మలేషియా కే.ఎల్ టవర్ ముందు ప్రపంచ చేనేత దినోత్సవ ప్రతిజ్ఞ

ప్రపంచ చేనేత రంగానికి తిరిగి పూర్వ వైభవం తీసుకొస్తామని ప్రపంచ చేనేత దినోత్సవ వ్యవస్థాపకులు యార్ర వెంకన్న నేత ఆధ్వర్యంలోని బృందం ప్రతినబూసింది.;

Update: 2024-02-28 04:21 GMT

చేనేత దినోత్సవ వ్యవస్థాపకులు యర్రమాద వెంకన్న నేత ఆధ్వర్యంలో ప్రపంచ చేనేత దినోత్సవ లక్ష్యంగా సాగిన మూడు దేశాల పర్యటనలో మలేషియాలోని కౌలంపూర్ కె.ఎల్ టవర్ ముందు ప్రపంచ చేనేత దినోత్సవ ప్రతిజ్ఞ జరిగింది. We Support World Handloom Day, Kuala Lumpur, Malaysia బ్యానర్ ను చేనేత ప్రతినిధి బృందం ప్రదర్శించింది.



 

వరల్డ్ హ్యాండ్లూమ్ డే సాధిద్దామని, సాధించే వరకు పోరాడుదామని నినదించారు. చేనేతల నినాదాలు అక్కడివారిని ఆకట్టుకున్నాయి. ఏం జరుగుతోందని ఆసక్తిగా తిలకించి, అక్కడివారు వివరాలు తెలుసుకున్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలు, జాతీయ అవార్డు గ్రహీతలు, చేనేత కళాకారులు, చేనేత మద్దతుదారులు మరియు చేనేత అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో కార్యక్రమానికి వన్నెవచ్చింది.


Tags:    

Similar News