'వీరమల్లు' విడుదలకు అడ్డం పడుతోంది ఎవరు?

పవన్ కల్యాణ్ కూడా ఏమీ చెయ్యలేరా?;

Update: 2025-06-05 06:19 GMT

“When you have a star like Pawan Kalyan, delay is tolerated — but only until excitement turns into exhaustion.”

ఇది ట్రేడ్ చెప్తున్న మాట. ఎంత పవర్ స్టార్ సినిమా అయినా వరసగా విడుదల వాయిదాలు వేసుకుంటూ పోతూ, రిలీజ్ అయ్యే సమయానికి ఉత్సాహం,ఊపు తగ్గిపోతుందనేది దీని అర్దం.

కేవలం నిర్మాతకే కాదు ఇది పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పరీక్షా సమయం. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అభిమానులకు ‘హరి హర వీరమల్లు’ మరోసారి వాయిదా పడిందనట్లే అని వార్తలు రావటం బాధ కలిగిస్తోంది. జూన్ 12న రిలీజ్ కావాల్సిన ఈ బిగ్ బడ్జెట్ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ రిలీజ్ కు ఇంకా సమయం సెట్ కాలేదు. ఈ వాయిదా విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది గానీ…ఈలోగా అంతటా ఈ వార్త వైరల్ గా మారింది. అయితే వాయిదాకు కారణం?

వీఎఫ్ఎక్స్ సమస్య!

ఈ సినిమా లాస్ట్ మినిట్ వాయిదాకు అసలైన కారణం — వీఎఫ్ఎక్స్ పనులు ఇంకా పూర్తి కాకపోవటమే అంటున్నారు. ఈ స్థాయి సినిమాకి ట్రైలర్ కట్ చేయాలంటే భారీ వీఎఫ్ఎక్స్ అవసరం. కానీ ఇంకా ఫైనల్ ఫుటేజ్ ప్రొడక్షన్ టీమ్ కు అందలేదు. టెక్నికల్ టీమ్స్ హడావుడిగా రాత్రింబవళ్లూ పని చేస్తున్నా, ట్రైలర్ కట్ చేయడం ఇంకా మిగిలి ఉంది. పైగా ఇంకా ప్రమోషన్లు మొదలవ్వ లేదు. ఇవన్నీ బేరీజు వేసుకుంటే జూన్ 12న రిలీజ్ చేసేవిధంగా పరిస్థితి అయితే లేదు.

పెద్ద స్టార్స్ రిలీజ్ లు పెద్దగానే ఉండాలి. ఆ పెద్ద రిలీజ్ లకు పెద్ద ప్లానింగ్ అవసరం. అయితే చివరి క్షణాల్లో వచ్చే సమస్యలు సినిమా అవుట్ ఫుట్ పై నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తాయి.

ఓవర్సీస్ మార్కెట్‌లో ముందే అలర్ట్!

ఈ సినిమాకు ఓవర్సీస్ మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే అక్కడి డిస్ట్రిబ్యూటర్లకు ప్రాజెక్ట్ వాయిదా పడిందని చెప్పారని సమాచారం. నిర్మాత ఏఎం రత్నం ఈ విషయాన్ని ముందుగానే తెలియజేశారని తెలిసింది. అంతకంటే ముఖ్యంగా… "ఈసారి రిలీజ్ డేట్ ఖరారైతే – ఇక వాయిదా అనే ఉండకూడదు" అనే ఒత్తిడి పెరిగిపోతోంది.

మైత్రీ – సితార ద్వారా విడుదల? !

ట్రేడ్ నుంచి వినిపిస్తున్న మాటల ప్రకారం, పవన్ కల్యాణ్ నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్, ఆంధ్రాలో సితార ఎంటర్టైన్మెంట్స్ ద్వారా సినిమా విడుదల చేయాలని సూచించారట. పవన్ కోసం అయితే వారు ముందుకు రావొచ్చు గానీ… ఇది వాస్తవికంగా సాధ్యమయ్యే విషయం కాదని ట్రేడ్ ఎనాలసిస్ట్ ల అభిప్రాయం.

మైత్రీ – సితార రిలీజ్ కు ముందుకు రావొచ్చు. కానీ కమిట్మెంట్ పెట్టుకునే అవకాసం ఉండదు. వారు కేవలం మధ్యవర్తులగా సాయం చేసేందుకు మాత్రమే ముందుకు వస్తారు. థియేటర్ వాళ్లు ఇచ్చిన అడ్వాన్స్ లు నిర్మాతకు ట్రాన్ఫర్ చేయటం, మినిమం కమీషన్ మాత్రమే తీసుకోవటం వంటివి చేయగలరు. అయితే నిర్మాత రత్నంకు సరపడ అడ్వాన్స్ లు థియేటర్స్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాయా, లేక వారు ఇచ్చే అడ్వాన్స్ లను రత్నం సరిపెట్టుకుంటారా లేదా అనేదే పెద్ద ప్రశ్న.

ట్రేడ్ లో చెప్పుకునేదాని ప్రకారం ఈ సినిమా ఇప్పటివరకు దాదాపు ₹60 కోట్ల వరకు ఫైనాన్స్ బకాయి ఉంది. అది థియేటర్స్ వారు ఇచ్చే అడ్వాన్స్ లతో రికవరీ అవుతుందా ?. అదే సమయంలో నిర్మాత ఏఎం రత్నం NRA (Non-Recoverable Advance) డీల్ ఎదురుచూస్తున్నారు. కానీ అది ఇప్పుడు మార్కెట్ స్థితిలో సాధ్యం కాదు.

Non-Recoverable Advances కోసం చూస్తే – డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఏఎం రత్నం రెగ్యులర్ ప్రొడ్యూసర్ కాదు. ప్రాజెక్ట్ కాస్త అటూ ఇటూ అయినా, భవిష్యత్తులో నెక్ట్స్ సినిమా ఉందో లేదో అనే గ్యారెంటీ లేదు. ఇది చాలా రిస్క్.

పవన్ కళ్యాణ్ — ఒక బాక్స్ ఆఫీస్ బ్రాండ్

పవన్ కళ్యాణ్ సినిమాలంటే తెలుగులోనే కాదు… యుఎస్ మార్కెట్ నుంచీ, మలేషియా వరకూ సహనంగా ఎదురు చూస్తున్న అభిమానులే కాదు, డిస్ట్రిబ్యూషన్ సంస్థలు సైతం ప్లానింగ్ వేసుకుంటాయి.

ఇటీవల “OG”, “బ్రో” సినిమాల ప్రీ-రిలీజ్ బిజినెస్ చూస్తే అర్థమవుతుంది — పవన్ ఫిల్మ్ అంటే ఖచ్చితంగా ROI (Return on Investment) సేఫ్ బెట్. అటువంటి స్టార్ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడంలో జాప్యం అంటే… ఇంకో సినిమాకు ‘స్లాట్’ ఇవ్వడమే కాదు, ఇండస్ట్రీ మొత్తం షెడ్యూల్ గందరగోళంలో పడుతుంది.

రిలీజ్ డేట్స్ మధ్య పోటీ — గందరగోళం ప్రారంభం!

జూన్ 27: ‘వీరమల్లు’కు మంచి ఆప్షన్. కానీ అక్కడ ‘కన్నప్ప’ ఉంది. మంచు విష్ణుతో సంప్రదింపులు జరిగినట్టు సమాచారం. కానీ విష్ణు అడ్జెస్ట్ అవ్వలేదని చెప్పుకుంటున్నారు.

జూలై 4: విజయేదేవరకొండ ‘కింగ్‌డమ్’ సినిమా విడుదల. ఇది సితార ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్. పవన్ కళ్యాణ్‌తో ముడిపడి ఉన్న బ్యానర్ కాబట్టి — నాగవంశీ పవన్ కోసం మినహాయింపు ఇచ్చి వాయిదా వేసి దారి ఇస్తారా? వేచి చూడాలి.

జూలై 11: అక్కడ ఆల్రెడీ క్రిష్ డైరక్షన్ లో రాబోతున్న ‘ఘాటీ’ ఫిక్స్ అయింది. ఎన్నో వాయిదాల తర్వాత డేట్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఆ సినిమాని టచ్ చేయడం కూడా కష్టమే. అందులోనూ క్రిష్ ఈ సినిమాకు మొదట మొదలెట్టి , బయిటకు వెళ్లిపోయిన డైరక్టర్. కాబట్టి కాస్త జాగ్రత్తగానే డీల్ చేయాలి.

వీరమల్లుకు క్రేజ్ ఎందుకంటే...

ఈ సినిమా పవన్ కళ్యాణ్ నటిస్తున్న మొదటి పీరియాడిక్ ఫిక్షన్. మొఘలుల కాలంలో హీరో పాత్ర, భారీ సెట్స్, వెస్ట్రన్ బ్లాక్‌బస్టర్‌ల స్థాయి విజువల్స్‌తో తెరకెక్కుతోంది. తెలుగు సినిమాల్లో బాహుబలి తరహా ప్రాజెక్టుగా ‘వీరమల్లు’ మీద అంచనాలు ఉన్నాయి.

Tags:    

Similar News