అమెరికా ఎఫ్ 35 స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాముఖ్యత ఏంటీ?

మూడు వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఎఫ్-35 లు, గంట ప్రయాణం చేస్తే 36 వేల డాలర్ల ఖర్చు;

Update: 2025-02-14 12:53 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని మోదీతో వైట్ హౌజ్ లో ద్వైపాక్షిక సమావేశం ముగిసిన తరువాత తన అమ్ముల పొదిలోని స్టెల్త్ ఫైటర్ జెట్ ఎఫ్ -35 ను అమ్ముతున్నామని స్వయంగా ట్రంప్ ప్రకటించారు.

ఈ జెట్ ఇటీవల బెంగళూర్ లో జరిగిన ‘ఏరో ఇండియా-2025’ ప్రదర్శనలో ఇది సత్తాను ప్రదర్శించింది. తరువాత ఈ ప్రకటన రావడంతో న్యూఢిల్లీలో ఆసక్తి రేపింది.

అమెరికన్ బీస్ట్ గా పిలవబడే కూడా పిలిచే ఈ ఎఫ్-35, టామ్ క్రూజ్ నటించిన ‘టాప్ గన్: మావెరిక్’(2022) వంటి సినిమాల్లో ఉపయోగించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన, శాశ్వతమైన, యుద్ద విమానంగా ప్రశంసించబడింది.
ఈ సంవత్సరం నుంచి భారత్ కు సైనిక అమ్మకాలను అనేక బిలియన్ డాలర్లను పెంచుతామని ట్రంప్ తెలిపారు. ఇంతకుముందు కేవలం నాటో దేశాలకు మాత్రమే విక్రయించే అనుమతులు ఉన్న ఎఫ్-35 ను నిబంధనలు సడలించి మరీ భారత్ కు విక్రయించడానికి మార్గం సుగమం చేస్తున్నామని కూడా ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు.
ఏమిటీ ఈ ఫైటర్ జెట్ ప్రత్యేకత..
ఇది ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్. సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణిస్తుంది. అలాగే ఆధునాతన ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సూట్, ఓపెన్ ఆర్కిటెక్చర్, ఇంకా సెన్సార్లు, అసాధారణమైన సమాచార మార్పిడి ఉంటుంది.
సుదూరంలోని లక్ష్యాలను తేలికగా గుర్తించి ఎదురుదాడిచేయగలదు. ఆకాశంలో దీనికి తిరుగులేదని కూడా చెప్పవచ్చు. దీనికి ఉన్న ఆధునాతన్ రాడార్ వ్యవస్థ, స్టెల్త్ లక్షణాలతో శత్రువుల కంటపడకుండా దాడి చేయగలదు.
దీని అర్థం ఏంటీ?
ఇది మొదటగా రెండు దేశాల మధ్య అపూర్వమైన రక్షణ సహకారానికి వేదికను ఏర్పాటు చేస్తుంది. మరింత లోతైన భాగస్వామ్యానికి మార్గం సుగమం చేస్తుంది. ఇప్పటి వరకూ ఎఫ్-35 ని విక్రయించడానికి అమెరికా నిరాకరించడానికి ఒక ప్రధాన కారణం. వాషింగ్టన్ తన స్టెల్త్ టెక్నాలజీని ఇతర దేశాలతో పంచుకోవడానికి అంగీకరించలేదు.
రష్యా- చైనా వైమానిక దళం నుంచి ఎదురువుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ఎఫ్ -35 పరిజ్ఞానాన్ని వేరే దేశాలతో పంచుకోవడానికి అమెరికా ఒప్పుకోలేదు. మరో వైపు రష్యా తో మనకున్న సన్నిహిత సంబంధాలను కూడా ఒక అడ్డంకిగా మారింది.
ఇప్పుడూ నాటో సభ్య దేశాలతో పాటు జపాన్, ఇజ్రాయెల్ వంటి అత్యంత సన్నిహిత దేశాలకు మాత్రమే వీటిని అమ్మింది. తాజాగా భారత్ కూడా ఈ క్లబ్ లో చేరబోతోంది. అయితే వీటి రాకతో రష్యాతో మనకున్న అనుబంధం క్లిష్టతరంగా మారే అవకాశం ఉంది.
లాక్ హీడ్ మార్టిన్ అభివృద్ది చేసిన ఎఫ్-35 ప్రపంచంలోనే అత్యంత ఆధునాతన ఫైటర్ జెట్ లలతో ఒకటి. ఇది చాలా ఖరీదైనది.
రాఫెల్ కంటే ఎఫ్-35 ఫైటర్ చాలా మంచిదా?
భారత వైమానికదళం ఇప్పటికే రాఫెల్ విమానాలను సేకరించింది. ఇవి 4.5 జనరేషన్ యుద్ద విమానాలు. ఇది చాలా యుద్దాల్లో తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. వీటి ధర దాదాపుగా 110 నుంచి 120 మిలియన్ల డాలర్లుగా ఉంది. అయినప్పటకీ వైమానిక దళం తక్షణ అవసరాల రీత్యా 36 యుద్ద విమానాలు మనం కొనుగోలు చేశాం
రాఫెల్ కంటే ఎఫ్-35 చాలా ఆధునాతమైనది. శత్రువుల రాడార్ లకు చిక్కదు. రెండు అణ్వస్త్రాలను మోసుకెళ్లగల సామర్థ్యం ఉంది. అలాగే దీని ఖర్చు కూడా చాలా ఎక్కువ.
ఎఫ్ -35 ధర ఎంత?
ఎఫ్ -35 లో మనకు మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మొదటిది ఎఫ్ -35 ఏ, సాంప్రదాయ టేకాఫ్, ల్యాండింగ్ కోసం రూపొందించారు. దీనిని ఎక్కువగా యూఎస్ వైమానిక దళం ఉపయోగిస్తుంది. దీని ధర 80 మిలియన్ డాలర్లు. 
ఎఫ్-35 బీ షార్ట్ టేకాఫ్, నిలువు ల్యాండింగ్ కోసం తయారు చేస్తారు. దీనిని మెరైన్ వెర్షన్ లో అందుబాటులో ఉంది. దీని ధర 115 మిలియన్ డాలర్లు. మూడో ఎఫ్-35 సీ ఇది నేవీ కోసం తయారు చేశారు. యుద్ద విమానాల క్యారియర్ ఆధారిత మోడల్. దీని ధర 110 మిలియన్ డాలర్లుగా నిర్ణయించారు.
భారత్ ముందున్న సవాళ్లు ఏంటీ?
ఈ విమానం ఒకసారి గాల్లోకి ఎగరాలంటే దాదాపు 36000 డాలర్లు ఖర్చు అవుతాయి. కాబట్టి దీని వాడుకోవడం చాలా ఖరీదైనది. కాబట్టి దీని అధిక ధర, నిర్వహణ ఖర్చు దేశానికి ఆర్థికంగా భారమే.
అలాగే మౌలిక సదుపాయాలు, శిక్షణ సమగ్రతతో పాటు ఎఫ్ -35 కి నిర్వహణ మౌలిక సదుపాయాలతో కీలకమైన నవీకరణలు, ప్రత్యేక పైలెట్ శిక్షణ అవసరం.భారత్ తన వైమానిక దళాన్ని ఆధునీకరించాలని భావిస్తున్నప్పటికీ చుట్టూ ఉన్న భౌగోళిక రాజకీయ ప్రభావాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అందుకోసం భారత్ 110 యుద్ద విమానాల ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు రక్షణ రంగ నిఫుణులు చెబుతున్న మాట.
Tags:    

Similar News