పాలస్తీనా ఇరకాటంలో రిషి సునాక్

ఇప్పటికే ఇంటా బయటా సమస్యలతో సతమతమవుతున్నసునాక్ ప్రభుత్వం మరొక ఇరకాటంలో పడ్డారు. అది పాలస్తీనా విషయంలో. అదేంటో చూడండి...

Update: 2024-03-03 07:09 GMT
రిషి సునాక్, బ్రిటన్ ప్రధాన మంత్రి

ప్రతి వారం ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్దంపై లండన్ లో నిరసన ప్రదర్శనలు చేసేందుకు అనుమతి ఇవ్వడాన్ని టోరీ పార్టీ మాజీ నేత లీ ఆండర్సన్  ఆరోపించారు.  లండన్ మేయర్  సాధిఖ్ ఖాన్ తన మతంపై పక్షపాత వైఖరితోనే ఇలా అనుమతి ఇస్తున్నారని లీ అండర్సన్ వాదన.  ఆండర్స స్   ఉత్తర ఇంగ్లండ్ లోని నాటింగ్ హామ్ షేర్, ఆష్ ఫీల్డ్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లండన్ లో గత వారం కూడా ఇస్లామిస్టులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇజ్రాయెల్, గాజాపై చేస్తున్న దాడులతో వేలాది మంది పిల్లలు, మహిళలు చనిపోతున్నారని వెంటనే యుద్ద విరమణ ప్రకటించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. దీనికెలా అనుమతిస్తారనేనది ఆయన ప్రశ్న.

పాలస్తీనాకు మద్ధతుగా..
ఇంగ్లండ్  సమాజం ఇజ్రాయెల్ యుద్దానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నది. అయితే రాజకీయ నాయకులు మాత్రం దీనిపై పెదవి విప్పడం లేదు. బ్రిటన్ మొత్తం జనాభాలో ముస్లింలు 4.3 మిలియన్లు ఉంటారని అంచన.. అంటే జనాభాలో వీరి వాటా 6.3 శాతం. లండన్ మేయర్ సాధిఖ్ ఖాన్ ముస్లిం కావడం వల్లే ఇక్కడ నిరసనలకు ఏకపక్షంగా అనుమతి ఇస్తున్నాడని లీ అండర్సన్ ఆరోపిస్తున్నాడు.
అక్టోబర్ 7 న హమాస్ జరిపిన దాడుల్లో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. మరో 250 మందిని బందీలుగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని సహ ఇతర రాజకీయ పక్షాలు దీనిని ఖండించాయి. ఆ తరువాత ఇజ్రాయెల్, హమాస్ పై దాడికి దిగింది. అయితే దాడుల్లో గాజా మొత్తం శిథిలమవుతోంది. వేలాది మంది అమాయకులు చనిపోతున్నారు. దీనిపై మాత్రం బ్రిటన్ ప్రధాని నోరు విప్పడం లేదు. దీనికి బాగా  వ్యతిరేక వ్యక్తమవుతూ ఉంది.ద
అధికారంలో ఉన్న కన్వర్జేటివ్ పార్టీ యూదు లాబీల నుంచి భారీ విరాళాలను అందుకుంటోంది. ముఖ్యంగా అధికార పార్టీ (టోరీ) సభ్యులకు వీరి మద్దతు పుష్కలంగా ఉంది. లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు యూన్ నివేదికలు చెబుతున్న, ప్రజలు కాల్పుల విరమణ కావాలని డిమాండ్ చేస్తున్న కూడా వీరు చలనం లేకుండా ఉన్నారు. ఐడీఎఫ్ దళాలు గాజాలో పాల్పడుతున్న అకృత్యాలపై ప్రిన్స్ విలియం సైతం ఆందోళన వ్యక్తం చేశారు. నిజానికి రాజకీయాలకు దూరంగా బ్రిటన్ రాజవంశం ఉంటుంది. కానీ గాజాలో జరుగుతున్న మానవహననం గురించి బకింగ్ హమ్ ప్యాలెస్ కూడా మాట్లాడటం ఇక్కడ గమనించాల్సిన విషయం.
సాధిక్ ఖాన్ పై జాత్యంహాకార వ్యాఖ్యలు చేసిన టోరీలు
లండన్ మేయర్ గా ఉన్న సాధిక్ ఖాన్ పై జాత్యంహకార వ్యాఖ్యలు కొత్తగా ఇప్పుడు పుట్టికొచ్చినవి కావు. 2016 లండన్ మేయర్ ఎన్నికల సందర్భంగా టోరి అభ్యర్థిగా ఉన్న జాక్ గోల్డ్ స్మిట్స్ నోరు పారేసుకున్నారు. సాధిక్ ను అతివాద భావాలు గల తీవ్ర వాద మద్ధతదారుడిగా అభివర్ణించారు. అయితే ఈ ఎన్నికల్లో విజయం అతడినే వరించింది. ఇలా రెండు సార్లు ఆయన లండన్ మేయర్ గా ఎన్నికయ్యాడు. సాధిక్ ఖాన్ ఎవరో కాదు. పాకిస్తాన్ మాజీ ప్రధాని భార్య జేమీమా ఖాన్ కు సోదరుడు.
లండన్ ఎన్నికల్లో జాక్ అనుసరించిన వ్యూహాలు చాలా వరకూ ముస్లింల ఓట్లను దూరం చేసింది. దీనిపై కన్వర్జేటీవ్ పార్టీకి చెందిన మహ్మద్ అమీన్ తన పార్టీకి చెందిన మ్యగజైన్ లో ఇలా రాసుకొచ్చారు." నేను జాక్ చేసిన ప్రచారం పట్ట దిగ్భాంతి చెందాను. చాలాసార్లు సాధిక్ పై చాలా అసహ్యమైన ఆరోపణలు చేశారు. " ఇది నాకు నచ్చలేదు. అందుకే నేను సాధిక్ కు ఓ వేశానని వెల్లడించారు. దీనిపై తన భార్యకూడా అసంతృప్తి వ్యక్తం చేసిందని అన్నారు. ఇంగ్లండ్ లోని మెజారీటి ముస్లింలు లేబర్ పక్షం వైపే ఉన్నారు.
ఉదాసీనంగా ఉన్న రిషి సునాక్ ప్రభుత్వం
సాజిద్ ఖాన్ పై అనుచిత వ్యాఖ్యాలు చేసిన లీ అండర్సన్ టోరి విప్ ను తొలగించింది. అయితే దీనికి గల కారణాలను మాత్రం కన్వర్జేటీవ్ పార్టీ వెల్లడించడం లేదు. మీడియా ఇస్లోమోఫోబియా పై ప్రశ్నిస్తే కూడా నోరు మెదపలేదు. అండర్సన్ వ్యాఖ్యలను కూడా అసలు ఆ పార్టీ పట్టించుకోలేదు కూడా. ఇస్లామోఫోబియా అనే పదం పై కూడా టోరీలు ఇష్టపడట్లేదు. ఇది ఇస్లాంలోని పలు కీలక అంశాలను విమర్శించడానికి కూడా వీలుఉండదని వారి అభిప్రాయపడుతున్నారు.
ఇదే అంశంపై డేవిడ్ కామెరూన్ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన టోరీ సయిదా వార్నీ మాట్లాడారు. సునక్ ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారి పట్ల స్పందించాలని కోరుతున్నారు.
భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్మన్ , ఆమె భర్త రేల్ యూదు జాతికి చెందిన వాడు. ఇతను అండర్సన్ కంటే ఒక అడుగు ముందే ఉన్నాడు. లండన్ లోని నిరసనకారుల ర్యాలీలను ‘ ప్రమాదకర సెమిట్ వ్యతిరేక గుంపులు’ గా అభివర్ణించాడు. అలాగే సునక్ కూడా ఈ నిరసన కారులకు వ్యతిరేకంగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. " యూకే మాబ్ రూల్ దిగుతోంది. ప్రజాస్వామ్య పాలన గల దేశంలో స్వేచ్చను అరికట్టాడానికి హింస, బెదిరింపులను ఆధారంగా కొన్ని సమూహాలు ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల ప్రతినిధుల చర్చలను ఆపడానికి కుట్రలు పన్నుతున్నారు" అని పాలస్తీనా అనుకూలంగా ర్యాలీలు తీస్తున్న వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
అయితే సునక్ వ్యాఖ్యాలను ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఖండించింది. ఈ సంస్థకు చెందిన టామ్ సౌథర్ డెన్ మాట్లాడుతూ.. " సునక్ వ్యాఖ్యాలు విపరీతంగా అతిశయోక్తి" తో ఉన్నాయని అభిప్రాయపడ్డారు. శాంతియుత నిరసనలను కూడా చట్టవిరుద్దంగా చేసేందుకు ఇదోక ప్రయత్నంగా పేర్కొన్నారు. పాలస్తీనా స్వేచ్చ కోసం శాంతియుత నిరసనలు జరుగుతున్నాయని, వీటిని ఇజ్రాయెల్ అనుకూల స్థాపన సెమిటిక్ వ్యాఖ్యాలని పరిగణించారు.
పాలస్తీనా మార్చ్ ల కారణంగా యూదు ప్రజలు భయంతో జీవిస్తున్నారని బ్రేవర్మన్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్- పాలస్తీనా వివాదం మొదలయ్యాక లండన్ లో మాత్రం ఇస్లామోఫోబియా సంఘటనల సంఖ్య విపరీతంగా పెరిగిందని ఇటీవలి గణాంకాలు సూచిస్తున్నాయి. ఇస్లామోఫోబియా రెస్పాన్స్ యూనిట్ లండన్ స్వచ్చంద సంస్థ కొన్ని వివరాలు విడుదల చేసింది. దీని ప్రకారం అక్టోబర్ ఏడు తరువాత బ్రిటన్ లో ఇస్లామోఫోబియా సంఘటనలు 365 శాతం పెరిగిందని వివరించింది. టెల్ మామా అనే ముస్లిం వ్యతిరేక సంఘటనలను రికార్డ్ చేసే మరో సంస్థ ప్రకారం అక్టోబర్ 7,2023 నుంచి ఫిబ్రవరి 7, 2024 వరకు మధ్య 2010 సంఘటనలు జరిగినట్లు తెలిపింది. ఇంతకుముందు ఇదే సమయంలో 600 సంఘటనలు జరిగినట్లు వివరించింది.
ఇలా అండర్సన్, బ్రేవర్మన్ లు చేస్తున్న ఇస్లామోఫోబియా వ్యాఖ్యలు లండన్ లో నివసిస్తున్న సాధారణ ముస్లిం సమాజం భయపడేలా చేస్తున్నాయి.


Tags:    

Similar News