హసీనా మరణశిక్ష తీర్పుపై స్పందించిన చైనా

ఇది ఢాకా అంతర్గత వ్యవహరం అని పేర్కొన్నా కమ్యూనిస్టు దేశం

Update: 2025-11-18 13:27 GMT
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించడం అనేది ఢాకా అంతర్గత వ్యవహారం అని చైనా వ్యాఖ్యానించింది. ఈ సంఘటనపై బీజింగ్ ఇతర వ్యాఖ్యలు చేయడానికి నిరాకరించింది.

గత సంవత్సరం విద్యార్థి ఉద్యమంలో హింస చెలరేగింది. దీనికి కారణం షేక్ హసీనా అని ప్రాసిక్యూషన్ వాదించింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు చేసిందని బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యూనల్(ఐసీటీ) భావించింది. ఇదే విధమైన ఆరోపణలపై మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్ కు కూడా మరణశిక్ష విధించింది.

చైనా..
తీర్పు గురించి చైనా విదేశాంగమంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ విలేకరులతో మాట్లాడారు. ఇది బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహరం అని ఆయన వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ ప్రజలందరి పట్ల మంచి సంబంధం చైనాకు ఉందని పేర్కొన్నారు.
పొరుగుదేశం స్నేహ విధానానికి చైనా కట్టుబడి ఉందని నింగ్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్ సంఘీభావం, స్థిరత్వం, అభివృద్ధిని సాధిస్తుందని మేము హృదయపూర్వకంగా భావిస్తున్నామని అన్నారు.
గత ఏడాది ఆగష్టు 5న బంగ్లాదేశ్ లో జరిగిన భారీ నిరసనల నేపథ్యంలో హసీనా అక్కడి నుంచి పారిపోయినప్పటి నుంచి భారత్ లో నివసిస్తున్నారు.
మోసపూరితం..
ఈ తీర్పుపై హసీనా స్పందించింది. తనపై వచ్చిన అభియోగాలను తిరస్కరించింది. అంతర్జాతీయ నేరాల ట్రిబ్యూనల్ విచారణ పక్షపాతం, మోసపూరితంగా ఉందని పేర్కొంది. అవామీ లీగ్ ను నాశనం చేయడానికి ప్రతిపక్షాలతో కలిసి తాత్కాలిక పాలకుడు యూనస్ ప్రయత్నిస్తున్నారని అన్నారు.
ప్రజాస్వామ్య అధికారం లేని, ఎన్నిక కానీ ప్రభుత్వం తన రాజకీయ స్థావరాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తోంది. తనకు న్యాయమైన, నిజమైన రక్షణ నిరాకరించారని, ట్రిబ్యూనల్ కేవలం రాజకీయ ఆయుధంగా వ్యవహరించిందని ఆరోపించారు.
అవామీ లీగ్ ను బలి పశువును చేయడం..
రాబోయే ఎన్నికలకు ముందు తన పార్టీ అయిన అవామీ లీగ్ ను బలిపశువును చేయడమే ఈ కేసు వెనుక అసలు ఉద్దేశం అని హసీనా ఓ ప్రకటనలో ఆరోపించారు. తనకు తన మద్దతుదారులకు తగిన ప్రక్రియ అందలేదని, ప్రజాస్వామ్య మద్దతు లేకుండా తాత్కాలిక పాలనగా ఆమె వర్ణించిన దాని ద్వారా విధించబడినందున విచారణకు చట్టబద్దత లేదని ఆమె అన్నారు.
ట్రిబ్యూనల్ తీర్పు అవామీ లీగ్ రాబోయే ఎన్నికలలో పోటీ చేయకుండా నిషేధించింది. బంగ్లాదేశ్ సంక్షోభ రాజకీయంలో ఇది కీలక మలుపును సూచిస్తుంది. ట్రిబ్యూనల్ కార్యకలాపాల్లో పారదర్శకత, స్వాతంత్య్రం లేకపోవడం, అలాగే ఇతరులను విస్మరిస్తూ తన పార్టీని మాత్రమే లక్ష్యంగా చేసుకుని సెలెక్టివ్ జస్టిస్ అని విమర్శలు గుప్పిస్తున్నారు.
Tags:    

Similar News