కైవ్‌ చేరుకున్న ప్రధాని మోదీ

‘యుద్ధభూమిలో ఏ సమస్యా పరిష్కారం కాదని భారత్ గట్టిగా నమ్ముతుంది’ - ప్రధాని మోదీ

Update: 2024-08-23 11:18 GMT

విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ పోలాండ్‌ను సందర్శించిన అనంతరం ఉక్రెయిన్ రాజధాని కైవ్ చేరుకున్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. గురువారం పోలాండ్ గడిపిన ప్రధాని శుక్రవారం పోలాండ్ నుంచి రైలు మార్గంలో కైవ్ చేరుకున్నారు. "ఈ ఉదయం ప్రధాని కైవ్‌ చేరుకున్నారు. భారతీయ సమాజం ఆయనకు సాదరంగా స్వాగతం పలికింది" అని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు.

"ప్రధాని మోదీ ఈ ఉదయం కైవ్ చేరుకున్నారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పాటైన తర్వాత భారత ప్రధాని ఉక్రెయిన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

"యుద్ధభూమిలో ఏ సమస్యా పరిష్కారం కాదని భారత్ గట్టిగా నమ్ముతుంది. రెండు దేశాల మధ్య దౌత్యానికి వచ్చాం. స్నేహపూర్వక దేశాలతో పాటు అన్ని విధాలుగా సాయం అందించడానికి భారత్ సిద్ధంగా ఉంది" అని వార్సాలో మోదీ మీడియాతో అన్నారు.

జీ7 సదస్సులో మోదీని ఆహ్మానించిన జెలెన్స్కీ ..

జూన్‌లో ఇటలీలోని అపులియాలో జీ7 సదస్సు సందర్భంగా జెలెన్స్కీతో మోదీ చర్చలు జరిపారు. ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారానికి మద్దతు ఇవ్వడానికి భారతదేశం చేయాల్సిందల్లా చేస్తుందని హామీ ఇచ్చారు. ఇదే సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కైవ్‌ను సందర్శించాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించారు. 

Tags:    

Similar News