ట్రంప్ మాటను లెక్కచేయని థాయ్- కంబోడియా

పరస్పరం కాల్పులకు దిగిన రెండు దేశాలు, అమెరికా శాంతి ప్రకటన చేసిన గంటల వ్యవధిలో ఘర్షణ ప్రారంభం;

Update: 2025-07-27 06:56 GMT
సరిహద్దులకు ఆయుధాలు తరలిస్తున్న కంబోడియా

ఆగ్నేయాసియా దేశాలయిన థాయిలాండ్- కంబోడియా మధ్య రాజుకున్న యద్దం ఆగినట్లే ఆగి మరోసారి ప్రారంభం అయింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు దేశాల నాయకులతో మాట్లాడి శాంతికి మధ్యవర్తిత్వం వహించినట్లు వార్తలు వచ్చిన కొన్ని గంటల తరువాత కంబోడియా- థాయిలాండ్ సైనికులు పరస్పరం కాల్పులు జరుపుకున్నారు.

కంబోడియాపై థాయి ఆరోపణలు..

ఆదివారం థాయ్ మీడియా సంస్థ ఖోసోడ్ నివేదిక ప్రకారం.. కంబోడియా దళాలు సురిన్ ప్రావిన్స్( రాష్ట్రం) టాక్వాయ్ ఆలయంలో సమీపంలో ఉన్న థాయ్ సైనికులే లక్ష్యంగా చేసుకుని కాల్పలు ప్రారంభించాయి.
తాజా దాడులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అనిశ్చితంగా మార్చాయి. ఎందుకంటే థాయిలాండ్ తాత్కాలిక ప్రధాని ఫుమ్తామ్ వెచాయాచీ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు, నమ్ పెన్(కంబోడియా రాజధాని) నిజాయితీని గమనిస్తుందని చెప్పారు.
జూలై 26న శనివారం నాడు థాయ్ విదేశాంగ మంత్రిత్వశాఖ కంబోడియాలో కాల్పుల విరమణకు సూత్రప్రాయంగా అంగీకరించిందని, ద్వైపాక్షిక చర్చలపై ఆసక్తిని వ్యక్తం చేసిందని తెలిపింది. ఈ తాజా కాల్పులు చర్చల ప్రక్రియకు విఘాతం కలిగించి సంఘర్షణను దీర్ఘకాలం కొనసాగేందుకు అవకాశం కల్పించింది.
ప్రస్తుతం యుద్దం జరుగుతున్న థాయ్- కంబోడియా సరిహద్దు వివాదం ఒక శతాబ్దానికి పైగా పాతది. ఫ్రెంచ్ కంబోడియాను ఆక్రమించిన తరువాత స్వాత్రంత్య్రం సమయంలో వారి సరిహద్దులు నిర్ణయించారు. ఈ వివాదం చాలాసార్లు చిలికిచిలికి గాలివానలా మారింది.
ఐరాసలో కంబోడియా రాయబారీ ఛియా కియో మాట్లాడుతూ.. నమ్ పెన్ బేషరుతుగా సంధి కోరిందని ఈ వివాదానికి శాంతియుత పరిష్కారం కనిపించాలని కోరుకుంటున్నట్లు దౌత్యవేత్తను ఉటంకిస్తూ ఏఎఫ్పీ నివేదించింది.
జూలై 24న ప్రారంభమైన ఈ ఘర్షణ రెండు వైపులా ఉన్న సరిహద్దుల ప్రాంతాలకు తీవ్ర నష్టం కలిగించింది. రెండు దేశాలలో 30 మందికి పైగా మరణించగా అందులో ఎక్కువ మంది పౌరులే ఉన్నారు. కంబోడియా, థాయ్ లాండ్ ఘర్షణ వలన సరిహద్దు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించడంతో దాదాపు పదివేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
ట్రంప్ ప్రవేశం..
శనివారం ట్రంప్ కంబోడియా, థాయిలాండ్ నాయకులతో చర్చలు జరిపినట్లు చెప్పారు. తన స్కాటిష్ గోల్ఫ్ కోర్సులను ప్రయివేట్ గా సందర్శించిన ఆయన ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు. ‘‘రెండు దేశాల వెంటనే కలుసుకుని త్వరగా కాల్పుల విరమణ కు చివరికి శాంతికి అంగీకరించాయి’’ అని తెలిపారు.
భారత్- పాకిస్తాన్ సహ అనేక వివాదాస్పద దేశాల మధ్య శాంతికి మధ్యవర్తిత్వం వహించినట్లు చెప్పుకునే రిపబ్లికన్.. బ్యాంకాక్- నమ్ పెన్ రెండింటితో వాణిజ్య చర్చలను తిరిగి ప్రారంభించడానికి ఎదురు చూస్తున్నానని, అయితే శత్రుత్వం ఆగిపోయే వరకూ చర్చలు జరపడం సరైనది కాదని వ్యాఖ్యానించారు. ఆగ్నేయాసియా దేశాలపై అమెరికా సుంకాలు అమలు చేయడానికి వారం ముందు ట్రంప్ ఈ వివాదంలో జోక్యం చేసుకున్నారు.

వివాదానికి తక్షణ కారణం..

కంబోడియా సరిహద్దులోని సురిన్ ప్రావిన్స్ లోని ఓ శివాలయం ఈ వివాదానికి తక్షణ కారణం. ఈ కట్టడాన్ని యునెస్కో గుర్తించింది. ఇక్కడ కంబోడియా సైనికులు కాపలా కాస్తున్నారు. చాలా రోజుల క్రితం థాయి సైనికులు అక్కడ ఉన్న ఖాళీ స్థలం మాదే అని క్లెయిమ్ చేసుకున్నారు. తరువాత గస్తీ కాస్తున్న థాయ్ సైనికులు ల్యాండ్ మైన్ పై కాలు వేయడంతో చనిపోయారు. ఇది చిలికి చిలికి గాలివాన మారింది.

ఈ వివాదంపై అంతర్జాతీయ కోర్టు కూడా కంబోడియాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ అది మాత్రం తన వాదనను కొనసాగిస్తోంది. అయితే యుద్దానికి దిగిన ఈ రెండు దేశాలు ప్రస్తుతం బౌద్ధ దేశాలు కావడం గమనార్హం.

Tags:    

Similar News