శ్రీలంక పార్లమెంట్ ఎన్నికలలో దిసనాయకే ఎన్‌పీపీ ఘన విజయం

మొత్తం 225 స్థానాలకు గాను దిసానాయకే నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పవర్ 159 స్థానాలను గెలుచుకుంది.

Update: 2024-11-15 15:10 GMT

శ్రీలంక రాజకీయాల్లో కొత్త శకం మొదలైంది. శుక్రవారం (నవంబర్ 15) జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మార్క్సిస్ట్ నేత అనురా దిసనాయకే నేతృత్వంలోని ఎన్‌పీపీ మూడింట రెండొంతుల మెజారిటీతో చరిత్రాత్మక విజయం సాధించింది.

మొత్తం 225 స్థానాలకు గాను 159 సీట్లను దిసానాయకే వామపక్ష జనతా విముక్తి పెరమున (జేవీపీ-మద్దతుగల నేషనల్ పీపుల్స్ పవర్) గెలుచుకుంది. ఆశ్చర్యకర విషయమేమిటండే.. ఆ పార్టీకి మునుపటి పార్లమెంట్‌ ఎన్నికల్లో 3 సీట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం పోలైన ఓట్లలో NPP 61 శాతం ఓట్లను సాధించింది. పార్లమెంటులో సాధారణ మెజారిటీ కోసం అధికార పార్టీకి 113 సీట్లు రావాలి. అయితే ఎన్‌పీపీ అత్యధిక సీట్లు గెలుచుకుంది.

తీవ్ర వ్యతిరేకత..

ఫెడరల్ పార్టీగా ప్రసిద్ధి చెందిన ʼఇలంకై తమిళ్ అరసు కచ్చిʼ (ITAK) మొత్తం ఎనిమిది స్థానాలను గెలుచుకుని పార్లమెంటులో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీనికి విరుద్ధంగా మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే మద్దతు ఉన్న నేషనల్ డెమోక్రటిక్ పార్టీ, మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సే ఒకప్పుడు బలమైన SLPP వరుసగా 5, 3 స్థానాలకు పడిపోయాయి. మిగిలిన స్థానాలు చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు దక్కాయి.

మార్పు కోసం ఓటు వేశారు..

"ఓటర్లు ఈ సారి మార్పు కోరుకున్నారు. అందుకే భారీ స్థాయిలో మెజార్టీ వచ్చింది" అని కొలంబో నుంచి ఫెడరల్ రాజకీయ విశ్లేషకుడు కుసల్ పెరీరా పేర్కొన్నారు.

1978లో కొత్త రాజ్యాంగం ప్రవేశపెట్టినప్పటి నుంచి శ్రీలంకలో ఏ రాజకీయ పార్టీ కూడా మూడింట రెండు వంతుల మెజారిటీని సొంతంగా గెలుచుకోలేదు. అందుకే ఇది NPPకి దక్కిన అఖండ విజయం. 55 ఏళ్ల దిసానాయకే గురువారం ఓటు వేసిన తర్వాత "ఇది శ్రీలంకకు నిర్ణయాత్మక ఎన్నికలు" అని ప్రకటించారు.

అవుట్‌గోయింగ్ పార్లమెంట్‌లో కేవలం 3 సీట్లు మాత్రమే ఉన్న NPP విజయం తూర్పు తీరంలో తమిళులు అధికంగా ఉండే బట్టికలోవా మినహా అన్ని 22 నియోజకవర్గాల్లో అగ్రస్థానంలో నిలిచింది. అక్కడ ITAK మాత్రమే ఉన్నత స్థానంలో ఉంది.

NPC సింహళీయులు-మెజారిటీ ప్రాంతాలలో అధిక మెజారిటీలో ఉన్నా.. ద్వీపం ఉత్తర తూర్పున ఉన్న తమిళ ప్రాంతాలలో కూడా ఇది బాగా పనిచేసింది. ఎందుకంటే ఇది తమిళ వేర్పాటువాద యుద్ధం జరిగిన నేల.

తమిళులున్న ప్రాంతాల్లో మెరుగైన పనితీరు..

భారతీయ సంతతికి చెందిన తమిళ కార్మికులు ఎక్కువగా నివసించే దేశంలోని సెంట్రల్ టీ ప్లాంటేషన్ ప్రాంతాల్లో కూడా NPP మెరుగైన పనితీరు కనబరిచింది. ఎన్‌పీపీకి 61.56 శాతం ఓట్లు రాగా..ఎస్‌కెబీకి 17.66 శాతం ఓట్లు పడ్డాయి.

క్లీన్ స్వీప్..

NPP నినాదంతో మాజీ క్యాబినెట్ మంత్రులందరు ఓటమి పాలయ్యారు. అవినీతిని రూపుమాపడానికి, జాతీయ సయోధ్యను ప్రోత్సహించడానికి, దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి తమకు ఒకసారి అవకాశం ఇవ్వాలని NPP అభ్యర్థనను ఓటర్లు స్వాగతించారు. 2022లో అప్పటి అధ్యక్షుడు గోటబయ రాజపక్సను అధికారం నుంచి తొలగించేందుకు పెద్దఎత్తున తిరుగుబాటు జరిగింది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ప్రజలు అల్లాడిపోయారు. ఇప్పుడు ఓటర్లు కొత్త పార్టీకి అవకాశం ఇచ్చారు.

దిసనాయకే ముందు ఎన్నో సవాళ్లు..

గోటబయ తర్వాత శ్రీలంకకు విక్రమసింఘే నాయకత్వం వహించారు. ఆర్థిక సంక్షోభం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినా.. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) బెయిల్ అవుట్ తర్వాత ఆయన అనుసరించిన విధానాలు గందరగోళంలో పడ్డాయి. ఈ అసంతృప్తే మొదటగా ప్రెసిడెంట్ పదవికి దిసానాయకేను ఎంపిక చేసింది. అఖండ విజయం అందుకున్న కొత్త అధ్యక్షుడి ముందు చాలా సవాళ్లు ఉన్నాయని పీరీస్ పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెన్సీని రద్దు చేసి పార్లమెంటులో ఆధిపత్యాన్ని పునరుద్ధరిస్తానని దిసనాయకే వాగ్దానాన్ని పీరీస్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. 

Tags:    

Similar News