'దేవర' తో ఎన్టీఆర్ బ్యాడ్ సెంటిమెంట్ నుంచి బయటపడతారా?

దేవర మన ముందుకు వచ్చింది. ఎన్టీఆర్ ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే అదే సమయంలో ఓ చిన్న సెంటిమెంట్ అభిమానులను ఓ మూల ఎక్కడో భయానికి గురి చేస్తోంది.

Update: 2024-09-27 04:22 GMT

ఆచార్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. స్టేజిపై ఆయన్ను ఘనంగా సన్మానించిన చిరంజీవి... ఆ తర్వాత రాజమౌళి గురించి మాట్లాడారు. RRR లాంటి గొప్ప సినిమాలో రామ్ చరణ్ ను ఓ భాగం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పిన చిరంజీవి అందుకు ప్రతిఫలంగా రాజమౌళి చుట్టూ ఉన్న ఓ మిత్ ను బ్రేక్ చేస్తామంటూ ప్రకటించారు. ఆ మిత్ మరేదో కాదు రాజమౌళితో సినిమా తీస్తే నెక్ట్స్ సినిమాలో ఆ హీరోకి ఫ్లాప్ తప్పదని. అలా అప్పట్లో ముందు చిరంజీవే ఈ టాపిక్ ను పాయింట్ అవుట్ చేసి మాట్లాడిన తర్వాత... విడుదలైన 'ఆచార్య' డిజాస్టర్ టాక్ తెచ్చుకుని షాక్ ఇచ్చింది. నిజంగానే ఆ మిత్ లేదా సెంటిమెంట్ వెంటాడుతుందేమో అనిపించింది.


 దేవర మన ముందుకు వచ్చింది. ఎన్టీఆర్ ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే అదే సమయంలో ఓ చిన్న సెంటిమెంట్ అభిమానులను ఓ మూల ఎక్కడో భయానికి గురి చేస్తోంది. అదే రాజమౌళి సెంటిమెంట్.

సినిమా పరిశ్రమలో సెంటిమెంట్స్ ఎక్కువ. కోట్లతో వ్యవహారం కాబట్టి ప్రతీది బూతద్దంలో చూస్తారు. ఎక్కువ నమ్మకాలు, సెంటిమెంట్స్ తో నడుస్తూంటారు. అలాగే ఏదైనా విషయాన్ని సెంటిమెంట్ గా ఫీల్ అవ్వడం మొదలు పెడితే ఆ తర్వాత ప్రతి ఒక్కరూ దాన్ని నమ్ముతూనే ఉంటారు. మీడియా కూడా దానికి సపోర్ట్ చేస్తూంటుంది. అలాంటి సెంటిమెంట్స్ లో ఒకటి.. ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ నమ్మేది, రాజమౌళితో సినిమా చేసిన హీరోకి ఆ తర్వాత ఫ్లాప్ గ్యారెంటీ అని.

అవును...ఒక్కసారి రాజమౌళితో సినిమా చేస్తే, ఆ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ దర్శకుడితో చేసినా, ఎంత భారి బడ్జెట్ తో చేసినా అది ఫ్లాప్ అయ్యి తీరుతుందనేది నమ్ముతూంటారు. అయితే దీని కాదంటానికి లేకుండా రుజువులు కూడా ఉన్నాయి. రాజమౌళి మొదటి సినిమా ఎన్టీఆర్ సెకండ్ సినిమాగా రిలీజ్ అయిన ‘స్టూడెంట్ నంబర్ 1’ . ఆ తర్వాత వచ్చిన ‘సుబ్బు’ సినిమా డిజాస్టర్ అయ్యింది.

అలాగే ఎన్టీఆర్-రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన సెకండ్ సినిమా ‘సింహాద్రి’ తర్వాత రిలీజ్ అయిన ఆంధ్రావాలా సినిమా ఏ రేంజి డిజాస్టరో ప్రత్యేకంగా గుర్తు చేయనక్కర్లేదు. అలాగే ఈ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ‘యమదొంగ’సూపర్ హిట్. కానీ ఆ తర్వాత వచ్చిన కంత్రి సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇలా రాజమౌళితో ఎక్కువ సినిమాలు చేసి హిట్ కొట్టిన ఎన్టీఆర్, ఆ తర్వాత ఎక్కువ ఫ్లాప్స్ ని కూడా ఫేస్ చేశాడు. కేవలం ఎన్టీఆర్ కే ఇలా జరిగిందా అంటే దాదాపు అందరి హీరోల పరిస్దితి అదే.

ప్రభాస్ కూడా ఈ సెంటిమెంట్ నుంచి తప్పించుకోలేకపోయారు. రాజమౌళి, ప్రబాస్ కాంబినేషన్ లో ఛత్రపతి వంటి సూపర్ హిట్ వచ్చింది. ఆ వెంటనే ప్రభాస్ చేసిన పౌర్ణమి చిత్రం డిజాస్టర్ అయ్యింది. అలాగే బాహుబలి వంటి సూపర్ హిట్ తర్వాత ప్రబాస్ చేసిన సాహో పెద్దగా ఆడలేదు.

ఇక మాస్ మహారాజ్ రవితేజ విషయానికి వస్తే...రాజమౌళి, రవితేజ కాంబినేషన్ లో విక్రమార్కుడు చిత్రం వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ వెంటనే ఖతర్నాక్ వంటి డిజాస్టర్ ఇచ్చారు. మళ్లీ వీళ్లిద్దరి కాంబో రిపీట్ కాలేదు.

అలాగే నితిన్ తో రాజమౌళి సై వంటి సూపర్ హిట్ ఇచ్చారు. ఆ సినిమా తర్వాత నితిన్ చేసిన అల్లరి బుల్లోడు చిత్రం డిజాస్టర్ అయ్యింది.

నానీ, రాజమౌళి కాంబినేషన్ లో ఈగ వంటి సూపర్ హిట్ వచ్చింది. నాని కెరీర్ లో టాప్ ఫిల్మ్ గా నిలిచింది. వెంటనే నాని చేసిన ఎటో వెళ్లిపోయింది మనస్సు చిత్రం డిజాస్టర్ అయ్యింది.

సునీత్ రాజమౌళి చేసిన మర్యాద రామన్న చిత్రం ఓ ట్రెండ్ సెట్టర్. సునీల్ కు వరస సినిమాలు తెచ్చిపెట్టింది. అయితే ఆ సినిమా తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో చేసిన కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు మాత్రం డిజాస్టర్ అయ్యింది.

రామ్ చరణ్ సంగతి తీసుకున్నా అదే సెంటిమెంట్ రిపీట్ అయ్యింది. రాజమౌళితో చేసిన 'మగధీర' భారీ బ్లాక్ బస్టర్ . ఆ తర్వాత రామ్ చరణ్ చేసిన 'ఆరెంజ్' డిజాస్టర్ . ఆ సినిమా నిర్మాత నాగబాబు లైఫ్ నే మార్చేసిన సినిమా అది. ఆ సినిమా మిగిల్చిన నష్టాల నుంచి కోలుకోవటానికి ఆయనకు చాలా సమయమే పట్టింది. ఆ తర్వాత రాజమౌళి, రామ్ చరణ్ తో RRRవచ్చింది. అది బ్లాక్ బస్టర్. వెంటనే రామ్ చరణ్ చేసిన 'ఆచార్య' డిజాస్టర్ అయ్యింది. RRR గ్రాండ్ విక్టరీ తర్వాత రామ్ చరణ్ కు డిజాస్టర్ పడి... రాజమౌళి సెంటిమెంట్ మరోసారి రుజువైందని చాలా మంది ఫ్యాన్స్ నమ్మే సిట్యువేషన్ వచ్చింది.

అయితే ఈసారి మాత్రం అలా కాదు, దేవర విషయంలో హిట్ టార్గెట్ మిస్ అవ్వదని అందరూ నమ్మకంగా ఉన్నారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత కొరటాల శివతో కలిసి పాన్ ఇండియా స్థాయిలో ‘దేవర’ సినిమా చేసాడు ఎన్టీఆర్. సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటిదాకా విడుదలైన ప్రమోషన్ మెటీరియల్ తో అంచనాలు నెక్ట్స్ లెవిల్ లో ఉన్నాయి. ఇన్నేళ్లుగా ఉన్న రాజమౌళి సెంటిమెంట్ ని ఈ సారి మేము బ్రేక్ చేస్తాం అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ స్ట్రాంగ్ గా చెప్తున్నారు. మరి నందమూరి అభిమానుల నమ్మకాన్ని నిజం చేస్తూ రాజమౌళి సెంటిమెంట్ కి భారీగా బలైన కొరటాల శివని, ఎన్టీఆర్ అయినా కాపాడుతాడేమో చూడాలి.


Tags:    

Similar News