అప్పట్లో కొనుగోళ్లంటే స్కాములే: ప్రధాని నరేంద్ర మోదీ

2014 కంటే ముందు దేశంలో రక్షణ కొనుగోళ్లలన్నీ స్కాములతో నిండిపోయాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. తమ ప్రభుత్వం ఆత్మనిర్భర భారత్ దిశగా కొనసాగుతుందని..

Update: 2024-03-13 05:21 GMT
భారత ప్రధాని.. నరేంద్ర మోదీ

స్వాతంత్ర్యం వచ్చాక దేశ రక్షణ రంగ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రోఖ్రాన్ లో జరిగిన సాయుధ దళాల విన్యాసం తరువాత ఆయన ప్రసంగించారు. త్రివిధ దళాలకు చెందిన అత్యున్న నాయకులు ఆసీనులై ఉన్న వేదికపై నుంచి మాట్లాడిన మోదీ.. పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ చేసిన లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. దేశంలో జరిగిన మొదటి కుంభకోణం రక్షణ రంగంలో పాల్పడ్డారని, సరిహద్దు ప్రాంతాలు అభివృద్ధి చేస్తే, శత్రు దేశాలు వాటిని ఉపయోగించుకుని, మనపై దాడి చేస్తాయనే అర్థం లేని ఆలోచనలు చేశాయని దుయ్యబట్టారు.

2014లో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన తన నేతృత్వంలోని ప్రభుత్వం పాత విధానాలను తొలగించి రక్షణ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, స్వదేశీ శక్తితో ఎదిగేందుకు ప్రయత్నిస్తోందని వివరించారు. సైనిక దళాలు, వారి కుటుంబ సభ్యులు కూడా మోదీ గ్యారెంటీ అంటే ఏంటో చూశాయన్నారు.
వన్ ర్యాంక్, వన్ పెన్షన్
ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 'వన్ ర్యాంక్ వన్ పెన్షన్' (OROP) ఉదంతాన్ని ఉదహరిస్తూ, "నాలుగు దశాబ్దాలుగా సైనిక సిబ్బంది కుటుంబాలకు దీనిని అమలు చేస్తామని చెబుతూనే ఉన్నారని, కానీ తన ప్రభుత్వం హమీ ఇవ్వడమే కాకుండా అమలు చేసి చూపిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ‘రక్షణ అవసరాల కోసం భారత్‌ను విదేశాలపై ఆధారపడేలా చేశాయి’ అని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి విమర్శించారు. ప్రధానమంత్రి, 'భారత్ శక్తి' యుద్ద అభ్యాస్ గురించి వివరిస్తూ, పోఖ్రాన్ "భారతదేశం యొక్క 'ఆత్మనిర్భరత', విశ్వాసం, ఆత్మగౌరవం అను మూడు మూర్తులకు సాక్షిగా మారిందని అన్నారు.
"ఇది భారతదేశం యొక్క అణుశక్తికి సాక్షి అయిన పోఖ్రాన్, ఈ రోజు మనం ఇక్కడ 'స్వదేశికరన్ సే సశక్తికరణ్' (స్వదేశీకరణ నుంచి సాధికారత వరకు) బలాన్ని కూడా చూస్తున్నాము," అన్నారాయన.
సమీకృత ట్రై-సర్వీస్ ఫైర్‌పవర్ విన్యాసాలు పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో సుమారు 50 నిమిషాల పాటు జరిగాయి, ఇక్కడ భారతదేశం తన స్వదేశీ రక్షణ పరికరాల పరాక్రమాన్ని ప్రదర్శించింది. LCA తేజస్ ALH Mk-IV తుఫాకీ గర్జనలు శత్రుభయంకరంగా ఉన్నాయి. ప్రధాన యుద్ధ ట్యాంక్ అర్జున్, K-9 వజ్ర, ధనుష్, శరంగ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్‌లు ఫిరంగులతో గర్జించాయి.
దేశంలోని అత్యున్నత సైనికాధికారులతో పాటు, కొంతమంది ప్రత్యేక ప్రేక్షకులు వివిధ దేశాలకు చెందిన విదేశీ సర్వీస్ అటాచ్‌లు, స్థానిక పౌరులు రక్షణ సిబ్బంది రాజస్తాన్ కు చెందిన స్థానిక నాయకులు దీనిని వీక్షించారు.
'రక్షణ ఒప్పందాల్లో మోసాలు'
2014 కు ముందున్న ఒప్పందాలను ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని ప్రధాని మోదీ అన్నారు. విదేశీ ఒప్పందాలన్నీ కూడా కమిషన్ ప్రాతిపదకనే సాగాయని, దశాబ్దాల తరబడి వాటిని పెండింగ్ లో పెట్టేవారని దుయ్యబట్టారు. ఆఖరికి మందుగుండు సామగ్రి కొనాలన్నా, తగ్గించాలన్నా జాప్యం చేసేవారని విమర్శించారు.
"మన ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలను నాశనం చేశారు.. ఇప్పుడు మేము అదే ఫ్యాక్టరీలకు కొత్త జీవితాన్ని అందించి, వాటిని ఏడు పెద్ద కంపెనీలుగా మార్చాం.. హెచ్‌ఏఎల్‌ను పతనావస్థకు చేర్చితే.. ప్రస్తుతం హెచ్‌ఏఎల్‌ను రికార్డు స్థాయిలో లాభాలు గడించిన కంపెనీగా మార్చాం.. కార్గిల్ యుద్ధం తర్వాత కూడా CDS పదవిని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేస్తే.. పది ఏళ్లు ఉన్న వాళ్లు పట్టించుకోలేదు. మేము దానిని సాధించి చూపాం" అని చెప్పుకొచ్చారు.
"దశాబ్దాలుగా త్యాగాలు చేసిన మన వీర జవాన్లకు స్మారక చిహ్నాన్ని నిర్మించలేకపోయారు, ఈ బాధ్యత కూడా మా ప్రభుత్వం పూర్తి చేసింది, సరిహద్దు ప్రాంతాల్లో ఆధునిక మౌలిక సదుపాయాలను నిర్మించడానికి కూడా మునుపటి ప్రభుత్వం భయపడింది. కానీ, నేడు, అనేక ఆధునిక రహదారులను చూడవచ్చు. సరిహద్దు ప్రాంతాల్లో ఆధునిక సొరంగాలు నిర్మించాం.. నేడు మీరు అది చూస్తున్నారు" 'ఆత్మనిర్భర్ భారత్' (స్వయం సమృద్ధి కలిగిన భారతదేశం) లేకుండా అభివృద్ధి చెందిన భారతదేశాన్ని ఊహించలేమని ప్రధాని అన్నారు.
వంటనూనె నుంచి యుద్ధ విమానాల వరకు భారతదేశం స్వావలంబనను సాధించాలని నేను కోరుకుంటున్నాను. నేటి కార్యక్రమం ఆ సంకల్పంలో భాగమే. భారతదేశపు ట్యాంకులు, తుపాకులు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్ క్షిపణి వ్యవస్థల ఈ గర్జనను మీరు చూస్తున్నారు, "ఇది భారత్ శక్తి" అని ఆయన అన్నారు.
"ఆయుధాలు, మందుగుండు సామగ్రి, సైబర్, అంతరిక్షానికి కమ్యూనికేషన్ వ్యవస్థ ఇలా అనేకం మేడ్ ఇన్ ఇండియా, అభివృద్ది చెందిన భారత్ శక్తి పోరాటాన్నిమనం అనుభవిస్తున్నాము, మా పైలట్లు నేడు భారతదేశంలో నిర్మించిన తేజస్ యుద్ధ విమానాలు, అధునాతన తేలికపాటి హెలికాప్టర్, తేలికపాటి యుద్ధ విమానాలను నడుపుతున్నారు, ఇది భారత్ శక్తి. ," అని మోదీ పేర్కొన్నారు, పూర్తిగా భారతదేశంలో తయారు చేయబడిన జలాంతర్గాములు, డిస్ట్రాయర్లు, విమాన వాహక నౌకలను భారత నావికులు ఉపయోగిస్తున్నారు, సైన్యం భారతదేశంలో తయారైన అర్జున్ ట్యాంకులు, ఫిరంగి తుపాకీలతో సరిహద్దులను కాపాడుతోంది.
మోదీ తన ప్రసంగంలో గత 10 సంవత్సరాలలో రక్షణ ఉత్పత్తికి సంబంధించిన డేటాను కూడాను వివరించాడు.
ఈ పదేళ్లలో స్వదేశీ సంస్థల నుంచి దాదాపు రూ.6 లక్షల కోట్ల విలువైన రక్షణ పరికరాలను కొనుగోలు చేశారు. ఈ కాలంలో, రక్షణ ఉత్పత్తి రెండు రెట్లు పెరిగింది, అంటే లక్ష కోట్ల రూపాయలను అధిగమించింది. గత 10 ఏళ్లలో 150కి పైగా డిఫెన్స్ స్టార్టప్‌లు వచ్చాయని చెప్పారు. 1,800 కోట్ల విలువైన ఆర్డర్లు ఇవ్వాలని సాయుధ బలగాలు నిర్ణయించాయని మోదీ తెలిపారు.


Tags:    

Similar News