ఈసీ, బీజేపీ ఓట్లు చోరీ చేస్తున్నాయి: రాహుల్ గాంధీ

ఎన్నికల డేటాను తమకివ్వాలని డిమాండ్ చేసిన ప్రతిపక్షనేత;

Update: 2025-08-07 12:12 GMT
రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ ఈసీ చేస్తున్న ఓట్ల చోరీకి సంబంధించిన కచ్చితమైన ఆధారాలను సేకరించిందని లోక్ సభలో ప్రతిపక్ష పార్టీ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈసీ, బీజేపీ రెండు కుమ్మక్కు అయ్యాయని అన్నారు. న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ.. 2024 సార్వత్రిక ఎన్నికల నుంచి కర్ణాటకలోని ఒక లోక్ సభ నియోజకవర్గం నుంచి వచ్చిన డేటా విశ్లేషణను ఉదహరించారు.

గత 10-15 సంవత్సరాల మెషిన్- రీడబుల్ డేటా సీసీటీవీ ఫుటేజీలను మాకు ఈసీ ఇవ్వకపోతే వారు నేరంలో పాలుపంచుకున్నట్లే అని రాహుల్ గాంధీ అన్నారు.
ఓటర్ డేటా విశ్లేషణ..
‘‘మనం ఎంతో ఇష్టపడే ప్రజాస్వామ్యం ఉనికిలో లేనందున న్యాయ వ్యవస్థ ఇందులో జోక్యం చేసుకోవాలి’’ అని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అన్నారు. ఆన్ లైన్ ప్రజెంటేషన్ ద్వారా మీడియాతో మాట్లాడిన రాహుల్ 2024 లోక్ సభ ఎన్నికల నుంచి బెంగళూర్ సెంట్రల్ లోక్ సభ నియోజకవర్గం, మహదేవరపుర అసెంబ్లీ సెగ్మెంట్ ఓటర్ల డేటాను విశ్లేషించామని చెప్పారు.
మొత్తం లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ కు 6,26,208 ఓట్లు రాగా, బీజేపీకి 6,58,915 ఓట్లు వచ్చాయని బీజేపీ 32,707 ఓట్ల తేడాతో గెలిచిందన్నారు. కాంగ్రెస్ ఏడు సెగ్మంట్ లో ఆరు సెగ్మంట్ లో ఆధిక్యం సంపాదించినప్పటికీ మహదేవర అసెంబ్లీ సెగ్మంట్ లో మాత్రం 1,14,000 వేల ఓట్లు కేవలం బీజేపీకి పడినట్లు రాహుల్ చెప్పారు.
మహదేవరపుర నియోజకవర్గంలో 1,00,250 ఓట్ల చోరీ జరిగిందని అన్నారు. ఒక అసెంబ్లీ సెగ్మంట్ లో 11,965 మంది నకిలీ ఓటర్లు, నకిలీ చిరునామాలతో 40,009 మంది ఓటర్లు, 10,452 మంది బల్క్ ఓటర్లు లేదా సింగల్ అడ్రస్ ఓటర్లు, చెల్లని ఫొటోలు కలిగిన 4, 132 మంది ఓటర్లు, 33, 692 మంది ఓటర్లు కొత్త ఓటర్ల ఫారం 6ను దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు. దేశ వ్యాప్తంగా ఇలాంటివన్నీ జరుగుతున్నాయని, ఇది భారత రాజ్యాంగం, భారత జెండాకు వ్యతిరేకంగా జరిగిన నేరమన్నారు.
ఎన్నికలను రక్షించే పనిలో కాంగ్రెస్ ఉందని ఈసీకి గుర్తు చేయాలనుకుంటుందని ఆయన అన్నారు. బీజేపీ 33,000 కంటే తక్కువ ఓట్లతో 25 లోక్ సభ స్థానాలను గెలుచుకుంది’ అని ఆరోపించారు.
నరేంద్ర మోదీ స్వల్ఫ మెజారిటీతో ప్రధానమంత్రి అని, అధికారంలో కొనసాగడానికి కేవలం 25 సీట్లను మాత్రమే దొంగలించాలని అనుకున్నారని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 33 వేల కంటే తక్కువ మెజారిటీతో 25 సీట్లు గెలుచుకుందని రాహుల్ అన్నారు. ఒక వ్యక్తికి ఒక ఓటు లభిస్తుందనే వాస్తవంపై మన రాజ్యాంగం పునాది ఆధారపడి ఉందని ఆయన పేర్కొన్నారు.
‘‘మనం పోల్స్ ను చూసినప్పుడు ఒక మనిషి ఒక ఓటు ఆలోచనను ఎలా పొందాలనేది ప్రాథమిక విషయం. సరైన వ్యక్తులు ఓటు వేయడానికి అనుమతించారా? నకిలీ వ్యక్తులను చేర్చుతున్నారా? ఓటర్ జాబితా నిజామా కాదా? ’’ అని రాహుల్ ప్రశ్నించారు.
‘‘ కొంతకాలంగా ప్రజల్లో అనుమానం ఉంది. ప్రతిపార్టీలోనూ ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. కానీ ప్రజాస్వామ్య చట్రంలో ప్రభుత్వ వ్యతిరేకతలో బాధపడని ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే’’ అని ఆయన అన్నారు.
ఎగ్జిట్ పోల్స్ పై రాహుల్
దేశంలో ఎగ్జిట్ పోల్స్ భారీగా తప్పుగా పోతున్నాయని, అంతర్గత సర్వేలు కూడా అలాగే ఉన్నాయని ఆయన అన్నారు. గతంలో సాంకేతికతతో దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించేవారని, ఈ రోజుల్లో ఎన్నికలు నెలరోజులు అవుతున్నాయని రాహుల్ ఆరోపించారు.
‘‘మెషీన్ రీ డబుల్ ఓటరు జాబితాను ఇవ్వకపోవడం, చట్టాన్ని మార్చడం ద్వారా సీసీటీవీ పుటేజ్ ను అనుమతించకపోవడం వలన ఎన్నికలను దొంగిలించడానికి ఈసీ బీజేపీతో కుమ్మక్కైంది’’ అని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఓట్లు చోరీ చేసి ఆధారాలను నాశనం చేయాలని ఈసీ చూస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
Tags:    

Similar News