‘నిషేధం విధించే వరకు ‘అవామీ లీగ్’ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు’

బంగ్లాదేశ్ ప్రధాన ఎన్నికల కమిషనర్ AMM నసీర్ ఉద్దీన్;

Update: 2025-01-01 06:57 GMT

అవామీ లీగ్ (Awami League) పార్టీపై ప్రభుత్వం లేదా న్యాయవ్యవస్థ నిషేధం విధించేవరకు ఆ పార్టీ తరుపున అభ్యర్థులు ఎన్నికలలో పోటీ చేయవచ్చని బంగ్లాదేశ్ ప్రధాన ఎన్నికల కమిషనర్ AMM నసీర్ ఉద్దీన్ తెలిపారు. సోమవారం ఎన్నికల అధికారులతో జరిగిన సమావేశంలో సీఈసీ (CEC) ఈ విషయాన్ని వెల్లడించినట్లు ద ఢాకా ట్రిబ్యూన్‌ వార్తాపత్రిక పేర్కొంది. ఎన్నికల సంఘం పూర్తి స్వతంత్రంగా పనిచేస్తుందని, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మునుపటి ఎన్నికలలో కొన్ని చోట్ల నకిలీ ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారని, ఈ సమస్యను అధిగమించేందుకు వచ్చే ఆరు నెలల్లో ఓటరు జాబితా అప్‌డేట్ చేస్తామన్నారు.

కొద్ది రోజుల క్రితం మాజీ ప్రధాని ఖలీదా జియా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (Bangladesh Nationalist Party).. ‘‘ ఓటరు కనిష్ట వయసు 17 సంవత్సరాలుగా నిర్ణయించాలని ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ (Muhammad Yunus) చేసిన సూచన ఎన్నికల కమిషన్‌పై ఒత్తిడి తెస్తుందని, ఆ ప్రతిపాదన ఎన్నికల ప్రక్రియను ఆలస్యం చేస్తుంది,’’ అని పేర్కొంది. ఆగస్టులో మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) పదవీచ్యుతురాలు కావడంతో 84 ఏళ్ల యూనస్ మధ్యంతర ప్రభుత్వానికి నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 16న తన విక్టరీ డే ప్రసంగంలో 2025 చివరి నుంచి 2026 ప్రథమార్ధంలో ఎన్నికలు ఉండవచ్చని యూనస్ అభిప్రాయపడ్డారు. ఓటర్ల జాబితాను సవరించిన తర్వాతే ఎన్నికలుంటాయని కూడా చెప్పారు. 

Tags:    

Similar News