‘కాంతారా’ టీమ్ వార్నింగ్ ట్వీట్, వెంటనే ఎందుకు డిలీట్ చేసింది?
హోంబలే ఫిలిమ్స్ సీరియస్ హెచ్చరిక!
హోంబలే ఫిలిమ్స్ — ప్రస్తుతం దేశంలోనే హాట్ అండ్ సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటి. వారి భారీ స్థాయి ఫిల్మ్‌మేకింగ్, వరుస విజయాలు, సంపాదించిన గుడ్‌విల్ తో దశాబ్దాల నాటి స్టూడియోలకే ఈర్ష్య పుట్టిస్తోంది. తాజాగా వారి కొత్త చిత్రం “కాంతారా చాప్టర్ 1” గురించి ఒక వార్నింగ్ ట్వీట్ పోస్టు చేశారు. అయితే, కొద్ది సేపటికే ఆ ప్రెస్ స్టేట్‌మెంట్‌ను డిలీట్ చేశారు. వారు పోస్టు చేసిన కంటెంట్ ఇలా ఉంది —
హోంబలే ఫిలిమ్స్ అధికారిక ప్రకటన (డిలీట్ చేయబడింది)
సినీ ప్రేమికులకు,
“దైవారాధన” (Spirit Worship) అనేది తుళ ప్రాంతపు విశ్వాసానికి ప్రతీక. అది తుళు ప్రజల గౌరవం, ఆత్మగౌరవం. మా సినిమా ‘కాంతారా’ మరియు ‘కాంతారా చాప్టర్–1’ లో ఆ ఆధ్యాత్మికతను ప్రతిబింబించే కథను చూపించాం. ఈ చిత్రాల ద్వారా దైవాల (Daivas) మహిమను, తుళు నేల వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం మా లక్ష్యం.
అయితే, ఇటీవలి కాలంలో కొంతమంది సినిమా పాత్రల వేషధారణలో దైవాల అనుకరణ చేస్తూ అనుచిత ప్రవర్తన ప్రదర్శిస్తున్నారని మా బృందం గమనించింది. ఇది మా విశ్వాసానికి అవమానం, అమానుషమైన నేరం.
మేము అలాంటి ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించము. అందువల్ల, థియేటర్లలో గానీ, ప్రజా స్థలాల్లో గానీ దైవాల అనుకరణ చేసే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటున్నాము.
సారాంశంగా: హోంబలే ఫిలిమ్స్ స్పష్టంగా హెచ్చరించింది —
“దైవారాధనను సినిమా కేరెక్టర్‌లుగా తీసుకుని ఎవరూ వ్యంగ్యంగా, అశ్రద్ధగా ప్రదర్శించకూడదు. అది మా విశ్వాసాన్ని దెబ్బతీసే నేరం.”
ఇది కాంతారా చాప్టర్ 1 రిలీజ్ సందర్భంగా వచ్చిన సున్నితమైన హెచ్చరికగా సినీ వర్గాలు చూస్తున్నాయి.
వార్నింగ్ ట్వీట్ ఎందుకు డిలీట్ చేశారు అనేది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియలేదు.
అయితే ఈ ట్వీట్ కు కారణం ఏమిటనేది తెలియకపోయినా..రీసెంట్ గా తమిళనాడులో జరిగిన ఓ సంఘటన కారణం కావచ్చుఅంటున్నారు. తమిళనాడులోని దిండిగల్ లో ఉన్న ఒక థియేటర్లో ఆసక్తికర ఘటన జరిగింది. కాంతార చాప్టర్ 1 సినిమా ప్రదర్శన జరుగుతుండగా, పంజుర్లి దేవుడి వేషధారణలో ఓ వ్యక్తి థియేటర్‌లోకి వచ్చి రిషబ్ శెట్టి నృత్యాన్ని అచ్చంగా అనుకరించడంతో ప్రేక్షకులు షాక్‌కి గురయ్యారు.
అతని పర్‌ఫార్మెన్స్ చూస్తే నిజంగా పంజుర్లి దేవుడు ఆవహించినట్టు ఫీలయ్యామని పలువురు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. అతని డాన్స్ వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. థియేటర్లో కూర్చున్న వారంతా ఆ దృశ్యాన్ని లైవ్ లో చూడటం వల్ల గూస్ బంప్స్ వచ్చాయంటూ స్పందిస్తున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘కాంతార చాప్టర్ 1’ చిత్రం ప్రభంజనాలు సృష్టిస్తుంది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్ ఇండియా మూవీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. గతంలో వచ్చిన ‘కాంతార’ మూవీ ఘనవిజయం సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే అక్టోబర్ 2న విడుదలైన ఈ ప్రీక్వెల్ సినిమా అంచనాల కంటే ఎక్కువ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది.
ఇక ఈ చిత్రం రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం రూ.224 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం పట్ల సినీ పరిశ్రమ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. దసరా సెలవులు, వీకెండ్ హెల్ప్ కావడంతో సినిమాకు అనూహ్యమైన రెస్పాన్స్ లభించింది. దేశవ్యాప్తంగా హౌస్‌ఫుల్ షోలు, టికెట్లకు డిమాండ్, థియేటర్లలో జనం హంగామా అన్నీ ఈ విజయానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ చిత్రం, హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. రిషబ్ శెట్టి దర్శకత్వంతో పాటు హీరోగా నటించగా, రుక్మిణి వసంత్ హీరోయిన్ గా, జయరాం, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాతో రిషబ్ శెట్టి క్రేజ్ మరింత పెరిగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.