పాక్ కు రాఫెల్ ను కూల్చే సామర్థ్యం లేదు

ఇస్లామాబాద్ ప్రసారం చేసిన వార్తలు ఖండించిన ఫ్రెంచ్ నేవీ

Update: 2025-11-23 12:44 GMT
రాఫెల్ ఫైటర్ జెట్

ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ కు చెందిన రాఫెల్ జెట్ లను పాక్ సైన్యం కూల్చివేసిందని పాకిస్తాన్ మీడియా ప్రసారం చేసిన కథనాలను ఫ్రెంచ్ నేవీ ఆదివారం తోసిపుచ్చింది. పాకిస్తాన్ జియో టీవీలో ప్రచురితమైన కథనం పుకార్లుగా ఫ్రెంచ్ నేవీ కమాండర్ అభివర్ణించారు.

పాకిస్తాన్ ఆపరేషన్ సమయంలో అనేక జెట్లను కూల్చివేసినట్లు ప్రకటించుకుంది. అనేక నిర్వహణ లోపాల కారణంగానే ఇవి కూలిపోయినట్లు ఇండో పసిఫిక్ సమావేశంలో కొన్ని వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఫ్రెంచ్ నేవీ అధికారి  ఈ మాటలు అన్నట్లు పాక్ మీడియా పేర్కొంది.
అయితే ఫ్రెంచ్ నేవీ మెరైన్ ఈ వార్తలను కొట్టిపారేసింది. పాకిస్తాన్ మీడియా నివేదికలో అనేక లోపాలు ఉన్నాయని పేర్కొంది. ‘‘ఈ ప్రకటనలు కెప్టెన్ లానేకు ఆపాదించబడ్డాయి. అతను ఏ విధమైన ప్రచురణకు తన సమ్మతిని ఎప్పుడూ ఇవ్వలేదు. ఈ వ్యాసంలో విస్తృతమైన తప్పుడు సమాచారం ఉంది’’ అని ఫ్రెంచ్ నేవీ ఎక్స్ లో పోస్ట్ చేసింది.
ఆ వ్యాసంలో కమాండర్ మొదటి పేరు జాక్విస్ కాదని, యువన్ అన్నారు. ఫ్రెంచ్ నావిదళంలో కేవలం కమాండింగ్ అధికారి అని మాత్రమే పేర్కొంది. ఇండో పసిఫిక్ సమావేశంలో కెప్టెన్ యువన్ లౌనే ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ విమానాలు కూల్చివేసినట్లు చెప్పలేదని ఫ్రెంచ్ నావికాదళం స్పష్టం చేసింది.
‘‘కెప్టెన్ యువన్ లౌనే తన నావికా వైమానిక స్థావరం ఆస్తులను, రాఫెల్ ఫైటర్ జెట్ మిషన్లును, ఫ్రెంచ్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ భావనను సమర్థించారు. ఆపరేషన్ సిందూర్ గురించి ప్రశ్న అడిగినప్పుడు రాఫెల్ జెట్ కూలినట్లు ధృవీకరించలేదు. తిరస్కరించలేదు. చైనా వ్యవస్థలు భారత రాఫెల్ ను జామ్ చేసే అవకాశం గురించి మాట్లాడానికి ఆయన నిరాకరించారు’’ అని ఫ్రెంచ్ నేవీ పేర్కొంది.
ఆపరేషన్ సిందూర్ టైమ్ లో పాక్ కు చెందిన ఆరు జెట్లను కూల్చివేసినట్లు భారత సైన్యం ప్రకటించింది. పదుల సంఖ్యలో పాక్ సైనికులు హతమార్చినట్లు వెల్లడించింది. 
పహల్గాం ఉగ్రవాద దాడి..
జమ్ముకశ్మీర్ లోని పహల్గాం గడ్డి మైదానాలలో విహారయాత్రకు వెళ్లిన టూరిస్టులలో హిందువులను గుర్తించిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు, భార్యల ముందే భర్తలను కాల్చివేశారు. ఈ దుర్ఘటనలో 26 మంది చనిపోయారు.
ఈ ఉగ్రవాద ఘటనపై భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ ను ప్రారంభించింది. పాక్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేసింది. దాదాపు వంద మంది తీవ్రవాదులను హతమార్చింది. 


Tags:    

Similar News