ఉరి సెక్టార్ వద్ద ఉగ్రవాదులను కాల్చిచంపిన సైన్యం

దేశంలోకి చొరబాడటానికి ప్రయత్నించిన ఇస్లామిక్ ఉగ్రవాదులు, కొనసాగుతున్న కాల్పులు;

Translated by :  Chepyala Praveen
Update: 2025-04-23 06:27 GMT
ఉరిలో గస్తీ కాస్తున్న సైన్యం

భారత్- పాక్ సరిహద్దులోని నియంత్రణ రేఖ వద్ద చొరబడటానికి ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం కాల్చి చంపింది. ‘‘ఉత్తర కాశ్మీర్ లోని ఉరి సైనిక శిబిరానికి దగ్గర ఉన్న నాలా వద్ద జనరల్ ఏరియా సర్జీవన్ గుండా 2-3 ఉగ్రవాదులు చొరబడటానికి ప్రయత్నించారు’’ అని చినార్ కార్ప్స్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ సంఘటన ఏప్రిల్ 23 న జరిగినట్లు సైన్యం ప్రకటించింది.

చొరబాటును గుర్తించిన భారత సైన్యం అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో కాల్పులు జరిగాయని అందులో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయినట్లు తెలిపింది. ‘‘ఉరి సెక్టార్ లో కొనసాగుతున్న చొరబాటు నిరోధక ఆపరేషన్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు’’ అని అధికారులు తెలిపారు.
ఆపరేషన్ కొనసాగుతున్నట్లు భారీగా కాల్పులు జరుగుతున్నాయని తెలుస్తోంది. దక్షిణ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో హిందువులపై మారణకాండ జరిపిన ఇస్లామిక్ ఉగ్రవాదులు మరోసారి దేశంలోకి చొరబడటానికి ప్రయత్నించడం, వారిని సైన్యం కాల్చి చంపడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.

జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో అమాయక హిందూ టూరిస్టులపై ఇస్లామిక్ ఉగ్రవాదులు కాల్పులు జరిపి 28 మందిని చంపిన సంగతి తెలిసిందే. హోంమంత్రి అమిత్ షా జమ్మూకాశ్మీర్ చేరుకుని బాధితులన పరామర్శించి, మృతులకు అంజలి ఘటించారు. మరో వైపు ప్రధాని మోదీ కూడా అత్యున్నత స్థాయి భదత్రా మీటింగ్ నిర్వహించారు. ఇందులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పాటు కీలక అధికారులు పాల్గొన్నారు.  




Tags:    

Similar News