US WILDFIRE | లాస్‌ఏంజెల్స్‌లో కార్చిచ్చు..
ఐదుగురి మృతి, వెయ్యి భవంతులు అగ్నికి ఆహుతి;
అమెరికాలోని లాస్‌ఏంజెలెస్, కాలిఫోర్నియా ప్రాంతాల్లో కార్చిచ్చు సంభవించింది. తొలుత దక్షిణ కాలిఫోర్నియాలో అటవీప్రాంతంలో చెలరేగిన మంటలు లాస్ ఏంజిల్స్ నగరానికి వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. వెయ్యికి పైగా భవంతులు దగ్నమయ్యాయి. సుమారు 10వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హాలీవుడ్ నటులు, ప్రముఖులు నివాసం ఉండే పసిఫిక్ సాలేడ్స్‌కూ మంటలు వ్యాపించాయి. ఘటన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన ఇటలీ పర్యటన రద్దు చేసుకున్నారు. తిరిగి ఆయన వాషింగ్టన్ చేరుకుని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
మంటలను అదుపుచేస్తున్న అగ్నిమాపక సిబ్బంది..
ప్రస్తుతం 750 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే పనిలో ఉన్నారు. భారీ అగ్ని కీలలను చల్లార్చేందుకు హెలికాప్టర్ల ద్వారా నీటిని గాల్లో నుంచి వదులుతున్నారు. కాలిఫోర్నియా గవర్నర్ మరో 7,500 మంది అగ్నిమాపక సిబ్బందిని నియమించారు. క్షతగాత్రులను తరలించేందుకు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు.
స్కూళ్లు, షూటింగ్‌లు రద్దు..
అగ్ని ప్రమాదం నేపథ్యంలో లాస్ ఏంజిలిస్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్‌లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. డిస్నీ, యూనివర్సల్ స్టూడియోస్‌లో షూటింగ్‌లను నిలిపివేశారు.
కాలిపోయిన సెలబ్రిటీల ఇళ్లు ..
అతి వేగంగా వ్యాపించిన మంటల కారణంగా హాలీవుడ్ సెలబ్రిటీల ఇళ్లకు భారీ నష్టం వాటిల్లింది. ప్రముఖ నటుడు బిల్లీ క్రిస్టల్ తన 45 ఏళ్ల పాత ఇంటిని కోల్పోయారు. మాండీ మూర్, పారిస్ హిల్టన్, కేరీ ఎల్వెస్ వంటి ప్రముఖులు కూడా తమ ఇళ్లకు నష్టం జరిగినట్లు వెల్లడించారు.
భారీ నష్టం ..
ఇది లాస్ ఏంజిలిస్ చరిత్రలో అతిపెద్ద అగ్నిప్రమాదం. 27,000 ఎకరాలు మంటలు వ్యాపించాయి. నగరాన్ని పునర్నిర్మించేందుకు బిలియన్ల డాలర్ల ఖర్చు అవుతుందని అంచనా.