లాస్ ఏంజెలీస్ లో తిరగబడ్డ జనం
మాట వినకపోతే యాక్టివ్ మెరైన్ కమాండోలను పంపుతామని హెచ్చరించిన రక్షణ శాఖ;
By : The Federal
Update: 2025-06-09 06:45 GMT
కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ నగరంలో జరుగుతున్న ఆందోళనలను అదుపులోకి తీసుకురావడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేషనల్ గార్డ్ లను మోహరించగా పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా మారింది.
జాతీయ దళాలకు మొహరింపుకు ప్రతిస్పందనగా వేలాది మంది నిరసనకారులు వీధుల్లోకి రావడంతో ఇంకా అల్లర్లు పెరిగాయి. నిరసనకారులను నియంత్రించడానికి టియర్ గ్యాస్, రబ్బరు బులెట్లు, ఫ్లాష్ బ్యాంగ్ లను ఉపయోగించారు.
కొంతమంది పోలీసులు గుర్రాలపై వీధుల్లో గస్తీ తిరుగుతున్నారు. కొంతమంది సమాఖ్య ఆస్తులను రక్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అక్రమ వలసదారులను తీసుకెళ్లి నిర్భంధించిన కేంద్రాల వద్ద ఆందోళనలు కొనసాగుతుండటంతో రక్షణ దళాల సంఖ్య పెంచుతున్నారు.
లాస్ ఏంజెల్స్ లోని పలు ప్రాంతాలలో అక్రమ వలసదారులను నియంత్రించడానికి ట్రంప్ తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా మూడో రోజు నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో ఘర్షణలు జరిగాయి. దాదాపు 300 మంది నేషనల్ గార్డ్స్ రావడంతో కొంతమంది స్థానికులల్లో కోపం, భయం రేకెత్తించింది.
ఇంటికి వెళ్లండి..
లాస్ ఏంజెల్స్ లోని డౌన్ టౌన్( ప్రజలు నడకమార్గంలో షాపింగ్ చేసే ప్రాంతం) మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్ వెలుపల వందలాది మంది గుమిగూడారు. అక్కడే ఇమ్మిగ్రేషన్ అధికారులు వందలాది మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నారు.
తుపాకులు, అల్లర్ల కవాచాలు పట్టుకుని ఉన్న పోలీసులకు ఎదురుగా నిలబడి నినాదాలు చేశారు. ‘‘సిగ్గు’’,‘‘ఇంటికి వెళ్లు’’ అనే నినాదాలు చేశారు. వీరిపైకి పోలీసులు దూసుకెళ్లి బాష్పవాయు గోళాలు ప్రయోగించారు.
కొన్ని నిమిషాల తరువాత గుంపును చెదరగొట్టడానికి మందుగుండు సామగ్రిని ప్రయోగించింది. ఎటువంటి అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని పోలీసులు చెప్పారు. తరువాత నిరసనకారులు 101 ఫ్రీవేపై ట్రాఫిక్ ను అడ్డుకునేందుకు వెళ్లగా చివరకు పోలీసులు వారిని చెదరగొట్టారు.
గార్డులను తొలగించండి..
కాలిఫోర్నియాలోకి నేషనల్ గార్డు దళాలను పంపడంపై గవర్నర్ గవిన్ న్యూసన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్రంప్ కు లేఖ రాశారు. తమ రాష్ట్రంలోకి నేషనల్ గార్డ్ లను పంపడం రాష్ట్ర సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే అని పిలిచారు.
రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలు పరిపాలన యంత్రాంగం రెచ్చగొట్టినవి అని మేయర్ కరెన్ బాస్ మధ్యాహ్నం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అన్నారు.
‘‘ఇది కేవలం ఒక ఎజెండా మాత్రమే, ప్రజాభద్రత గురించి మాత్రం కాదు’’అని న్యూసమ్ అన్నారు. అయితే వీటిని ఖండించారు. డెమొక్రాట్లు ఇమ్మిగ్రేషన్ డిపార్ట్ మెంట్లపై అనవసరం ఆరోపణలకు దిగుతున్నారని, నిరసనలను అరికట్టడంలో విఫలం అయ్యారని అందుకే నేషనల్ గార్డ్స్ ను దింపినట్లు తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.
అమెరికాలో ఒక రాష్ట్ర గవర్నర్ అభ్యర్థన లేకుండానే నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దింపడం దశాబ్ధాల తరువాత ఇదే మొదటిసారి. అయితే జాతీయ దళాలు రావడంతో ఆందోళనలు పక్క ప్రాంతాలైన లాటినో, పారామౌంట్, కాంప్టన్ కు వరకూ వ్యాపించాయి.
శనివారం పారామౌంట్ లోని హోమ్ డిపో సమీపంలో ఫెడరల్ ఏజెంట్లు స్టేజింగ్ ఏరియాను ఏర్పాటు చేశారు. అయితే నిరసనకారులు పెట్రోలింగ్ వాహనాలను అడ్డుకున్నారు. కొంతమంది రాళ్లు, సిమెంట్ ముక్కలను విసిరి పరిస్థితిని ఉద్రిక్తం చేశారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి టియర్ గ్యాస్, ఫ్లాష్ బ్యాంగ్, పెప్పర్ గ్యాస్ ప్రయోగించారు.
వంద దాటిన అరెస్ట్ లు..
ఇమ్మిగ్రేషన్ అధికారులు వరుస తనిఖీలు నిర్వహించిన తరువాత పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వారం రోజుల పాటు నగరంలో వలసదారుల అరెస్టుల సంఖ్య 100 దాటింది. నిరసన తెలుపుతున్న ఒక ప్రముఖ యూనియన్ నాయకుడిని అరెస్ట్ చేశారు. చట్ట అమలుకు ఆటంకం కలిగించారని పోలీసులు ప్రకటించారు.
బ్రెన్నాన్ సెంటర్ ఫర్ జస్టిస్ ప్రకారం.. చివరిసారిగా 1965 లో గవర్నర్ అనుమతి లేకుండా నేషనల్ గార్డ్ ను యాక్టివేట్ చేశారు. అప్పటి అధ్యక్షుడు లిండన్ బి జాన్సన్ అలబామాలో పౌరహక్కుల మార్చ్ ను రక్షించడానికి దళాలను పంపారు. ఆ తరువాత ఇప్పుడే ట్రంప్ మరోసారి నేషనల్ గార్డ్స్ ను రాష్ట్ర అభ్యర్థన లేకుండానే పంపారు.
నిబంధనలు ఏం చెబుతున్నాయి..
యునైటెడ్ స్టేట్స్ నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ అధికారంపై తిరుగుబాటు లేదా తిరుగుబాటు ప్రమాదం ఉన్నప్పుడూ ఫెడరల్ సర్వీస్ సభ్యులను మోహరించడానికి అనుమతించే చట్టపరమైన నిబంధనలను ట్రంప్ శనివారం తన ఆదేశంలో ఉపయోగించారు. నేషనల్ గార్డ్ లోని 2 వేల మంది సభ్యులను మోహరించడానికి తాను అధికారం ఇచ్చానని ఆయన చెప్పారు.
న్యూజెర్సీలోని మోరిస్ టౌన్ లో ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కడానికి సిద్దమవుతున్న సమయంలో ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. లాస్ ఏంజెల్స్ లో హింసాత్మక వ్యక్తులు ఉన్నారని అన్నారు.
అలాంటి వ్యక్తులు చట్టం నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. లాస్ ఏంజెల్స్ కు అదనపు దళాలు పంపుతున్నారా అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ ‘‘ మేము ప్రతి చోటా దళాలను పంపుతాము. మన దేశానికి ఏం జరగనివ్వము. బైడెన్ లో జరిగినట్లుగా మన దేశాన్ని ముక్కలు కానివ్వలేము’’ అని ఆయన అన్నారు.
అక్రమ వలసదారులను కాపాడాటానికి ప్రయత్నిస్తున్న అధికారులు కూడా అభియోగాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇమ్మిగ్రేషన్ అధికారును తప్పించుకోవడానికి ఓ వ్యక్తికి సాయం చేశారనే ఆరోపణలపై విస్కాన్సిన్ న్యాయమూర్తిని గత నెలలో పోలీసులు అరెస్ట్ చేశారు. ‘‘అధికారులు శాంతి భద్రతలకు అడ్డుగా ఉంటే, అవును వారు ఆరోపణలను ఎదుర్కొంటారు’’ అని ట్రంప్ అన్నారు.
ట్రంప్ తో 40 నిమిషాల పాటు..
రెండు రోజుల క్రితం గవర్నర్ న్యూసమ్, అధ్యక్షుడు ట్రంప్ తో దాదాపు 40 నిమిషాల మాట్లాడుకున్నారు. నేషనల్ గార్డ్ రాక సమయం గురించి గందరగోళంగా ఉంది. లాస్ ఏంజెల్స్ మేయర్ కరెన్ బాస్ మాట్లాడుతూ.. నగరానికి ఇంకా దళాలు చేరుకోలేదని అన్నారు.
అక్కడ ఇంకా హింస కొనసాగితే ‘యాక్టివ్ డ్యూటీ మెరైన్’ లను పంపుతామని రక్షణ కార్యదర్శి బెదిరిస్తున్నారు. హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ ట్రిసియా మెక్ లాఫ్లిన్ కాలిఫోర్నియా రాజకీయా నాయకులు, నిరసనకారులు ‘‘అమెరికన్ల భద్రతను పణంగా పెట్టి దారుణమైన అక్రమ గ్రహాంతర నేరస్థులను రక్షిస్తున్నారు’’ అని ఆరోపించారు.
అల్లర్లకు బదులు ప్రతిరోజు మేల్కోని మన కమ్యూనిటీలను సురక్షితంగా ఉంచే ఇమ్మిగ్రేషన్, కస్టమ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు కృతజ్ఞత తెలిపాలి’’ అని మెక్ లాఫ్లిన్ అన్నారు.
డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్ సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం.. ఈ దళాలలో కాలిఫోర్నియా ఆర్మీ నేషనల్ గార్డ్ 79వ ఇన్ ఫాంట్రీ బ్రిగ్రేడ్ పోరాట బృందం సభ్యులు ఉన్నారు.
యూఎస్ నార్తర్న్ కమాండ్ ప్రకారం.. లాస్ ఏంజెల్స్ కు తూర్పున 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ట్వైంటైనైన్ పామ్స్ వద్ద ఉన్న దాదాపు 500 మంది మెరైన్ లు ఆదివారం మధ్యాహ్నం ‘‘మోహరించడానికి సిద్దంగా ఉన్నారు’’ అని చెప్పారు.
నిరంకుశంలోకి తీసుకెళ్తున్నారు..
ట్రంప్ ఉత్తర్వులను దేశాన్ని వేగంగా నిరంకుశత్వంలోని తీసుకెళ్తున్నాయని, అధ్యక్షుడు కాంగ్రెస్, యునైటెడ్ స్టేట్స్ అధికారులను ఆక్రమించుకోవడాన్ని ప్రతిబింబిస్తుందని వెర్మోంట్ సెనెటర్ బెర్నీ సాండర్స్ విమర్శించారు.
మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మాట్లాడుతూ.. దేశంలో విభజనను వ్యాప్తి చేయడానికి క్రూరమైన అరెస్ట్ లు జరుగుతున్నాయని అన్నారు. ట్రంప్ కు బలమైన మిత్రుడు హౌజ్ స్పీకర్ మైక్ జాన్సన్ అధ్యక్షుడి చర్యను సమర్థించారు.