ఆప్ ప్రభుత్వం ఖజానాను ఖాళీగా అప్పగించింది: రేఖా గుప్తా
కుంటిసాకులు చెప్పొద్దన్న మాజీ సీఎం అతిశీ;
By : The Federal
Update: 2025-02-24 10:15 GMT
ఎన్నికల్లో హమీ ఇచ్చినట్లుగా బీజేపీ ప్రభుత్వం మహిళలకు నెలకు రూ. 2500 కచ్చితంగా అందజేస్తామని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చెప్పారు. అయితే ఇంతకుముందు దేశ రాజధానిని పాలించిన ఆప్ ప్రభుత్వం ఖజానాను ఖాళీగా తమకు అప్పజెప్పిందని, వాటిని ప్రస్తుతం సరి చేస్తున్నామని ఆమె అన్నారు.
అయితే ఈ వాదనలను ఢిల్లీ మాజీ సీఎం అతిషీ ఖండించారు. తాము ఆర్థికంగా బలమైన ఢిల్లీనే ప్రస్తుత అధికారంలోకి వచ్చిన వారికి అందజేశామని అన్నారు. కుంటిసాకులు చెప్పే బదులు వాగ్థానాలను నెరవేర్చడం పై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.
ఖజానా ఖాళీ..
ఢిల్లీలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీఎం రేఖా గుప్తా ఇతర బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి సమావేశం అయ్యారు. సమావేశం తరువాత విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఢిల్లీలోని అర్హులైన మహిళలకు నెలకు రూ. 2500 చెల్లించాల్సిన మహిళా సమృద్ధి యోజన అమలుపై అధికారులతో అనేక దశల సమావేశాలు జరిగాయని చెప్పారు.
‘‘మునుపటి ప్రభుత్వం ఖాళీ ఖజానను మాకు అప్పగించింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని సమీక్షించడానికి మేము అధికారులతో కలిసి కూర్చున్నప్పుడూ ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉన్నట్లు కనుగొన్నాము’’ అని మహిళా సమృద్ధి యోజన అమలుపై అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా సీఎం చెప్పారు.
వివరణాత్మక ప్రణాళిక
అయితే ఈ పథకాన్ని వివరణాత్మక ప్రణాళికతో అమలు చేస్తామని సీఎం హమీ ఇచ్చారు. ఢిల్లిని అభివృద్ధి చెందిన ప్రాంతంగా చేయడం, ప్రజల సమస్యలను పరిష్కరించడం మాత్రమే బీజేపీ ప్రభుత్వ ఏకైక ఎజెండా అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవ్ అన్నారు.
1996 తరువాత బీజేపీ తిరిగి ఇక్కడ అధికారంలోకి రాగలిగింది. అంతకుముందు వరుసగా మూడు సార్లు షీలా దీక్షిత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారం చలాయించగా తరువాత 11 సంవత్సరాలు ఆమ్ ఆద్మీ పార్టీ పీఠం మీద ఉంది. మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లను గెలుచుకోగా, ఆప్ కేవలం 22 స్థానాలకే పరిమితం అయింది.
కావాలనే ఇవ్వడం లేదు..
2015 లో తాము అధికారంలో వచ్చేనాటికి ఢిల్లీ బడ్జెట్ కేవలం 30 వేల కోట్లని, ఇప్పడు అది 77 వేల కోట్లకు చేర్చామని అన్నారు. ‘‘బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన క్షణం నుంచి దాని హమీలు, వాగ్థానాలను నెరవేర్చకుండా ఉండటానికి అది సాకులు చెప్పడం ప్రారంభిస్తుందని నేను ఊహించాను’’ అని విమర్శలు గుప్పించారు.
ఢిల్లీ ప్రజలు ఆలస్యం కాదు.. ఇంటికి సేవలు ఆశిస్తున్నారు. కాషాయ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలు వదులుకోవడానికి మార్గాలను వెతుకుతోందని ఆరోపించారు.