గాజాలోకి ప్రవేశించబోతున్న జర్నలిస్టులను అడ్డుకున్న ఐడీఎఫ్
మానవతా సహాయాన్ని తీసుకురావడానికి ప్రయత్నించిన ఓడను సైతం ఆధీనంలోకి;
By : The Federal
Update: 2025-07-28 08:23 GMT
పాలస్తీనియన్లకు సాయం తీసుకువెళ్తున్నహండాల నౌకలపై ఇజ్రాయెల్ దళాలు దాడి చేసి తమ అదుపులోకి తీసుకుంది. ఇందులో ప్రయాణిస్తున్న 21 మంది అంతర్జాతీయ కార్యకర్తలు, జర్నలిస్టులను ఆధీనంలోకి తీసుకోవడంతో పాటు అన్ని సరుకులను స్వాధీనం చేసుకుంది.
హండాలను నిర్వహించే ఫ్రీడమ్ ప్లొటిల్లా కూటమి ఆదివారం అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ సైన్యం గాజా నుంచి నాటికల్ మైళ్ల దూరంలో అంతర్జాతీయ జలాలలో ఓడను అడ్డగించి, కెమెరాలు, కమ్యూనికేషన్ ను కత్తిరించిందని తెలిపింది.
‘‘అన్ని సరుకులు సైనిక సంబంధమైనవి కావు. పౌర సంబంధమైనవి. ఇజ్రాయెల్ చట్ట విరుద్దమైన దిగ్భంధనం కింద ఆకలితో అలమటిస్తూ వైద్య వైఫల్యాన్ని ఎదుర్కొంటున్న జనాభాకు పంపిణీ చేయడానికి ఉద్దేశించబడ్డాయి’’ అని సదరు బృందం ఒక ప్రకటనలో తెలిపింది.
అవును .. అడ్డుకున్నాం..
ఈ పరిణామంపై ఇజ్రాయెల్ సైన్యం ఇంకా వ్యాఖ్యానించలేదు. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వశాఖ ఆదివారం తెల్లవారుజామున ఎక్స్ లో ఒక ప్రకటన చేసింది. తమ నావికాదళం ఓడను ఆపి ఒడ్డుకు చేర్చినట్లు పోస్ట్ లో పేర్కొంది. ‘‘ఈ నౌక సురక్షితంగా ఇజ్రాయెల్ తీరానికి చేరుకుంటోంది. ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారు.’’ అని ప్రకటన పేర్కొంది.
గాజాపై ఇజ్రాయెల్ సముద్ర దిగ్భంధనను ఛేదించడానికి ఈ ప్రాంతంలో నివసిస్తున్న పాలస్తీనియన్లకు హండాల అనేక సందర్భాలలో ప్రయత్నించింది.
గాజాలో ఆకలిచావులు సంభవిస్తున్నాయని ఆహర నిపుణులు చెబుతున్నారు. కానీ ఇజ్రాయెల్ మాత్రం అక్కడ సహాయం అందించడానికి ఒప్పుకోవడం లేదు. జూన్ లో ఐడీఎఫ్ మాడ్లీన్ ఓడను స్వాధీనం చేసుకుంది. ఇందులో గ్రేటా థన్ బర్గ్ తో పాటు మరో 11 మంది ఉన్నారు.
ఆకలితో 127 మంది మృతి
గాజాలో ఆకలి చావుతో పాలస్తీనియన్లు మరణిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అంతర్జాతీయ సహాయంపై టెల్ అవీవ్ ఆంక్షలు విధించడంతో ఆ దేశం విమర్శలు ఎదుర్కొంటోంది. యుద్దం ప్రారంభమైనప్పటి నుంచి గాజాలో ఆకలి కారణంగా మరణించిన వారి సంఖ్య 127గా ఉందని స్థానిక అధికారులు అంచనా వేశారు. వీరిలో 85 మంది పిల్లలు ఉన్నట్లు ఖతార్ కు చెందిన అల్ జజీరా వార్తలు ప్రసారం చేసింది.
శనివారం ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 71 మంది మరణించారు. అయితే ఇందులో 42 మంది ఆకలి కోసం సాయం అర్థించడానికి బయటకు వచ్చారని నివేదిక పేర్కొంది.
ఇజ్రాయెల్ గాజాకు మానవతా సాయం అందిస్తామని చెప్పినప్పటికీ ఉత్తర గాజాలో కొద్ది మొత్తంలో మాత్రమే అనుమతించింది. దీనిపై యూఎన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినప్పటికీ ఇజ్రాయెల్ పట్టించుకోవడం లేదు.
ఖైదీలను విడుదల చేయాలి
హండాలపై జరిగిన దాడి అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించిందని ప్రాంతీయ మానవ హక్కుల సంస్థ అదాలా పేర్కొంది. పది దేశాలకు చెందిన చట్టసభ సభ్యులు మానవ హక్కుల ప్రచారకులు సహ 21 మంది కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
‘‘ఆ నౌక ఇజ్రాయెల్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించలేదు. అలా చేయాలని కూడా దాని ఉద్దేశ్యం కాదు. అంతర్జాతీయ చట్టం ప్రకారం గుర్తించిబడినట్లుగా అది పాలస్తీనాకు చెందింది. నౌక ప్రయాణించే అంతర్జాతీయ జలాలపై ఇజ్రాయెల్ కు ఎటువంటి చట్టపరమైన అధికార పరిధి లేదా అధికారం లేదు’’ అని పేర్కొంది.