పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు హతం?

శ్రీనగర్ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్, ఆపరేషన్ మహాదేవ్ కొనసాగుతుందన్న సైన్యం;

Update: 2025-07-28 11:12 GMT
సైన్యం

పహల్గామ్ లో ఉన్న అమాయక టూరిస్టులలో హిందువులని గుర్తించి, ప్యాంట్లు విప్పి చూసి మరీ భార్యల ముందు భర్తలను చంపిన ఇస్లామిక్ ఉగ్రవాదులు హతం అయ్యారు. జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ సమీపంలోని అడవుల్లో దాక్కున్న ఉగ్రవాదులను భద్రతా దళాలు గుర్తించి మట్టుబెట్టినట్లు జాతీయ మీడియా వార్తలు ప్రసారం చేసింది. ఉగ్రవాదులను వేటాడానికి ప్రారంభించిన ఆపరేషన్ మహాదేవ్ ఇంకా కొనసాగుతోందని సైన్యంలోని చినార్ కార్ప్స్ ఎక్స్ లో వెల్లడించింది.

మరణించిన ఉగ్రవాదుల్లో పహల్గామ్ ఉగ్రవాద దాడికి కీలక సూత్రధారిగా భావిస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాదీ సులేమాన్ షా అలియాస్ ముసా మరణించిన వారిలో ఉన్నాడని మీడియా నివేదికలు తెలిపాయి.
చనిపోయిన మిగిలిన ఉగ్రవాదులు అబు హమ్జా, యాసిర్ అని తెలుస్తోంది. అయితే ఈ ఉగ్రవాదుల మృతిని అధికారికంగా సైన్యం, ప్రభుత్వం ధృవీకరించలేదు. చనిపోయిన ఉగ్రవాదుల ఫొటోలు మాత్రం బయటకు వచ్చాయి.
ఆపరేషన్ కొనసాగుతోంది
ఆపరేషన్ మహాదేవ్ కొనసాగుతోంది. శ్రీనగర్ పరిసరాల్లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆపరేషన్ కొనసాగుతోంది. #kashmir@adgpi@Northerncomd-IA’’ అని ఆర్మీ చినార్ కార్ప్స్ పేర్కొంది.
‘‘ఓపీ మహాదేవ్. జనరల్ ఏరియా లిడ్వాస్ లో సంప్రదింపులు ఏర్పడ్డాయి. ఆపరేషన్ లో పురోగతిలో ఉంది’’అని ప్రారంభంలో పేర్కొంది. ఈ రోజు తెల్లవారుజామున దచిగామ్ జాతీయ ఉద్యానవనం సమీపంలోని హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా దళాలు మధ్య ఎన్ కౌంటర్ జరిగిందని అధికారులు తెలిపారు.
ఇంటెలిజెన్స్ ఇన్ పుట్
నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతా దళాలు హర్వాన్ లోని ముల్నార్ ప్రాంతంలో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ ప్రారంభించాయని వారు తెలిపారు. భద్రతా సిబ్బంది సోదాలు నిర్వహిస్తుండగా దూరం నుంచి రెండు రౌండ్ల కాల్పుల శబ్ధాలు వినిపించాయని అధికారులు తెలిపారు.
ఆ ప్రాంతానికి అదనపు బలగాలు తరలించామని ఉగ్రవాదులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశామని వారు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో చిక్కుకున్నట్లు భావిస్తున్నారు.
కచ్చితంగా తెలియదు..
ఏప్రిల్ 22న జరిగిన దాడిలో హతమైన ముగ్గురు ఉగ్రవాదుల ప్రమేయం ఉందా లేదా అని ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతా దళాలు సోమవారం ఉదయం హర్వాన్ లోని ముల్నార్ ప్రాంతంలో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ ప్రారంభించాయి. భద్రతా దళాలు ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తుండగా దూరం నుంచి కాల్పులు వినిపించడమే ఎన్ కౌంటర్ కు కారణమయ్యాయి.
Tags:    

Similar News