ఎన్టీఆర్ లకీనెంబర్ , కారు నెంబర్ నుంచి 'దేవర' రిలీజ్ డేట్ దాకా

సినిమా కథలనే కాదు సినిమా ఫీల్డ్ ని సైతం సెంటిమెంటే ఆడిస్తుంది. కోట్లు రొటీషన్ తిరిగే చోట అదే స్దాయిలో రిస్క్ ఉంటుంది.

Update: 2024-08-29 02:30 GMT

సినిమా కథలనే కాదు సినిమా ఫీల్డ్ ని సైతం సెంటిమెంటే ఆడిస్తుంది. కోట్లు రొటీషన్ తిరిగే చోట అదే స్దాయిలో రిస్క్ ఉంటుంది. అందుకే ప్రతి చిన్న విషయానికి నక్షిత్రాలు, జాతకాలు, మంచి రోజులు, సెంటిమెంట్స్ అంటూ చూసుకుంటారు. అంతెందుకు సినిమాకు డైరక్టర్ ని ఓకే చేసేటప్పుడు కూడా చాలా మంది నిర్మాతలు ఆ దర్శకుడు, రచయిత ల జాతకాలు తెప్పించుకుని చూసి వారి గ్రహాలు ఉఛ్చ స్దితిలో ఉంటేనే వారితో ముందుకు వెళ్తారు. దీన్ని తప్పుపట్టరు. పట్టినా నష్టపోయేది నిర్మాత మాత్రం కాదు. కొందరు నిర్మాతలు అయితే సినిమా ప్రారంభమే కాకుండా రిలీజ్ కూడా ఎన్ని గంటలకు మొదటి షో పడాలనేది సైతం ముహూర్తం చూసుకుని ముందుకు వెళ్తారు.

ఇక నిర్మాత, దర్శకులకు మాత్రమే కాకుండా హీరోలకు కూడా రకరకాల సెంటిమెంట్స్ ఉంటాయి. ఇప్పటికీ స్టార్ డైరక్టర్ త్రివిక్రమ్ తను మొదట అద్దెకు ఉన్న రూమ్ కు వెళ్లి వస్తాడంటారు. అలాగే తాము కొన్న మొదటి కారుని అలాగే దాచుకుంటారు. బాలయ్య వంటి హీరోలు మంచి ఘడియ లేకపోతే బయిటకు అడుగు పెట్టరు అని చెప్తారు. అలాగే మరికొందరు హీరోలు షూటింగ్ కు వెళ్లినప్పుడు కారు లోంచి దిగటానికి ఎదురుగా ఉన్నారు అనేది చూసుకుని లొకేషన్ క్లియర్ చేసుకునే ముందుకు వెళ్తారు.

కొందరు హీరోలు తమ పేరు కలిసి రాలేదని మార్చుకుంటున్నారు కూడా. అలాగే న్యూమరాలిజీ ప్రకారం తమ పేరులో అక్షరాలు కలుపుకునే హీరోలు,హీరోయిన్స్ మనకు కనపడుతూనే ఉంటారు. ఎదుటివారిని ఇబ్బంది పెట్టనంతవరకూ ఎవరి సెంటిమెంట్స్ అయినా ఓకే ..మంచింది అన్నట్లు గౌరవిస్తూంటుంది ఇండస్ట్రీ. ఇక ఎన్టీఆర్ సెంటిమెంట్ విషయానికి ఆయనకు 9 సెంటిమెంట్ అంటారు.

ఇక జూ.ఎన్టీఆర్ దగ్గర ఉన్న కార్లన్నిటికీ 9999 నెంబరే ఉంటుంది. దానికి కారణం తన సెంటిమెంట్ కన్నా 9 అనే అంకె అంటే ఇష్టమని చెప్తారు. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే కారు నంబర్‌తో పాటు ఎన్టీఆర్ ట్విటర్‌ ఖాతా కూడా @tarak9999 అని ఉంటుంది. అయితే ఇప్పుడు తొమ్మిది సెంటిమెంట్ అనే విషయం గురించి మరోసారి ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే ...ఎన్టీఆర్ తన తాజా చిత్రం దేవరకు సైతం 9 సెంటిమెంట్ నే ఫాలో అవుతున్నారు. సెప్టెంబర్ 27 న దేవర సినిమా రిలీజ్ అవుతోంది. సెప్టెంబర్ నెల తొమ్మిదో నెల. అలాగే రిలీజ్ డేట్ అయిన 27 లో రెండు అంకెలు కలిస్తే 2+7 = 9 వస్తుంది.

అక్కడితో ఆగకుండా తెలుగు రాష్ట్రాల్లో షోలు అర్దరాత్రి దాటాక 1:08 నిముషాలకు మొదలయ్యేలా ప్లాన్ చేసారు. ఇక్కడ కూడా 1:08 కలిస్తే “9” వస్తుంది. అలా ఎలా చూసినా “9” వచ్చేలా రిలీజ్ డేట్ ప్లాన్ చేసాడంటున్నారు. అలా ఎన్టీఆర్ చెప్పారనో లేక దానంతట అది సెట్ అయ్యిందో కానీ “9” అనేది ఈ రిలీజ్ డేట్ కు సెంటిమెంట్ గా వర్కవుట్ అయ్యేలా కనపడుతోంది.

ఇక గతంలో పెద్ద ఎన్టీఆర్..నందమూరి తారకరామారావు కు సైతం తొమ్మిది సంఖ్య బాగా కలిసి వచ్చిందిట. ఇదే ఈ మనవడు ఫాలో అవుతున్నాడంటారు. అలాగే తన తాతయ్య స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కారు నెంబర్ 9999 అనీ.. ఆ తర్వాత తన తండ్రి స్వర్గీయ హరికృష్ట కూడా అదే నంబర్‌ను వాడారని అందుకే తనకు ఆ నంబర్‌ అంటే ఇష్టమని ఆ మధ్య ఓ సందర‍్బంలో ఎన్టీఆర్‌ చెప్పాడు.

అందువల్ల మరో ఆలోచన లేకుండా తన ప్రతి కారుకు అదే నంబర్‌ కంటిన్యూ అవుతుందని చెప్పుకొచ్చాడు తారక్‌.తను ఏ కారు తీసుకొచ్చినా కూడా 9999 మాత్రమే ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. అంతే కాని అది సెంటిమెంట్ కాదని ఎన్టీఆర్‌ స్పష్టం చేశాడు. ఏదైతేనేం “9” అనేది ఎన్టీఆర్ కు సెంటిమెంట్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. అదీ సంగతి.

Tags:    

Similar News