ఆ దేశాన్ని సీరియస్ గా తీసుకోవద్దు

అంతర్జాతీయ వేదికలను తప్పుదోవ పట్టిస్తున్న పాకిస్తాన్ పట్టించుకుని సమయాన్ని వృథా చేసుకోవద్దని భారత్ యూఎన్ఓ ను కోరింది.

Update: 2024-06-26 10:38 GMT

కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా దాని వంకర బుద్దిని మాత్రం విడవడం లేదు . తాజాగా ఐరాసలో జరిగిన ఓ సమావేశంలో దాయాదీ దేశంలో ఇదే తరహలో వితండవాదన చేయగా, భారత్ మరోసారి గట్టిగా బుద్ధి చెప్పింది. అంతర్జాతీయ వేదికలు పాకిస్తాన్ పట్టించుకుని సమయం వృధా చేసుకోవద్దని సమాధానం ఇచ్చింది. పనిలో పనిగా అంతర్జాతీయ వేదికలపై దాని ట్రాక్ రికార్డ్ ను ఎత్తిచూపింది.

పాకిస్థాన్ రాయబారీ మునీర్ అక్రమ్ యూన్ సభలో మాట్లాడుతూ మరోసారి కాశ్మీర్ పాట పాడాడు. దీనిపై భారత్ బుధవారం స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది. అంతర్జాతీయ వేదికలకు పాకిస్తాన్ అనేక సందర్భాల్లో తప్పుదోవ పట్టించదని గుర్తు చేసిన భారత్, కాశ్మీర్ పై పాక్ మరోసారి నిరాధారమైన వాదనలు వినిపించదని విమర్శించింది. ఇస్లామాబాద్ చేస్తున్నవన్నీ కూడా మోసపూరిత కథనాలని ఖండించింది.

"ఇంతకుముందు రోజు, ఒక ప్రతినిధి బృందం ఈ ఫోరమ్‌ను నిరాధారమైన, మోసపూరిత కథనాలను వ్యాప్తి చేయడానికి దుర్వినియోగం చేసింది, ఇది ఆశ్చర్యం కలిగించదు" అని UNలో భారతదేశ శాశ్వత రాయబారీ ప్రతీక్ మాథుర్ అన్నారు.
"ఈ సంస్థ విలువైన సమయాన్ని ఆదా చేయడం కోసం నేను ఈ వ్యాఖ్యలను ఎటువంటి ప్రతిస్పందనతో గౌరవించను" అని అతను వివరించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వార్షిక నివేదికపై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ చర్చలో మాథుర్ భారతదేశ స్పందనను అందించారు.
సమస్య ఏదైనా, అంతర్జాతీయ సంస్థల చర్చల థీమ్ తో సంబంధం లేకుండా పాకిస్తాన్ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతూనే ఉంది. అయితే వీటిని ప్రపంచ దేశాలు పట్టించుకోవడం లేదు. ఇప్పటికే ఉగ్రవాదుల స్వర్గధామంగా ఇస్లామాబాద్ ఖ్యాతి గడించడం, అంతర్జాతీయ వేదికలపై తప్పుడు సమాచారం ప్రచారం చేయడాన్ని, అంతర్జాతీయ సంస్థలను తప్పుదారి పట్టించడాన్ని భారత్ సాక్ష్యాలతో నిరూపించింది. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకాశ్మీర్, లఢక్ కూడా భారతదేశంలో విడదీయరాని అంతర్భాలుగా ఉన్నాయని ప్రకటించింది.
Tags:    

Similar News