‘‘భారత్ తో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తా‘‘
అసిమ్ మునీర్ వాచాలత్వం.. సింధూ నదీపై ఆనకట్టలు నిర్మిస్తే క్షిపణులతో పేల్చివేస్తాని పిచ్చి ప్రేలాపనలు;
By : The Federal
Update: 2025-08-11 06:50 GMT
పాక్ జనరల్ ఆసిమ్ మునీర్ కు ఇంకా బుద్ది వచ్చినట్లు లేదు. ఆపరేషన్ సిందూర్ తో పంజాబ్ లోని ఉగ్రవాద స్థావరాల ధ్వంసం, తరువాత జరిగిన సైనిక ఘర్షణలో దాని 11 ఎయిర్ బేస్ లు, ఆరు ఫైటర్ జెట్లు కుప్పకూలిన తరువాత కూడా బీరాలు పలకడం మానట్లేదు.
తాజాగా పాక్ సైనిక జనరల్ మునీర్ భారత్ కు అణు హెచ్చరికలు చేశారు. భవిష్యత్ లో ఇండియాతో యుద్దం జరిగి, పాకిస్తాన్ ఉనికికి ముప్పు ఏర్పడితే భారత్ తో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని బెదిరింపులకు దిగారు.
‘‘మనది అణ్వస్త్ర దేశం, మనం పతనమవుతుని తెలిస్తే సగం ప్రపంచాన్ని కూడా పతనానికి గురి చేస్తాం’’ అని ఫ్లోరిడాలోని టంపాలో పాకిస్తాన్ గౌరవ కాన్సుల్ గా ఉన్న వ్యాపారవేత్త అద్నాన్ అసద్ ఇచ్చిన విందులో మునీర్ అన్నారని ది ప్రింట్ వార్తా కథనాలు ప్రసారం చేసింది. అమెరికా గడ్డ మీద నుంచి అణు బెదిరింపులు చేయడం ఇదే మొదటిసారి.
పది క్షిపణులతో పేల్చేస్తాం
భారత్ సింధు నదీ జలాలను నిలిపివేసిన అంశం గురించి కూడా మునీర్ మాట్లాడాడు. భారత్ ఆనకట్ల నిర్మించే వరకూ చూసి వాటిని క్షిపణులతో పేల్చివేస్తామని హెచ్చరించినట్లు సమాచారం.
భారత్ నిర్ణయం వల్ల 250 మిలియన్ల పాకిస్తానీలు ఆకలితో అలమటించే ప్రమాదం ఉందన్నారు. సింధూనది భారతీయుల కుటుంబ ఆస్తి కాదని హెచ్చరించారు. పాక్ కు క్షిపణులు కొరత లేదని అన్నారు. ఫ్లోరిడాలో జరిగిన విందులో 120 మంది పాకిస్తానీ ప్రవాసులు పాల్గొన్నారు.
సుదీర్ఘంగా మాట్లాడిన..
పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత భారత్- పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణ, భవిష్యత్ యుద్ధాల గురించి ఫీల్డ్ మార్షల్ మునీర్ సుదీర్ఘంగా మాట్లాడారు. ‘‘పరిస్థితిని అర్థం చేసుకోవడానికి నేను ఒక ముడి సారూప్యతను ఉపయోగిస్తున్నాను. భారత్ హైవేపై వస్తున్న మెరిసే మెర్సిడేజ్ లాంటిది. కానీ మనం కంకరతో నిండిన ట్రక్కు లాంటిది. టక్కు కారును ఢీ కొంటే నష్టపోయేది ఎవరూ?’’ అని ఆయన అన్నారు. తరువాత మేము ఏం చేస్తామో వారికి చూపిస్తామని సూరా ఫిల్ పద్యంతో పాటు ముఖేష్ అంబానీ చిత్రం చూపించారు.
క్రీడాకారుల స్ఫూర్తి..
నాలుగు రోజుల యుద్ధంలో భారత్ తన నష్టాల గురించి వివరాలు బయటకు ఇవ్వకపోవడంపై మునీర్ ఎగతాళి చేశారు. లేకపోతే ఆ వివరాలను తామే బయటపెడతామని అన్నారు.
తాము ట్రంప్ ను నోబెల్ బహుమతికి నామినేట్ చేసినట్లు అంగీకరించారు. మంచి పని ఎవరూ చేసిన దానికి పాక్ మద్దతు ఉంటుందన్నారు. పాక్ లో శక్తి, సహజ వనరులు, లోహాలు, హైడ్రో కార్బన్లు, ఖనిజాలు కనుగొన్నట్లు గొప్పలు చెప్పుకున్నారు.