‘బాకు’ తొలి విడత సమావేశానికి దూరంగా భారత్
అజార్ బైజాన్ రాజధాని బాకు లో జరుగుతున్న కాప్ 29 సదస్సు మొదటి విడత సమావేశాలకు భారత్ హజరుకాలేదు.
By : The Federal
Update: 2024-11-12 13:24 GMT
అజర్‌బైజాన్‌లోని బాకులో మంగళవారం ప్రారంభమైన కాప్ 29 సమావేశంలో భారత్ పాల్గొన లేదు. తొలి విడత రెండు రోజుల పాటు వరల్డ్ లీడర్స్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ లో వాతావరణ మార్పులపై చర్చలు జరగనున్నాయి. దీనికి న్యూఢిల్లీ తరపున ప్రతినిధుల హజరుకాలేదు.
రెండో విడత నవంబర్ 19-20 తేదీలలో ఐరాస ఆధ్వర్యంలో జరిగే సమావేశాలకు మాత్రమే భారత ప్రతినిధుల హజరయ్యే అవకాశం కనిపిస్తోంది. మొదటి దశలో కేవలం అజర్ బైజాన్ ఎంపిక చేసిన దేశాల ప్రజల ప్రతినిధుల ప్రసంగాలు మాత్రమే ఉంటాయని న్యూఢిల్లిలోని అధికారులను ఉటంకిస్తూ మీడియా వార్తలు ప్రచురించారు.
మంత్రి హాజరు..
ఇది 29వ UN క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ (COP29). నవంబర్ 11 నుంచి 22 వరకు వార్షిక వాతావరణ శిఖరాగ్ర సమావేశం వాతావరణ మార్పులపై చర్య కోసం అత్యవసర నేపథ్యంలో ఏర్పాటు చేశారు. న్యూఢిల్లీ తరఫున కేంద్ర సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తో కూడిన 19 మంది సభ్యుల బృందం ఈ సమావేశానికి హాజరవుతారు. ప్రతినిధి బృందానికి కేంద్ర సహాయ మంత్రే నాయకత్వం వహిస్తారు. ఆయన కూడా రెండో విడతలో మాత్రమే దేశం తరఫున అధికారిక సమాచారం ఇస్తారు.
బాకులో భారతీయ దృక్పథం
వాతావరణానికి అత్యంత హాని కలిగించే దేశాలకు కొత్త వాతావరణ ఆర్థిక లక్ష్యాన్ని సాధించడంపై బాకు సమావేశం ఎక్కువగా దృష్టి సారించింది. బాకు సమావేశంలో భారత్ ఒక కొత్త కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ (NCQG)ని కోరుతుందని భావిస్తున్నారు. ఇది 2009లో అభివృద్ధి చెందిన దేశాలు చేసిన వార్షిక నిధి $100 బిలియన్లను 2020 నాటికి భర్తీ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల మంత్రి భూపేందర్ యాదవ్ గత సంవత్సరం దుబాయ్‌లో COP28 కు హాజరయ్యారు. ప్రారంభోత్సవంలో మోదీ మాట్లాడి దేశ లక్ష్యాలను వెల్లడించారు. కానీ ఈసారి ఆయన ఈ సమావేశాలకు దూరంగా ఉన్నారు.
భారతదేశం- వాతావరణ మార్పు
వాతావరణ మార్పుల వల్ల నష్టపోయిన దేశాలకు నిధులు సమకూర్చాలనే గ్లోబల్ క్లైమేట్ ఫైనాన్స్ ఫ్రేమ్‌వర్క్‌లను రూపొందించడంలో భారతదేశం కీలక పాత్ర పోషించింది. ఈ సమావేశంలో కూడా భారత్ దీనిపైనే ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది.
COP29 లో న్యూ ఢిల్లీ వైఖరి అభివృద్ధి చెందిన దేశాలను వారి వాతావరణ ఆర్థిక హమీలను నెరవేర్చడానికి ఒత్తిడి చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఇంధన వనరులను సమానంగా అందరికి దక్కేలా చేయడంపై భారత్ కొన్ని హమీలను పశ్చిమ దేశాల నుంచి పట్టుబట్టేలా కనిపిస్తోంది. వారు స్వయంగా నిర్ణయించుకున్న లక్ష్యాలను నెరవేర్చేలా కూడా భారత ప్రతినిధులు చర్చించే అవకాశం ఉంది.