జిమ్మి కార్టర్ గురించి అబ్బురపరిచే 20 విశేషాలు..

జార్జియాలో తుదిశ్వాస విడిచిన మాజీ అధ్యక్షుడు;

Update: 2024-12-30 06:26 GMT

అమెరికా మాజీ ప్రెసిడెంట్ జిమ్మికార్టర్ ఆదివారం మృతి చెందారు. ఆయన వయస్సు వంద సంవత్సరాలు. గత 22 నెలలుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన జార్జియాలోని ప్లెయిన్ లో గల ‘కార్టర్ సెంటర్’ లో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ఎక్స్ లో తెలిపారు.

"మాజీ US అధ్యక్షుడు జిమ్మీ కార్టర్, జార్జియాలోని ప్లెయిన్స్‌లో ఈ మధ్యాహ్నం కన్నుమూశారు," అని కార్టర్ సెంటర్ ఎక్స్ లో పేర్కొంది. కుటుంబ సభ్యులు చుట్టూ ఉండగా ప్రశాంత పరిస్థితుల్లో ఆయన తుదిశ్వాసవిడిచిపెట్టారని ట్వీట్ లో పేర్కొంది.
జిమ్మికార్టర్ గురించి 20 విశేషాలు..
1. జిమ్మికార్టర్ పేరు మీద ఓ ఊరు ఉంది. ఆ ఊరు ఎక్కడో అమెరికాలో, యూరప్ లో కాదు.. భారత్ లో ఉంది. హర్యానాలోని ఓ గ్రామానికి కార్టర్ పురి అని ఆయన గౌరవార్థం పేరు పెట్టారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఎత్తివేసిన తరువాత భారత పర్యటనకు వచ్చిన అమెరికన్ అధ్యక్షుడు ఆయనే.
2. అత్యధిక సంవత్సరాలు జీవించిన అమెరికన్ ప్రెసిడెంట్ కార్టరే. ఆయన సరిగ్గా 100 సంవత్సరాలు జీవించారు.
3. వాటర్ గేట్ కుంభకోణం, వియత్నాం యుద్ధంలో అమెరికా ఘోర ఓటమి తరువాత అనూహ్యంగా అధ్యక్ష రేసులోకి దూసుకొచ్చి పగ్గాలు చేపట్టారు.
4. కార్టర్ కు నలుగురు పిల్లలు. మొత్తం మీద ఆయనకు 11 మంది మనుమలు, 14 మంది మనవరాళ్లు ఉన్నారు.
5. నేను అమెరికన్ ప్రజలకు అబద్దం చెప్పను. చెబితే నాకు ఓటు వేయద్దు అని ప్రకటించిన మొదటి నాయకుడు కార్టర్
6. పశ్చిమాసియాలో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి కార్టర్ ఏకంగా 13 రోజుల పాటు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి మెనాచెమ్ బిగిన్ లు, ఈజిప్టు అధ్యక్షుడు అన్వర్ సాదత్ తో చర్చలు జరిపారు.
7. కార్టర్ పరిపాలన కాలంలో అమెరికా అనేక సంక్షోభాలతో కొట్టుమిట్టాడింది. ప్రచ్ఛన్న యుద్ధం, ఆయిల్ సంక్షోభం, రేసిజం, మహిళల హక్కుల వంటి ఉద్యమాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇరాన్ రెవల్యూషన్ తో అక్కడ ఎనిమిది మంది అమెరికన్ పౌరులు చిక్కుకుపోయారు. వారి కోసం 444 రోజులు చర్చలు జరిపిన సఫలం కాలేదు. చివరకు రెస్య్కూ ప్రయత్నంలో వారు మరణించారు.
8. భారత్ తో వ్యక్తిగత సంబంధాలు ఉన్న అమెరికా అధ్యక్షుడు జిమ్మి కార్టర్. 1960 లో ఆయన తల్లి లిలియన్ హర్యానాలోని దౌలత్ పూర్ లోని ఓ పీస్ కార్ప్స్ లో ఆరోగ్య వాలంటీర్ గా పనిచేశారు.
9. కార్టర్ కు నోబెల్ శాంతి బహుమతిని 2002 లో ప్రకటించారు. ఆ రోజు కార్టర్ పురిలో సంబరాలు మిన్నంటాయి. కార్టర్ సందర్శించిన జనవరి 3 న అక్కడ సెలవుదినంగా పాటిస్తారు.
10. 1971 లో భారత్ - పాకిస్తాన్ యుద్ధం లో అప్పటి అధ్యక్షుడు నిక్సన్ పాక్ వైపు మొగ్గడంతో ఇరు దేశాల మధ్య అగాధం ఏర్పడింది. అయితే కార్టర్ వచ్చి ఆ సంబంధాలను సరిచేశారు.
11. కార్టర్ కోవిడ్ సంక్షోభం తలెత్తే వరకూ జార్జియాలోని ఓ స్కూలులో నిత్యం క్రైస్తవ పాఠాలు బోధించేవారు.
12. కార్టర్ కొన్ని సంవత్సరాల క్రితం క్యాన్సర్ బారిన పడ్డారు. చివరకు కోలుకుని తన జీవితాన్ని కొనసాగించారు.
13. ఆయన రోనాల్డ్ రీగన్ చేతిలో ఓటమిపాలయిన తరవాత రాజకీయాలను స్వస్తి చెప్పారు.
14. 1982 లో కార్టర్ సెంటర్ ను స్థాపించి ప్రపంచ శాంతికి కృషి చేశారు.
15. ఈ సెంటర్ సాయంతో అమెరికా పొరుగుదేశమైన హైతీపై దాడి చేయకుండా చర్చలు సఫలం అయ్యేలా కృషి చేశారు.
16. తనకు తానుగా ఇంటర్నేషనల్ పీస్ మేకర్, ప్రజాస్వామ్య ఛాంపియన్ గా ప్రకటించుకున్నారు. దాదాపు 20 సంవత్సరాలుగా ఈ సేవలు చేశాక 2002 లో నోబెల్ బహుమతిని గెల్చుకున్నారు.
17.కార్టర్ భార్య కూడా 96 ఏళ్ల వయస్సులో రెండు సంవత్సరాల క్రితం మరణించారు. అత్యంత ఎక్కువ కాలం జీవించిన ఫస్ట్ లేడీ గా ఆమెదే రికార్డు.
18. అమెరికా అధ్యక్షుడిగా కాకముందు ఆయన జార్జియా గవర్నర్ గా పనిచేశారు.
19. 1977-81 మధ్య అమెరికాకు 39 అధ్యక్షుడిగా సేవలందించారు.
20. అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ తో సన్నిహిత సంబంధాలు నెరిపిన వ్యక్తి కార్టర్. భారత్ ను సందర్శించిన మూడో అమెరికన్ ప్రెసిడెంట్.
Tags:    

Similar News