పాక్ అణ్వాయుధాలు అమెరికా చేతిలోనే: సీఐఏ మాజీ అధికారి

సాంప్రదాయ యుద్ధంలో భారత్ ను పాక్ ను ఓడించలేదు

Update: 2025-10-25 11:06 GMT
సీఐఏ మాజీ అధికారి జాన్ కిరియాకౌ

పాకిస్తాన్ లోని అణ్వాయుధాలను అమెరికానే ఆపరేటింగ్ చేస్తున్నట్లు సీఐఏ మాజీ అధికారి బాంబు పేల్చారు. ముషారఫ్ హయాంలో లక్షలాది డాలర్ల సైనిక, ఆర్థిక సాయం అందించి తమ నియంత్రణలోని తీసుకున్నట్లు చెప్పారు.

భారత్ తో జరిగే సాంప్రదాయ యుద్ధంలో పాక్ ఎన్నటికీ గెలవలేదని కూడా వ్యాఖ్యానించారు . 2001 నాటి పార్లమెంట్ దాడుల తరువాత రెండు అణ్వాయుధ దేశాలు యుద్ధం అంచుకు చేరుకున్నాయని చెప్పారు.

సీఐఏలో 15 సంవత్సరాలు పనిచేసిన జాన్ కిరియాకౌ, వాషింగ్టన్- ఇస్లామాబాద్ మధ్య శాంతి, పాకిస్తాన్ లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు నాయకత్వం వహించారు. పాకిస్తాన్ తో అమెరికా వ్యవహరాలు, అణుదౌత్యం సౌదీపై ప్రభావం, దక్షిణాసియాలో మారుతున్న అధికార సమతుల్యత గురించి ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు.

ఇండియాను రెచ్చగొట్టడం వల్ల ప్రయోజనం లేదు..
భారత్ ను రెచ్చగొట్టడం, యుద్ధం చేయడం వల్ల పాకిస్తాన్ కు ఎటువంటి ప్రయోజనం లేదని, దీని గురించి నిర్ధారణకు రావాలని ఆయన పేర్కొన్నారు.
‘‘భారత- పాకిస్తాన్ మధ్య నిజమైన యుద్ధం వల్ల ఏమీ సాధించలేరు. ఎందుకంటే పాకిస్తానీలు ఓడిపోతారు. నేను అణ్వాయుధాల గురించి మాట్లాడటం లేదు. నేను సాంప్రదాయ యుద్ధం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. నిరంతరం భారతీయులను రెచ్చగొట్టడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు’’ అని ఆయన అన్నారు.
2001 లో పార్లమెంట్ పై జైషే మహ్మద్ దాడి చేసిన తరువాత అప్పటి వాజ్ పేయ్ ప్రభుత్వం ‘ఆపరేషన్ పరాక్రమ్’ ప్రారంభించింది. ఈ సందర్భంగా 2002 లో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు యుద్దంగా మారవచ్చని 2002 లో అమెరికా ఊహించిందని దీనిఫలితంగా తన పౌరులను ఇస్లామాబాద్ నుంచి తరలించడం ప్రారంభించిందని కిరియాకౌ అన్నారు.
పాకిస్తాన్ లో తాను పనిచేస్తున్నప్పుడూ ఆ దేశ అణ్వాయుధాలను కూడా వాషింగ్టన్ నియంత్రిస్తుందనే విషయాన్ని తనకు అనధికారికంగా తెలియజేశారని కూడా ఆయన చెప్పారు.
‘‘ముషారఫ్ ఈ నియంత్రణను అమెరికాకు అప్పగించారు’’ అని చెప్పారు. ఆ సమయంలో సీఐఏ అల్ ఖైదా, ఆప్ఘనిస్తాన్ పై దృష్టి సారించిందని, భారత భద్రతా సమస్యలపై తక్కువ శ్రద్ధ చూపిందని కిరియాకౌ అంగీకరించారు.
అమెరికా చేతిలోనే...
అప్పటి పాక్ సైనిక జనరల్ ముషారఫ్ కు అమెరికా భారీ సహాయ ప్యాకేజీలు అందించడం ద్వారా పాక్ తన అణ్వాయుధాల నియంత్రణలను అమెరికాకు అప్పగించారని తెలిపారు. ఇది తప్పనిసరి పరిస్థితులలో కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.
‘‘యూఎస్ఏ నియంతలతో పనిచేయడానికి ఇష్టపడుతుంది. మీరు ప్రజాభిప్రాయం లేదా మీడియా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మేము ముషారఫ్ ను కొనుగోలు చేశాము’’ అని చెప్పారు.
ముషారఫ్ హాయాంలో వాషింగ్టన్ పాకిస్తాన్ భద్రత, సైనిక కార్యకలాపాలకు దాదాపుగా అడ్డంకులు లేకుండా యాక్సెస్ చేసింది. ‘‘మేము లక్షల డాలర్ల సాయం, సైనిక పరికరాలు అందించాం. ముషారఫ్ మాకు ఏదీ అవసరమో అది చేయనిచ్చాడు’’ అని కిరియాకౌ చెప్పాడు.
ముషారఫ్ అమెరికాతో డబుల్ గేమ్ ఆడారు. బహిరంగంగా అమెరికాతో పొత్తు పెట్టుకుని, పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాదులు భారత్ కు వ్యతిరేకంగా తమ కుట్రలను కొనసాగించడానికి అనుమతించారు.
‘‘పాకిస్తాన్ సైన్యం అల్ ఖైదా గురించి పట్టించుకోలేదు. భారత్ ను మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ముషారఫ్ భారత్ దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదానికి పాల్పడుతూ ఉగ్రవాద నిరోధకతపై అమెరికా వైపు ఉన్నట్లు నటించారు’’ అని ఆయన అన్నారు.
అణు కార్యక్రమానికి సౌదీ మద్దతు..
పాక్ అణ్వాయుధాలను తయారు చేస్తుందని అమెరికాకు తెలుసు, పాక్ అణు శాస్త్రవేత్త అబ్దుల్ ఖాదీర్ ఖాన్ ను నిర్మూలించే ప్రయత్నం చేసింది, కానీ సౌదీ ఇందులో జోక్యం చేసుకోవడంతో ఈ ప్రణాళిక నుంచి అమెరికా తప్పుకుందని కిరియాకౌ చెప్పారు.
‘‘మేము ఇజ్రాయెల్ వైఖరిని అవలంబించి ఉంటే అతడిని చంపేసేవాళ్లం. అతను ఎక్కడ నివసిస్తున్నాడో, రోజు ఎక్కడ గడిపేవాడో మాకు సమాచారం ఉంది. కానీ అతనికి సౌదీ మద్దతు ఇచ్చింది. సౌదీలు మా దగ్గరకు వచ్చి అతన్ని వదిలేయండి మాకే ఏక్యూ ఖాన్ అంటే ఇష్టం. మేము అతనితో కలిసి పనిచేస్తున్నాం. అతన్ని ఒంటరిగా వదిలేయండి’’ అని అన్నారు.
అమెరికా ఏక్యూ ఖాన్ ను వదిలివేయడం పెద్ద విధానపరమైన తప్పిదంగా అభివర్ణించారు. ఖాన్ పై చర్య తీసుకోవద్దని వైట్ హౌజ్ సీఐఏ, ఐఏఈఏ రెండింటికి ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు.
సౌదీ అరేబియా ఖాన్ ను రక్షించడం దాని స్వంత అణు ఆశయాలు నుంచి వచ్చినట్లు చెప్పారు. పాక్ తో సమాంతరంగా అణు సామర్థ్యం సంపాదించడం రియాద్ దీర్ఘకాలిక ప్రణాళిక అని అనుమానం వ్యక్తం చేశారు.
‘‘సౌదీలు కూడా అణ్వాయుధ సామర్థ్యం పెంచుకుంటున్నారా? అని మేము ఆలోచిస్తున్నాం’’ అని కిరియా కౌ వ్యాఖ్యనించారు. ఇటీవల పాక్- సౌదీ మధ్య కుదిరిన రక్షణ ఒప్పందాన్ని అనుసంధానిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Tags:    

Similar News