కాంగ్రెస్ హిందువులను హింసించింది: ప్రజ్ఞా ఠాకూర్

నరేంద్ర మోదీ, యోగీ ఆదిత్యనాథ్, మోహన్ భాగవత్, రామ్ మాధవ్ పేర్లు చెప్పాలని హింసించారు;

Update: 2025-08-03 12:45 GMT
సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్

మహారాష్ట్రలోని మాలేగావ్ లో 2008 లో జరిగిన పేలుళ్ల కేసులో కాంగ్రెస్ పార్టీ హిందువులను హింసించి, ముస్లింలను సంతృప్తి పరిచిందని బీజేపీ మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రోజులు ఇదే తరహాలో వ్యవహరించిందిన విరుచుకుపడ్డారు. మధ్యప్రదేశ్ రాజధాని బోఫాల్ వచ్చిన తరువాత ఆమెకు ఘన స్వాగతం లభించింది.

‘‘కాంగ్రెస్ ఎల్లప్పుడూ ముస్లింలను బుజ్జగించే రాజకీయాలను అవలంభించింది. వారు తమ పాలనలో దీనిని ఉపయోగించుకున్నారు. వారు హిందువులను అన్ని విధాలుగా హింసించారు. వారిని జైలులో పెట్టారు.
తప్పుడు కేసులు బనాయించారు. కాషాయ ఉగ్రవాదం అని ప్రచారం చేశారు. హిందూత్వ ఉగ్రవాదమని అవమానించారు. ఇది కాంగ్రెస్ కుట్ర, ఇది దేశం ద్రోహానికి అర్హత సాధించిన కేసు’’ అని సాధ్వి ఠాకూర్ విమర్శించారు. మాలేగావ్ పేలుళ్లు జరిగినప్పుడు కేంద్రంలో యూపీఏ, మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలో ఉంది.
ముంబై పోలీస్ కమిషనర్ పై విమర్శలు..
పేలుడు కేసును దర్యాప్తు చేస్తున్న మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ లో భాగమైన ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ ను కూడా ఆమె తీవ్రంగా విమర్శించారు.
అతన్ని ‘‘భయంకరమైన వ్యక్తి’’ అని అభివర్ణించారు. చట్టానికి వెలుపల నన్ను తీవ్రంగా హింసించాడని చెప్పారు. పరంబీర్ సింగ్ మాత్రమే కాకుండా ఏటీఎస్ అధికారులు కూడా తనను తీవ్రంగా హింసించినట్లు వివరించారు.
2019 లో లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ ను ఓడించిన ఠాకూర్ గత ఏడాది పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ సాధించలేకపోయారు. కొన్ని సార్లు సాధ్వి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి.
బీజేపీ నాయకులు పేర్లు చెప్పమన్నారు
దర్యాప్తు సమయంలో మోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ సహ ఇతర నాయకుల పేర్లను చెప్పమని తనను బలవంతం చేశారని ఠాకూర్ చెప్పారు.
‘‘నేను ఇంతకుముందు కూడా చెప్పాను. వారు నన్ను బలవంతంగా పెద్ద నాయకుల పేర్లు చెప్పాలని బలవంతం చేశారు. నేను వారి పేర్లు చెప్పలేదు. వారు కోరుకున్న విధంగా నేను ప్రవర్శించలేదు. కాబట్టి వారు నన్ను హింసించారు.
ఆ పేర్లలో మోహన్ భాగవత్, రామ్ మాధవ్, ప్రధాని మోదీ, యోగీ ఆదిత్యనాథ్, ఇంద్రేష్ కుమార్ వంటి నాయకులు ఉన్నారు’’ అని ఆమె వివరించారు. గురువారం కేసును విచారించిన ముంబైలోని ప్రత్యేక కోర్టు ఏడుగురు నిందితులపై ఆధారాలు లేవంటూ కేసును కొట్టివేసింది. వారిని నిర్ధోషులుగా ప్రకటించి విడుదల చేసింది.
సెప్టెంబర్ 29, 2008 న ముంబై నుంచి 280 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాలేగావ్ పట్టణంలో ఒక మసీద్ సమీపంలో మోటార్ సైకిల్ లో అమర్చిన బాంబ్ బ్లాస్ట్ అయింది. ఇందులో ఆరుగురు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఇందులో మొదట ఓ వర్గం వారిని అనుమానితులుగా చేర్చారు. కానీ తరువాత హిందూ ఉగ్రవాదం అని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఈ కేసును కోర్టు కొట్టివేసింది.
Tags:    

Similar News