ఎన్టీఆర్ ‘దేవర’డివైడ్ టాక్ కారణం ఏమిటి? ఎక్కడ జరిగింది పొరపాటు

‘దేవర’షోలు పడిపోయాయి. టాక్ బయిటకు వచ్చేసింది. అయితే కొందరు బ్లాక్ బస్టర్ అంటూంటే..మరికొందరు ఓకే ..ఓకే ఫిల్మ్ అంటున్నారు.

Update: 2024-09-27 12:02 GMT

‘దేవర’షోలు పడిపోయాయి. టాక్ బయిటకు వచ్చేసింది. అయితే కొందరు బ్లాక్ బస్టర్ అంటూంటే..మరికొందరు ఓకే ..ఓకే ఫిల్మ్ అంటున్నారు. ఇనానమస్ హిట్ టాక్ వస్తుందనుకుంటే ఇలా డివైడ్ టాక్ మూట కట్టుకోవటం ఆశ్చర్యమే. అయితే ఇలా డివైడ్ టాక్ తెచ్చుకున్న చాలా సినిమాలు తర్వాత కాలంలో పెద్ద బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. పుష్ప కూడా మొదట రోజు జస్ట్ ఓకే సినిమా అన్నారు కానీ తర్వాత ఆ సినిమా గురించి మాట్లాడనివారు, చూడనివారు లేరు. ఈ సినిమాకు కూడా అలా జరగవచ్చు అనేది ప్రక్కన పెడితే అసలు ఈ డివైడ్ టాక్ కు కారణం ఏమిటి..ఏ ఎలిమెంట్స్ సినిమాని దెబ్బ తీసాయి. ఎన్టీఆర్ అద్బుతంగా చేసినా ఎక్కడ ఈ సినిమా డ్రాప్ అయ్యినట్లు అనిపించిందో చూద్దాం.

ఎన్టీఆర్ భుజాలపై పూర్తిగా మోసిన మరో చిత్రం ‘దేవర’ అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ప్యాన్ ఇండియా మార్కెట్ కోసం సముద్రం ని నేపధ్యంలో తీసుకుని, భయం చుట్టూ కథని అల్లారు కొరటాల. అదే ప్లస్ అయ్యింది సినిమాకు. మన తెలుగులో గతంలో ఏ సినిమాలోనూ అంతసేపు సముద్రంలో జరిగే కథ కనపడదు. దాంతో సినిమా ప్రారంభంలో వచ్చే ఎపిసోడ్స్ చూస్తుంటే చాలా కొత్తగా,ప్రెష్ గా అనిపిస్తుంది. విభిన్నమైన సినిమా చూస్తున్న ఫీల్ కలగ చేస్తుంది. అలాగే సముద్రపు దొంగతనాల నుంచి మారిన మనిషిగా దేవర పాత్రలో వచ్చే మార్పు క్యారక్టర్ ఆర్క్ ని జస్టిఫై చేస్తుంది. దాంతో ఆ సీన్స్ అన్నీ బాగా పండి మంచి కిక్ ఇస్తాయి. ఆయుధపూజ సీన్, భయం సాంగ్, ఇంటర్వెల్ ఎపిసోడ్స్ ఎలివేషన్ ఎక్సైట్మెంట్ కు గురి చేస్తాయనటంలో సందేహం లేదు. వీటిన్నటితో ఫస్టాప్ హై ఇచ్చింది.

అయితే సెకండాఫ్ కు వచ్చేసరికి డైరక్టర్ కొరటాల రచయితగా స్ట్రగుల్ అయ్యారనిపిస్తుంది. ఫస్టాఫ్ పేస్ ని సెకండాఫ్ లో రన్ చేయలేకపోయారు. సెకండాఫ్ లో వచ్చే వర (ఎన్టీఆర్) పాత్ర భయంతో వణకటం క్లైమాక్స్ కోసం పనికొచ్చిందేమో కానీ అప్పటిదాకా నడవటానికి సహకరించలేదు. అంతదాకా దేవర పాత్రను ఓ రేంజిలో చూసి వర పాత్రను చూస్తూంటే డల్ గా అనిపిస్తుంది. సెకండాఫ్ లో చాలా ఫిల్ ఇన్ ది బ్లాంక్ సీన్స్ కనిపిస్తాయి. కొంత డ్రాగ్ అయ్యినట్లు అనిపిస్తుంది. సీక్వెల్ కోసం కథను దాచి చెప్పాలని చేసిన ప్రయత్నం ఇది.

ఎందుకిలా

టెర్రపిక్ యాక్షన్ సీక్వెన్స్ ఎన్టీఆర్ కోసం డిజైన్ చేసిన దర్శకుడు కొరటాల శివ దేవర వంటి పవర్ ఫుల్ పాత్రకు సరపడ డ్రామాని క్రియేట్ చేయలేకపోయారు. దేవర పాత్రకు కథలో ఎక్కడా ఎదురనేది కనపడదు. భైర(సైఫ్) ప్రతీ సారి అడ్డుపడుతున్నట్లే కనపడుతున్నా నిజమైన సమస్యను దేవరకు ఎక్కడా క్రియేట్ చేయలేడు. చెయ్యడు. దాంతో దేవర పాత్రలో పూర్తి స్దాయి పొటిన్షియల్ ని బయిటకు లాగటానికి అవకాశం లేకుండా పోయింది. అలాగే దేవర పాత్రను ఇంటర్వెల్ కే మాయం చేయటంతో అప్పటిదాకా యాక్షన్ ఎపిసోడ్స్ తో చెలరేగిన స్క్రీన్ ఒక్కసారిగా చప్పపడిపోయినట్లు అయ్యింది.

సాధారణంగా మన దర్శకులు ఇలాంటి సమస్యను ఎదుర్కోవటానికి ఫస్టాప్ అంతా ఫన్ లేదా రొమాన్స్ అక్కడక్కడా యాక్షన్ ఎపిసోడ్స్ మిక్స్ చేసి, ఇంటర్వెల్ కు ఓ భారీ ఎపిసోడ్ సెట్ చేస్తారు. ఆ తర్వాత సెకండాఫ్ లో సినిమాలో హైలెట్ అనుకున్న యాక్షన్ ఎపిసోడ్స్ అంటే దేవర ఫస్టాఫ్ టైప్ ది దింపుతూంటారు. దాంతో సెకండాఫ్ ని ఆ స్దాయిలో చూసి థియేటర్ లోంచి బయిటకు వచ్చినప్పుడు బాగోలేదు అని చెప్పలేరు. ఆ మెస్మరైజింగ్ లో ఉండిపోతారు. అయితే కొరటాల శివ అలా చేస్తే రెగ్యులర్ రొటీన్ ఫిల్మ్ అయ్యిపోతుందనుకున్నట్లున్నారు. దాంతో ఫస్టాప్ ని ఎడతెగని యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేసి సెకండాఫ్ ని తన చేతులతో తనే స్లో చేసేసుకున్నారు.

ఇక క్లైమాక్స్ ట్విస్ట్ లాంటి ప్రశ్న చూస్తే బాహుబలి గుర్తు చేస్తుంది. ఒకే మ్యాజిక్ రెండు సార్లు జరగదు కదా. దాంతో ఆ ట్విస్ట్ ఓకే ఓకే అనిపిస్తుంది అంతే. అయినా ఎన్టీఆర్ లాంటి హీరోతో ఎక్కడో క్లైమాక్స్ లో విలన్ కు ట్విస్ట్ ఇచ్చాను అని ఓపెన్ చేస్తే ఎలా కుదురుతుంది. అయినా విలన్ పై ఎలా హీరో దాడి చేసాడు,ఇరుకున పెట్టాడు అనేది చూడటానికి కదా మనమంతా ఆసక్తి చూపించేది. అదెలా మర్చిపోయారు కొరటాల.

అయితే ఇవన్నీ కేవలం మాట్లాడుకోవటానికే. ఎన్టీఆర్ మాస్ మానియా, మేకింగ్ వాల్యూస్‌, వ‌ర‌ల్డ్ బిల్డింగ్, అనిరుథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్ళాయి. వాటిని చూడటానికి అయినా సినిమా చూడవచ్చు. ‘చుట్ట‌మ‌ల్లే’ పాట‌, ఆ పాట‌లో జాన్వీ గ్లామ‌ర్ సెకండాఫ్ మనకు వచ్చే ఇబ్బందిని,బోర్ ని చాలా వరకు కాంపన్సేట్ చేస్తుంది. రిలీజ్ కు ముందు ఎక్సపెక్టేషన్స్ పెంచేసిన దావూదీ పాట అస‌లు ఈ సినిమాలో పెట్టనే లేదు. షూట్ చేసి కూడా వదిలేసారు. అదో పెద్ద నిరాశ. సెకండాఫ్ లో కొంత ల్యాగ్ అనిపించిన ఎలిమెంట్స్ తీసేసి ఆ పాటను ఎక్కడో చోట సెట్ చేస్తే సినిమా కు ఖచ్చితంగా ప్లస్ అయ్యేది.

Tags:    

Similar News