భారత్ మనల్నీ బాగా వాడుకుంటోంది: డొనాల్డ్ ట్రంప్
పరస్పర సుంకాలు విధింపు ఉంటుందన్న అమెరికా అధ్యక్షుడు;
By : The Federal
Update: 2025-02-23 09:33 GMT
భారత్ లోని ఓటర్ల సంఖ్యను ప్రభావితం చేయడానికి యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ నిధులను పంపిణీ చేసిందనే ఆరోపణలపై ట్రంప్, భారత్ పై విమర్శలు గుప్పించారు. భారత్ ఇప్పటికే తమ దేశాల ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించి లాభం పొందుతుందని, బైడెన్ హయాంలో దొడ్డిదారిన అనేక నిధులు న్యూఢిల్లీకి తరలించారని అన్నారు.
భారత్ మనల్ని వాడుకుంటున్నారా?
‘‘భారత్ లో ఎన్నికలకు సాయం చేసేందుకు 18 మిలియన్ డాలర్లు ఇచ్చారు. మనకేందుకీ నరకం. మనం పాత పేపర్ బ్యాలెట్లకు ఎందుకు వెళ్లకూడదు. వారి ఎన్నికలో మాకు సాయం చేయనివ్వండి.
ఇది సరియైనదా. ఓటర్ ఐడీ మంచిది కాదా? మనం ఎన్నికల కోసం భారత దేశానికి డబ్బు ఇస్తున్నాం. వారికి డబ్బు ఎందుకివ్వాలి? ట్రంప్ కన్జర్వేషన్ పొలిటికల్ యాక్షన్ కాన్పరెన్స్ లో ప్రసంగిస్తూ చెప్పినట్లూ స్థానిక మీడియా వార్తలు ప్రచురించింది. భారీ మొత్తంలో పన్నూలు విధిస్తూ భారత్ అమెరికాను ఉపయోగించుకుంటుందని ఆరోపించారు.
‘‘వారు(భారత్)మనల్నీ బాగా ఉపయోగించుకుంటున్నారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాలలో ఇది ఒకటి. మేము ఏదో ఒకటి అమ్మడానికి ప్రయత్నిస్తున్నాం. వారు 200 శాతం సుంకం విధిస్తున్నారు. ఆపై వారి ఎన్నికలకు సాయం చేయడానికి మేము వారికి చాలా డబ్బు ఇస్తున్నాం’’ అని ట్రంప్ అన్నారు.
మంచి ఉద్దేశంతో ఇచ్చి ఉంటారులే: జైశంకర్
భారత్ లో యూఎస్ ఎయిడ్ కింద 21 మిలియన్ డాలర్లు ఇవ్వడంపై విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. ఇవి నిజంగా ఆందోళకరమని, ప్రభుత్వం దానిని పరిశీలిస్తోందని అన్నారు.
‘‘భారత్ లో యూఎస్ ఎయిడ్ ‘‘ మంచి విశ్వాసంతో కార్యకలాపాలు చేయడానికి అనుమతి ఇచ్చి ఉంటారు. అయితే ప్రస్తుతం అమెరికా నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. దుష్ట విశ్వాసంతో జరిగే కార్యకలాపాల కోసం వీటిని ఉపయోగించుకున్నారని అర్థమవుతోంది.
‘‘కాబట్టి ఇది కచ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. దానిలో ఏదైనా ఉంటే దుష్ట కార్యకలాపాలలో పాల్గొన్న వ్యక్తులు ఎవరో దేశం తెలుసుకోవాలని నేను భావిస్తున్నాను’’ అని విదేశాంగమంత్రి అన్నారు.
దేశంలోని కొన్ని కార్యకలాపాలకు యూఎస్ ఎయిడ్ నుంచి నిధులు అందాయని తెలిసింది. ఇవి తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. రణధీర్ జైస్వాల్ దీనిగురించి మాట్లాడుతూ.. సంబంధిత విభాగాలు, ఏజెన్సీలు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాయి’’ అన్నారు.
పరస్పర పన్నులు..
భారత్, చైనాలపై పరస్పర పన్నులు విధించాలని తన ప్రతిపాదనను మరోసారి పునరుద్ఘాటించారు. ప్రధాని మోదీ వాషింగ్టన్ కు వచ్చినప్పుడూ దీనిని వివరించామని చెప్పారు.
మేము త్వరలో పరస్పర సుంకాలు విధిస్తాం. ఎందుకంటే వారు మా నుంచి వసూలు చేస్తారు. మేము కూడా అదే పనిచేస్తామన్నారు. ఇలాంటి దేశాలతో మరోసారి న్యాయంగా పోరాడాలని అనుకుంటున్నామని వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ప్రమాణ స్వీకారంగా అన్నారు.