పార్లమెంట్ నుంచి పహల్గాం వరకూ దాడులకు పాల్పడ్డారు: భారత్

సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించిన విదేశాంగ, రక్షణ శాఖ. ఆపరేషన్ సింధూర్ వివరాలు వెల్లడి;

Update: 2025-05-07 05:45 GMT
విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ

పార్లమెంట్ నుంచి పహల్గాం వరకూ దేశంలో అనేక ప్రాంతాల్లో దాడుల వెనక పాక్ ఉందని చేసిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ దాయాదీ పై నిప్పులు చెరిగారు.

పాక్ లో శిక్షణ పొంది భారత్ లో అమాయకుల పై దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులను ఆట కట్టించడానికే తాము దాడులు చేసినట్లు ఆయన తెలిపారు. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడంలో ఐరాస విఫలమయిందని ఆయన ఆరోపించారు. అందుకే తాము స్వయంగా ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టినట్లు వివరించారు.  

ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన విషయంపై రక్షణ, విదేశాంగ శాఖ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించాయి. ఆయనతో పాటు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కర్నల్ సోఫియా ఖురేషీ మీడియాతో మాట్లాడారు.
మీడియా సమావేశానికి ప్రారంభానికి ముందు దేశంలో జరిగిన వివిధ ఉగ్రవాద ఘటనలను వీడియో రూపంలో ప్రదర్శించారు. ఇందులో అక్షర్ ధామ్, ముంబాయి దాడులు, పహల్గామ్ దాడులకు సంబంధించిన దృశ్యాలను చూపారు. ఉగ్రవాద దాడులపై ఇండియా చూస్తూ ఊరుకోదని స్పష్టంగా సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు.
పహల్గామ్ ఘటన వెనక పాకిస్తాన్ ఉందని, దానికి తగిన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఇందులో 26 మంది పర్యాటకులు చనిపోయారని, ఇందులో భారతీయులు 25 మంది ఉన్నారని చెప్పారు.
ఈ ఉగ్రవాద దాడికి టీఆర్ఎఫ్ బాధ్యత తీసుకుందని, దాడికి పాల్పడిన ఉగ్రవాదులను గుర్తించినట్లు తెలిపారు. అయితే ఉగ్రవాదులపై పాక్ ఎలాంచి చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు. టీఆర్ఎస్ నిషేధిత లష్కర్ ఏ తోయిబాకు చెందిందని, ఈ దేశంలోనే జైష్ ఏ మహ్మద్ కూడా ఉన్నాయని చెప్పారు. 
జమ్మూకాశ్మీర్ తో పాటు దేశంలో మత ఉద్రిక్తతలు రేపేందుకు ప్రయత్నించారని అన్నారు. గత ఏడాది కాశ్మీర్ వ్యాలీకి రెండు మిలియన్ల మంది పర్యాటకులు వచ్చారని, ఇక్కడి ప్రశాంతతను భగ్నం చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే పర్యాటకులను వారి కుటుంబ సభ్యుల ముందే కాల్చి చంపారని అన్నారు.
ఉగ్రవాద దాడులను అరికట్టేందుకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పాటు, పాక్ లో రాత్రి దాడులు చేసినట్లు చెప్పారు. ఈ దాడుల్లో ఎక్కడ పాక్ మిలటరీ, పౌర ఆవాసాలను లక్ష్యంగా చేసుకోలేదని వివరించారు. కేవలం ఉగ్రవాదుల స్థావరాలు, వారి మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పారు.
Tags:    

Similar News