కెనడా ఎప్పటికీ అమెరికాలో భాగం కాదు: నూతన ప్రధాని మార్క్ కార్నీ

అన్యాయమైన యుద్ధంలో తామే విజయం సాధిస్తామని ధీమా;

Update: 2025-03-10 10:43 GMT

కెనడా ఎప్పటికీ అమెరికాలో భాగంకాదని కెనడా నూతన ప్రధానమంత్రి మార్క్ కార్నీ స్పష్టం చేశారు. కెనడా ప్రధానమంత్రిగా జస్టిన్ ట్రూడో స్థానంలో లిబరల్ పార్టీ ఆయనకు బాధ్యతలు అప్పగించింది.

అనంతరం కార్నీ(59) మాట్లాడుతూ.. కెనడాను అమెరికాలో 51 రాష్ట్రంగా మారాలని ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదనలు చేస్తున్నారు. ఈ ప్రతిపాదనలపై కార్నీ మాట్లాడారు.

‘‘అమెరికా కెనడా కాదు. కెనడా ఎప్పటికీ ఎప్పుడూ అమెరికాలో ఏ విధంగానూ, రూపంలోనూ భాగం కాబోదు’’ అని అన్నారు. కెనడియన్లు ఎప్పుడూ కూడా ఇంకొరి చేతికింద ఉండాలనుకోరని అన్నారు.

కెనడా వనరులు, నీరు, భూమి ఇలా మొత్తాన్ని అమెరికా కోరుకుంటోందని అన్నారు. వారు ఇందులో విజయం సాధిస్తే మన జీవన విధానాన్ని నాశనం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా ఒక సింక్ హోల్ అయితే.. కెనడా మెజాయిక్ అన్నారు.
మార్క్ కార్నీ ఇంతకుముందు బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మాజీ గవర్నర్ గా పనిచేశారు. ఆదివారం అట్టవా లో జరిగిన సమావేశంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు.
కెనడాను అవమానిస్తున్నారు..
కెనడా వస్తువులపై డొనాల్డ్ ట్రంప్ అన్యాయంగా సుంకాలను విధిస్తున్నారని ఆయన విమర్శించారు. కెనడియన్ కుటుంబాలు, కార్మికులు, వ్యాపాారాలను లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు. వాణిజ్య యుద్దంలో ట్రంప్ గెలవనీయమని అన్నారు.
ప్రస్తుత కెనడియన్ల ప్రతిస్పందనపై తాము గర్వపడుతున్నామని అన్నారు. కెనడాకు చీకటి రోజులు తీసుకొస్తున్న అమెరికాను ఇక నమ్మలేని దేశంగా భావిస్తామన్నారు. రాబోయే రోజులన్నీ కఠినంగా ఉంటాయని వాటిని మనమంతా కలిసి ఎదుర్కోవాలని అన్నారు. ఈ పాఠాలను గుర్తుంచుకోవాలని కెనడియన్లను కోరారు.
అమెరికా న్యాయంగా వ్యాపారంగా సుంకాలు విధించే వరకూ కెనడా కూడా ప్రతీకార చర్యలకు సిద్దంగా ఉంటుందని అన్నారు. అమెరికాలో ఆరోగ్య సంరక్షణ స్పష్టంగా ఒక వ్యాపారమని విమర్శలు గుప్పించారు.
వాణిజ్య యుద్ధంలో గెలుపు మాదే..
గేమ్ అమెరికా మొదలుపెట్టిందని, కానీ వాణిజ్యయుద్దమైన, హకీ అయిన గెలుపు కెనడాదే అన్నారు. ట్రంప్ తో పాటు ప్రతిపక్ష పార్టీ నేత పియరీ పోయిలివ్రే ను కూడా నూతన ప్రధాని విమర్శించారు.
ఒకరు దేశం వెలుపల నుంచి ఆర్థిక వ్యవస్థను కూల్చడానికి ప్రయత్నిస్తుంటే.. మరొకరు దేశంలో ఉండి ఇదే పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న ఈ సంక్షోభాన్ని కలిసి అధిగమిస్తామని కార్నీ కెనడా ప్రజలకు హమీ ఇచ్చారు. ప్రతి సంక్షోభాన్ని కెనడా ప్రజలు అధిగమించారన్నారు. ‘‘వివ్ లా కెనడా’’ (కెనడా వర్థిల్లాలి) అని మార్క్ కార్నీ ప్రసంగం ముగించారు. 
Tags:    

Similar News