున్నారన్న విషయంపై గణాంకాలు మన దగ్గర ఉన్నాయి. కానీ, నకిలీ మందుల వల్ల ఎంత మంది ప్రాణాలు పోతున్నాయి? ఈ విషయంపై ఎలాంటి లెక్కలు లేవు.

Update: 2024-07-22 06:16 GMT

ఈ దేశంలో ఏ వ్యాధితో ఎంత మంది చనిపోతున్నారన్న విషయంపై గణాంకాలు మన దగ్గర ఉన్నాయి. కానీ, నకిలీ మందుల వల్ల ఎంత మంది ప్రాణాలు పోతున్నాయి? ఈ విషయంపై ఎలాంటి లెక్కలు లేవు. దేశం ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యల్లో ఒకటి నకిలీ మందులు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వేసుకునే మందులు నకిలీవి అయితే.. వ్యాధి తగ్గకపోగా కొత్త ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. ఎప్పటికప్పుడు డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (డీసీఏ) అధికారులు వరుసగా నకిలీ ఔషధాల తయారీ కంపెనీలపై దాడులు చేస్తూ, వాటిని సీజ్‌ చేస్తున్నా పెద్దగా ఫలితం ఉండటం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న నకిలీ మందులను అడ్డుకోవటం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో మందులు విషయంలో కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని, ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకోవాలని చెప్తూ ఈ సమస్యపై ఈ పిల్ సిరీస్ వచ్చింది. ఈ సీరిస్ కథ ఏమిటి..ఎలా ఉంది

స్టోరీ లైన్

ఇండ్రస్టలియస్ట్ బ్రహ్మ గిల్ (పవన్ మల్హోత్ర) ఫార్మాస్యూటికల్ సంస్థను నిర్వహిస్తూ ఉంటాడు. అతను ఎలాంటి రూల్స్ ,రెగ్యులేషన్స్ పెట్టుకోడు. కేవలం లాభమే పరమావిధిగా మెడిసన్స్ ఉత్పత్తి చేస్తూంటాడు. అలాగే ఆ మెడిసన్స్ కు ఎలాంటి ఫర్మిషన్స్ లేకుండా క్లినికల్ ట్రైల్స్ నిర్వహిస్తూంటాడు. అడ్డు వచ్చిన అధికారులను డబ్బుతో కొనేస్తూంటాడు. అలాగే అతనికి పొలిటికల్ సపోర్ట్ కూడా ఉంటుంది. అథని కొడక్కు ముఖ్యమంత్రి కూతురు తో సంభందం కలుపుకునేందుకు రెడీ అవుతూంటాడు.

ఈ క్రమంలోనే గిల్ సంస్థవారు డయాబెటిక్ పేషంట్ల కోసం ఒక కొత్త మందును తయారు చేస్తారు. ఢిల్లీ అవుట్ స్కర్ట్ లోని 'సీలంపూర్'లో నివాసముండే కొంతమంది పేదవారిపై ఆ మెడిసిన్ ను టెస్ట్ చేస్తారు. అయితే ఆ మందు వికటించి అనేక మంది అనారోగ్యం బారిన పడతారు. ఆ టైమ్ లోనే 'మెడిసిన్ అధారిటి ఆఫ్ ఇండియా' నుంచి డాక్టర్ ప్రకాశ్ (రితేష్ దేశ్ ముఖ్) కి అక్కడికి ట్రాన్సఫర్ అవుతుంది. దాంతో ఆయన గిల్ సంస్థలపై దృష్టిపెడతాడు. అక్కడ నుంచి వార్ మొదలవుతుంది. గిల్ పొలిటికల్ ప్రెజర్స్ నుంచి, అవినీతి అధికారుల ఎత్తుల నుంచి ప్రకాష్ తప్పించుకుని గిల్ సంస్దలను మూయించగలుగుతారా..చివరికి ఏమౌతుంది అనేది అసలు కథ.

ఎలా ఉంది...

ఎంటర్టైన్మెంట్ ని సోషల్ ఎవేర్నెస్ తో కలిపి చెప్పటం అంటే మామూలు విషయం కాదు. అందులో రాజ్ కుమార్ గుప్తా మాస్టర్ చేసారనిపిస్తుంది. ఆయన ఓటిటి డెబ్యూ కూడా అలాంటి సబ్జెక్టునే ఎంచుకున్నారు. కమర్షియల్ మెడిసెన్స్ గురించి, మందులు గురించి ఇంత హార్డ్ హిట్టింగ్ గా ఏ డైరక్టర్ ఇంతకు ముందు తెరకెక్కించలేదేమో. పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు తమకు ఉన్న సోషల్ రెస్పాన్సబులిటీని మరిచిపోయి డబ్బుకు కక్కుర్తిపడి రోగులు జీవితాలతో ఆడుకోవటం మనకు షాక్ ఇస్తుంది. మనం కూడా ఇలాంటి స్కామ్ లో తెలియకుండా ఓ భాగమైపోయామేమో అనిపిస్తుంది.

మెడికల్ డ్రామాలు, కోర్ట్ రూమ్ డ్రామాలు చాలా మంది ఇష్టపడుతూంటారు. వాటికంటూ స్వంత మార్కెట్ ఉంది. అయితే అవి డ్రైగా లేకుండా ఎంటర్టైన్మెంట్ తో కలిపి చెప్పగలగాలి. అదే ఫార్మెట్ లో ఫార్మా రంగంలోని అవినీతి పై దర్శకుడు రాజ్‌కుమార్ గుప్తా ఈ కొత్త వెబ్ సిరీస్, పిల్ ని తీసుకొచ్చారు. రితీష్ దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ కొత్త సీరిస్, మెడికల్ ఇండస్ట్రీ గురించి పెద్ద సంస్థలు తమ పేద కష్టమర్స్ ని దోపిడీ చేసే విధానం గురించి కొన్ని కఠినమైన వాస్తవాలను ఇది బయిటపెట్టే ప్రయత్నం చేసింది. ఈ డైరక్టర్ గతంలో అందించిన రైడ్, నో వన్ కిల్లెడ్ జెస్సికా, ఆమిర్ వంటివి చూసాక పిల్ పెద్ద ఆశ్చర్యం అనిపించదు. ఆయన వాస్తవాలను ఎక్కడా మొహమాటపడకుండా తెరకెక్కిస్తున్నారు.

నకిలీ మందులతో ప్రజలకు డబ్బులు వృథా అవడంతోపాటు నష్టం కలిగించడంతోపాటు ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. కొత్త అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. నకిలీ మందుతో రోగికి తీవ్ర నష్టం కలుగుతుంది. వ్యాధి తగ్గకపోగా ముదురుతుంది. అందులోని రసాయనాల వల్ల తీవ్ర దుష్పలితాలు కలిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఈ సీరిస్ చూస్తుంటే హెచ్చరికగా మనకు అనిపిస్తుంది. మనం కొనే మందులు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలనిపిస్తుంది.

టెక్నికల్ గా

ఈ సీరిస్ ని చాలా సీరియస్ గా సినిమా స్దాయిలో తెరకెక్కించారు దర్సకులు. అందుకు అన్ని క్రాఫ్ట్ లు ఫెరఫెక్ట్ గా వర్క్ చేసాయి. సుదీప్ సేన్ గుప్తా సినీ ఫొటోగ్రఫీ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ ఇలా దేనికి అదే ఒకదానితో మరొకటి పోటీ పడ్డాయి. రాజ్ కుమార్ గుప్తా అందించిన కథకు ప్రవీజ్ షేక్ - జైదీప్ యాదవ్ స్క్రీన్ ప్లే అందించారు. ఆర్టిస్ట్ లు కూడా పాత్రల్లో లీనమై చేసారు. మెడికల్ మాఫియాను అత్యంత సమర్ధవంతంగా బయిటపెట్టారు.

చూడచ్చా

ఖచ్చితంగా ప్రతీ ఒక్కరూ ఫ్యామీలితో కలిసి చూడాల్సిన వెబ్ సీరిస్

మెడికల్ మాఫియా: 'పిల్' (జియో సినిమా) వెబ్ సిరీస్ రివ్యూ!

జియో సినిమాలో తెలుగులో ఉంది.

Tags:    

Similar News