నాలుగు వందల కోట్ల పన్నులు చెల్లించిన అయోధ్య రామాలయం

ఐదు సంవత్సరాలలో పది రెట్లు పెరిగిన భక్తులు;

Update: 2025-03-17 05:28 GMT

అయోధ్య లో నిర్మితమైన రామాలయానికి భక్తుల తాకిడి పెరగడం, తద్వారా ఆదాయం కూడా రావడంతో గత ఐదు సంవత్సరాలలో ప్రభుత్వానికి సుమారు రూ. 400 కోట్ల పన్నులు చెల్లించినట్లు ట్రస్ట్ కార్యదర్శి చంపయ్ రాయ్ ఆదివారం మీడియాకు తెలిపారు. ఈ మొత్తం ఫిబ్రవరి 5, 2020 నుంచి ఫిబ్రవరి 5, 2025 మధ్య చెల్లించినట్లు ఆయన వెల్లడించారు.

ఈ మొత్తం పన్నులలో రూ. 270 కోట్లు వస్తుసేవల పన్ను(జీఎస్టీ) రూపంలో కాగా మిగిలిన రూ. 130 కోట్లను వివిధ పన్ను విభాగాల కింద చెల్లించినట్లు ఆయన తెలిపారు.
అయోధ్యలో భక్తులు, పర్యాటకులు పది రెట్లు పెరిగారని, దీనిని ఒక ప్రధాన మత పర్యాటక కేంద్రంగా మార్చారని, స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభ్యం అవుతున్నాయని చెప్పారు. 144 సంవత్సరాల తరువాత వచ్చిన మహాకుంభమేళ సందర్భంగా దాదాపు 1.26 కోట్ల మంది భక్తులు అయోధ్య బాలరాముడిని దర్శించుకున్నారని ఆయన తెలిపారు.
గత సంవత్సరంలో అయోధ్యకు 16 కోట్ల మంది భక్తులు వచ్చారని, వీరిలో 5 కోట్ల మంది రామాలయాన్ని సందర్శించినట్లు చెప్పారు. ట్రస్ట్ కు సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలను నిత్యం కంప్ట్రోటర్ అండ్ ఆడిటర్ జనరల్ క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది.


Tags:    

Similar News